E-Paper
Advertisement

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ కొమరం..

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ కొమరం..
Advertisement

Jabardasth Komaram:సరైన పాత్ర పడాలే గానీ.. తమలోని టాలెంట్ ను నిరూపించుకుంటాం అంటూ ఎంతోమంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి ఉన్నప్పటికీ.. సరైన గుర్తింపు లేక ఒక్క ఛాన్స్ అంటూ చెప్పులు అరిగేలా ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ తమ వద్దకు వచ్చే చిన్నాచితకా పాత్రలతో జీవితాన్ని వెల్లదీస్తూ ఎంతోమంది తెరవెనుకే ఉండిపోయారు. అయితే అలాంటి ప్రతిభావంతులను వెలికి తీసి వారికంటూ అవకాశం కల్పిస్తే.. తెరపై వారు విజృంభిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ల అవుతున్నా.. 12 ఏళ్లుగా తనపై పడ్డ కొమరక్క అనే ముద్రను చెరిపివేసి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందించిన డైరెక్టర్ శివ నిర్వాణకు పాదాభివందనం అంటూ లైవ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు జబర్దస్త్ కొమరం (Jabardasth komaram). మరి అసలేమైందో ఇప్పుడు చూద్దాం.

లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ కొమరం..

ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ (Siva nirvana) దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ(Raviteja ) తాజాగా నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ , యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇరుముడి (Irumudi). ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించగా.. అందులో జబర్దస్త్ కొమరక్క అలియాస్ కొమరం స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకుంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

also read:కామెడీతో పాటు ఎమోషన్స్.. ఓజీ డైలాగ్స్ తో ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్!

12 ఏళ్లుగా ఏర్పడిన ముద్రను చెరిపేశారు – కొమరం

వేదికపై మైక్ పట్టుకున్న కొమరం మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు అయిపోయింది. గత 12 ఏళ్లుగా కేవలం కొమరక్క అనే ఒక లేడీ గెటప్ కే నన్ను పరిమితం చేశారు. ఆ వాడు ఎప్పుడూ లేడీ గెటప్ చేస్తాడు అంటూ గేలి చేశారు. అయితే అది ఆమె పాత్ర.. ఆమె ఒక లెజెండ్.. అది నేను కాదు.. నాతో కలిసి ఒకే రూమ్ లో ఉన్న వాళ్ళు, నా స్నేహితులు సుమారుగా 15 మంది ఇప్పుడు దర్శకులుగా ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. వాళ్ళు ఎవ్వరికీ కూడా నాలో ఉన్న నటుడు కనిపించలేదు. కనీసం ఒక్క అవకాశం ఇవ్వాలని కూడా వారు ఆలోచించలేదు.

నా జీవితాన్నే ‘నాగులు’ పాత్ర మార్చేసింది – కొమరం

Advertisement

కానీ నాతో ఎలాంటి పరిచయం లేకపోయినా దర్శకుడు శివ నిర్వాణ నాపై నమ్మకం ఉంచి ‘నాగులు’అనే ఒక కీలకమైన పాత్ర ఇచ్చారు. మొదట లేడీ గెటప్ అన్నప్పుడు అందరిలాగే ఈయన కూడా ఏదో ఒక సాధారణ పాత్ర ఇచ్చి ఉంటారు అనుకున్నాను . కానీ రవితేజ సార్ కాలర్ పట్టుకుని కొట్టే సన్నివేశం ఉందని చెప్పినప్పుడు ఒక్కసారిగా భయంతో చెమటలు పట్టాయి. అసలు ఫైట్లే చేయని నన్ను నమ్మి , ఆ క్యారెక్టర్ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ చూసినా నాగులు అంటూ నన్ను పిలుస్తున్నారు.

జీవితాంతం రుణపడి ఉంటాను – కొమరం

ముఖ్యంగా నా విషయంలో నా భార్య ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేది కాదు.. కానీ గత మూడు రోజులుగా నా పాత్రను ప్రశంసిస్తూ వస్తున్న ఫోన్ కాల్స్ కి ఆమె ఉబ్బి తబ్బిబవుతోంది. నా భార్య, పిల్లల కళ్ళల్లో ఎన్నడూ చూడని సంతోషం కనిపిస్తోంది. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు మీకు పాదాభివందనం.. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు కొమరం.

?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

Related News

లగ్జరీ కారు కొన్న ప్రేమలు హీరో.. ఖరీదు ఎంతంటే?

శ్రీ విష్ణులో ఇంత టాలెంటా? హీరో కాకపోయి ఉంటే?

త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ మరో సంచలన పోస్ట్..!

ఈ ఎడిటర్ కు ప్రొడ్యూసర్ కంటే బిల్డప్ ఎక్కువ.. మంచి సినిమాలను నాశనం చేస్తున్నాడుగా?

తెలుగింటి కోడలుగా అడుగు పెట్టబోతున్న నిధి అగర్వాల్.. అబ్బాయి ఎవరంటే?

వివేక్ ఆత్రేయ రవితేజ RT 78 టైటిల్ పై బిగ్ అప్డేట్!

రామాయణ నుండి బిగ్ అప్డేట్.. కైకేయి పాత్రలో స్టార్ హీరోయిన్!

నాగచైతన్య వర్సెస్ నితిన్.. బాక్సాఫీస్ వార్ లో గెలిచేదెవరు?

Big Stories

Advertisement
×