E-Paper
Advertisement

‘గాడ్ ఆఫ్ మాసెస్’ కి పర్ఫెక్ట్ టైటిల్ పడ్డట్టేనా? అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే?

‘గాడ్ ఆఫ్ మాసెస్’ కి పర్ఫెక్ట్ టైటిల్ పడ్డట్టేనా? అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే?
Advertisement

NBK 111 Movie: నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఆరుపదుల వయసు దాటినా.. వరుసగా యాక్షన్ పెర్ఫార్మెన్సులు ఇస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.. బాలయ్య తెరపై కనిపించారు అంటే.. తెర వెనుక ఆయన ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. ప్రేక్షకుడికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి తనను తాను పూర్తిగా నటనకే అంకితం చేస్తూ.. ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. అలాంటి ఈయన ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో NBK 111 పేరుతో సినిమా చేస్తున్నారు.

బాలయ్య మూవీ పై క్రేజీ న్యూస్..

ముఖ్యంగా కాకినాడ పోర్టులో ఈ సినిమా కీలక సన్నివేశాలు షూటింగ్ చేస్తున్న సమయంలో బాలకృష్ణ సడన్గా కాలుజారి కింద పడ్డారు.. ఆ సమయంలో ఆయన మోకాలికి దెబ్బ తాకగా .. ఇటీవలే సర్జరీ కూడా చేయించుకొని, విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఒకవైపు బాలకృష్ణ విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ .. సినిమా షూటింగ్ ఆగిపోకుండా మిగతా నటీనటులతో బాలయ్య లేని సన్నివేశాల షూటింగ్ ను పూర్తిచేయాలని మేకర్స్ కి తెలిపారు.. ఇకపోతే సెప్టెంబర్ మూడవ వారంలో బాలకృష్ణ తిరిగి షూటింగ్లో పాల్గొనబోతున్నారు అనే కామెంట్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ రెండు పేర్లు తెగ వైరల్ అవుతున్నాయి.

బాలయ్య మూవీ కోసం రెండు టైటిల్స్..

Advertisement

బాలయ్య మూవీ ఎన్.బి.కె 111 కోసం దాదా , గాడ్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు.. కానీ గాడ్ టైటిల్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఒకవేళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు ఈ సినిమాకి గాడ్ అనే టైటిల్ ని కనుక ఫిక్స్ చేస్తే.. గాడ్ ఆఫ్ మాసేస్ కి గాడ్ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయినట్టే అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ టైటిల్ ని అనౌన్స్ చేస్తారో చూడాలి. వినాయక చవితి సందర్భంగా కొత్త టైటిల్ విడుదల చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

ALSO READ:పెళ్లిపై కామాక్షి క్రేజీ రియాక్షన్?

రెండక్షరాల టైటిల్ పై హీరోల ఆసక్తి..

Advertisement

ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా ఈ సినిమా పేరు గనక గాడ్ అయితే ఇక హీరోలంతా రెండక్షరాల టైటిల్ పైనే ఆసక్తి చూపిస్తున్నారా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతాయి. ఇప్పటికే అల్లు అర్జున్ (Allu Arjun), అట్లీ(Atlee ) డైరెక్షన్లో చేస్తున్న సినిమా టైటిల్ రాకా(Raaka ). దీనికి తోడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ), బాబి కొల్లి (Bobby kolli) డైరెక్షన్లో చేస్తున్న సినిమా పేరు కాకా(Kaaka).. ఇక బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేసే మూవీ పేరు గాడ్ అయితే మాత్రం హీరోలందరూ రెండక్షరాల టైటిల్ పైనే ఆసక్తి చూపిస్తారా? అనే కామెంట్స్ కూడా వ్యక్తమవుతాయి. మరి ఈ రెండక్షరాల టైటిల్స్ హీరోలకి ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.

NBK 111 మూవీ విశేషాలు..

వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ ఏడాది డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. మరి రెండు టైటిల్స్ కూడా మాస్ క్యాచీ టైటిల్స్ కావడంతో దేనిని ఫైనల్ చేస్తారో చూడాలి.

Related News

తెలుగింటి కోడలుగా అడుగు పెట్టబోతున్న నిధి అగర్వాల్.. అబ్బాయి ఎవరంటే?

వివేక్ ఆత్రేయ రవితేజ RT 78 టైటిల్ పై బిగ్ అప్డేట్!

రామాయణ నుండి బిగ్ అప్డేట్.. కైకేయి పాత్రలో స్టార్ హీరోయిన్!

నాగచైతన్య వర్సెస్ నితిన్.. బాక్సాఫీస్ వార్ లో గెలిచేదెవరు?

‘కామ్రేడ్ కళ్యాణ్’ పై ఫైర్ అవుతున్న మెగా ఫాన్స్.. ఆ డైలాగ్స్ కారణమా?

ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించిన విజయ్ దేవరకొండ… వాటిని తొలగించాలంటూ!

సుమలతకి అనుకూలంగా హైకోర్టు.. అసోసియేషన్ ఎన్నికలకు బ్రేక్!

భయపడితే ముందుకు వెళ్లలేం… కత్రినా కైఫ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×