E-Paper
Advertisement

కామెడీతో పాటు ఎమోషన్స్.. ఓజీ డైలాగ్స్ తో ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్!

కామెడీతో పాటు ఎమోషన్స్.. ఓజీ డైలాగ్స్ తో ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్!
Advertisement

Rambha Urvashi Menaka Trailer: ఒకప్పుడు కామెడీ చిత్రాలతో.. తనదైన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకొని భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న నరేష్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ‘అల్లరి’ సినిమాతో హీరోగా మారి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. పదుల సంఖ్యలో సినిమాలు చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. మంచి సూపర్ హిట్ విజయాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అల్లరి నరేష్ (Allari Naresh) కెరీర్లో అనూహ్యంగా ఫ్లాప్ లు ఎదురవడంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరం అయ్యారు. రీ ఎంట్రీలో జానర్ మార్చి నాంది అనే ఒక సీరియస్ మోడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా వర్కౌట్ అయింది. కానీ ఆ తర్వాత వచ్చిన అదే తరహా సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక ఇప్పుడు మళ్లీ తాను నమ్ముకున్న పాత జానర్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

రంభ ఊర్వశి మేనక మూవీ నుండి ట్రైలర్..

‘ రంభ ఊర్వశి మేనక’ అనే కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అల్లరి నరేష్ హీరోగా, సురభి(Surabhi )హీరోయిన్ గా.. ప్రిషా సింగ్(Prisha Singh), విష్ణు ప్రియ(Vishnu Priya), రాశి సింగ్(Rashi Singh) శ్రీనివాస్ రెడ్డి, వీకే నరేష్, వెన్నెల కిశోర్, హరితేజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. చిత్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ , హాస్య మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక సెప్టెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.

ట్రైలర్ ఎలా ఉందంటే?

Advertisement

ఊర్వశి మేనక ట్రైలర్ ఎలా ఉందంటే.. స్వర్గ లోకం నుండి రంభ ఊర్వశి మేనక భూలోకంకి వచ్చినప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై.. అసలు ప్రజలు మిమ్మల్ని ఎలా చూస్తారో తెలుసా? చీర్ గర్ల్స్ గా చూస్తారు అంటూ రంభ ఊర్వశి మేనక ఇంద్రలోకాన్ని వదిలి భూలోకం రావడం పై ఇంద్రుడు అసహనం వ్యక్తం చేస్తాడు. ఇక వీరు భూమిపై ప్రత్యక్షం అవ్వగానే.. వయసుతో తేడా లేకుండా పండు ముసలి వాళ్లు కూడా వీళ్ళని ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతే బాగుండు అంటూ తమ క్యూరియాసిటీని చూపించారు.ఇక ముగ్గురు ప్రత్యక్షమవగానే ఒక పెద్ద లిస్ట్ చూపించి నేను లిస్టు చదువుతూ ఉంటాను. మీరు తథాస్తు అనండి అంటూ అల్లరి నరేష్ ఆ ముగ్గురితో చెబితే.. మానవ ఒక తప్పిదం జరిగిపోయింది అంటూ తాము పోగొట్టుకున్న పవర్ కలిగిన కంకణాల విషయాన్ని చెబుతారు. మధ్యలో అల్లరి నరేష్, శ్రీనివాస్ రెడ్డి , వికె నరేష్ మధ్య సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. యమధర్మరాజు పాత్రలో అజయ్ ఆకట్టుకున్నారు. “సుకుమార్ లాగా కాంప్లికేటెడ్ గా కాకుండా అనిల్ రావిపూడిలా కామెడీగా ఆలోచించు ” అంటూ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది .

also read: బిగ్ బాస్ ను రిజెక్ట్ చేసిన కామాక్షి.. ఎందుకంటే?

పవన్ కళ్యాణ్ డైలాగ్స్ తో అల్లరి నరేష్ రాంపేజ్..

Advertisement

ఇక అప్పటివరకు కామెడీతో సాగిన ట్రైలర్ అనూహ్యంగా ఎమోషనల్ మలుపు తీసుకుంటుంది. లవ్ బ్రేకప్ ,తల్లి హాస్పిటల్ పాలవడం అనుకోని సంఘటనలు హీరోని ఒక్కసారిగా చుట్టుముడతాయి. ఇంద్రుడు సాధారణ మానవుడితో గేమ్స్ ఆడి చాలా కాలం అయింది అంటూ తన భార్యతో చెప్పే డైలాగు నాటి ఎన్టీఆర్ గారి సినిమాలను గుర్తు చేస్తుంది. ఆ తర్వాత హీరో కం బ్యాక్ అవడం, ఇంద్రుడిని ఆటాడుకోవడం బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికైతే అల్లరి నరేష్ శైలి హాస్యంతో పాటు స్వర్గలోక నేపథ్యం, సంభాషణలు వినోదాన్ని పంచుతున్నాయి. ముఖ్యంగా కామెడీతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను కట్టిపడేయనున్నాయి. ఇక ట్రైలర్ చివరిలో అల్లరి నరేష్ పవన్ కళ్యాణ్ ఓజీ డైలాగు “వాషి ఓ వాషీ” అంటూ తనదైన శైలిలో రీ క్రియేట్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తానికైతే ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసిందని చెప్పవచ్చు.

Related News

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ కొమరం..

‘గాడ్ ఆఫ్ మాసెస్’ కి పర్ఫెక్ట్ టైటిల్ పడ్డట్టేనా? అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే?

ప్రియురాలి మెడలో తాళి కట్టిన తెలుగు హీరో ప్రిన్స్.. ఫోటోలు వైరల్!

యుద్ధం ప్రకటించిన శుక్రాచార్యుడు.. మహాకాళి రిలీజ్ డేట్ లాక్!

మాధురిని కావాలనే టార్గెట్ చేశారా..? వీడియోతో క్లారిటీ వచ్చేసిందిగా..

టాలీవుడ్ లో మరో చర్చ.. ఇరుముడి Vs టాక్సిక్.. నిర్మాతల మధ్య గొడవ..?

మైత్రీ vs దిల్ రాజు — ఈ వారమే అసలు పరీక్ష!

Big Stories

Advertisement
×