E-Paper
Advertisement

ప్రియురాలి మెడలో తాళి కట్టిన తెలుగు హీరో ప్రిన్స్.. ఫోటోలు వైరల్!

ప్రియురాలి మెడలో తాళి కట్టిన తెలుగు హీరో ప్రిన్స్.. ఫోటోలు వైరల్!
Advertisement

Actor Prince: బస్ స్టాప్, డీజే టిల్లు వంటి చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్న యంగ్ హీరో ప్రిన్స్ సెసిల్ (Prince cecil)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు . ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ వన్ తో తన పాపులారిటీని అమాంతం చేసుకున్న ఈయన.. ఇప్పటికీ అడపా దడపా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ దూసుకుపోతున్నారు. హీరో గానే కాకుండా విలన్ గా కూడా ఆకట్టుకుంటూ అందరిని అలరిస్తున్న ఈయన.. ఎట్టకేలకు ఇటీవల లవ్ లో పడ్డానని, నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

పెళ్లి చేసుకున్న ప్రిన్స్ సెసిల్..

అయితే ఇప్పుడు ఎట్టకేలకు తన ప్రేయసితో ఏడడుగులు వేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు ప్రిన్స్ సెసిల్.. కామన్ ఫ్రెండ్ పెళ్లి ద్వారా సాయి ప్రతిమ (Sai Prathima) తో పరిచయం ఏర్పడగా.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లికి దారితీసింది. ఈ నటుడు న్యూజిలాండ్ లోని వనకాలో సాయి ప్రతిమను హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఎరుపు రంగు పట్టు చీరలో ఒంటినిండా నగలతో మహారాణిని తలపించిన సాయి ప్రతిమ.. అటు ప్రిన్స్ ఐవరీ కలర్ ప్రింటెడ్ పైజామాతో మహారాజు గెటప్ లో ఆకట్టుకున్నారు.

పెళ్లి పీటలపై అందరి దృష్టిని ఆకర్షించిన నూతన జంట..

Advertisement

మొత్తానికి అయితే ఈ ఇద్దరు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు గెటప్ లో చాలా చూడముచ్చటగా ఉన్నారని చెప్పాలి. మొత్తానికైతే తెలుగు సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, నెటిజన్స్, సినీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నూతన వధూవరులు జీవితాంతం ప్రేమ, ఆనందం, ఐక్యతతో సంతోషంగా జీవించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ALSO READ:యుద్ధం ప్రకటించిన శుక్రాచార్యుడు.. మహాకాళి రిలీజ్ డేట్ లాక్!

ప్రిన్స్ సెసిల్ , సాయి ప్రతిమ పరిచయం వ్యక్తిగత జీవితం.

Advertisement

ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లిలో సాయి ప్రతిమతో ప్రిన్స్ సెసిల్ కి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. వీరిద్దరికి కామన్ ఫ్రెండ్ ఎవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి (Priyadarshi) పైగా వీరిద్దరి నిశ్చితార్థ వేడుకలో ప్రియదర్శి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మొత్తానికి అయితే ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి అక్కడ పరిచయం పెంచుకొని.. ప్రేమికులుగా మారి ఇప్పుడు ఎట్టకేలకు వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు.

ప్రిన్స్ సెసిల్ కెరియర్..

డీజే టిల్లు, స్కంద వంటి చిత్రాలలో విభిన్నమైన పాత్రలతో మెప్పించిన ఈయన బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్లో సందడి చేశారు.. బస్ స్టాప్, నీకు నాకు డ్యాష్ డ్యాష్ వంటి చిత్రాలతో యువతకు చేరువయ్యారు. ఇక ఇప్పుడు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

Related News

‘కామ్రెడ్ కళ్యాణ్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. శ్రీవిష్ణు హిట్ కొట్టాడా..?

నానా పటేకర్ ఒక దుష్టుడు.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్, తిట్టి పోస్తున్న జనం!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ ట్రైలర్ రిలీజ్!

‘ రామాయణ’ చిత్ర నిర్మాత ఆఫీసులపై ఐటీ దాడులు!

హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?

సైనికుడిగా సేవలు, జీతంలో 90 శాతం రైతులకు.. నానా పటేకర్ గురించి తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

సేనాపతి ఈజ్ బ్యాక్.. ‘ఇండియన్ 3’ నుంచి అదిరిపోయే అప్డేట్ !

నానా పటేకర్ భార్య గురించి తెలియని విషయాలు?

Big Stories

Advertisement
×