Director Teja: సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత కొత్త వాళ్ళు వస్తుంటే, పాత వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులుగా, హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. అయితే వాళ్ళు చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకుల మదిలో అలా గుర్తుండిపోతారు. ఇలా తక్కువ సినిమాలు చేసి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శకుడు తేజ(Teja) ఒకరు. చిత్రం, నువ్వు నేను వంటి బ్యాక్ టు బ్యాక్ టు సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న తేజ ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి.
కోటి రూపాయలు ఫైన్…
ఇక దర్శకుడు తేజ ఏ విషయం గురించి అయినా ఎంతో ముక్కు సూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడుతారు. ఏ విషయాన్ని మనసులో దాచుకోకుండా ఈయన బయటకు మాట్లాడటం వల్ల ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పటికే సినీ సెలబ్రిటీల గురించి పలు సందర్భాలలో తేజ మాట్లాడిన మాటల కారణంగా వివాదాలలో నిలిచారు. అయితే కేవలం తన నోటి దూల కారణంగా కోటి రూపాయలు ఫైన్ కట్టినట్టు ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తేజ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. అసలు కోటి రూపాయలు ఫైన్ కట్టడం ఏంటి? ఏం జరిగింది? అనే విషయానికి వస్తే…
సినిమా పోతుందని ముందే చెప్పడం…
తేజ ముక్కుసూటి మనిషి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా విడుదలకు ముందు సినీ సెలెబ్రిటీల కోసం ప్రీమియర్ వేస్తుంటారు. ఇలా ప్రీమియర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉందనే అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకుంటారు. సాధారణంగా సినిమా ఎలా ఉన్నా బయటకు వచ్చిన తర్వాత మాత్రం సినిమా బాగుందని చెబుతారు. కానీ తేజ మాత్రం సినిమా చూసిన తర్వాత ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాదని, ఫెయిల్ అవుతుందని చెప్పారట. అయితే సినిమా విడుదలైన తర్వాత తేజ చెప్పిన విధంగానే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ సినిమా నిర్మాతలు ఫిలిం ఛాంబర్(Film Chamber) లో తేజ పై కంప్లైంట్ చేసినట్లు వెల్లడించారు. తేజ గారు సినిమా పోతుందని చెప్పడం వల్లే సినిమాకు అలాంటి ఫలితం వచ్చిందని ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించారు.
ఇలా నా గురించి ఫిలిం చాంబర్లో ఫిర్యాదు చేయడంతో అప్పట్లో సినీ గురువు దాసరి నారాయణరావు(Dasari Narayanaro) గారు ఫైన్ కట్టాల్సిందేనని కోటి రూపాయలు ఫైన్ (rs 1 cr fine) కట్టించారంటూ అసలు విషయం బయటపెట్టారు. కేవలం నోటి దూల కారణంగా కోటి రూపాయలు నష్టపోయాను అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. అయితే ఆ సినిమా ఏంటి అనే వివరాలు మాత్రం తెలియజేయలేదు. ఇక తేజ సినిమాల విషయానికి వస్తే ఎంతోమంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈయన ఇటీవల కాలంలో అనుకున్న స్థాయిలో మాత్రం సినిమాల ద్వారా సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఇక చివరిగా దగ్గుబాటి అభిరామ్(Daggubhati Abhiram) ను హీరోగా పరిచయం చేస్తూ తేజ అహింస(Ahimsa) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
Also Read: Manjummel Boys Case: పోలీసుల అదుపులో
మంజుమ్మేల్ బాయ్స్ సౌబిన్ .. రూ.7 కోట్లు ఎగవేత!