Manjummel Boys Case: మంజుమ్మేల్ బాయ్స్ (Manjummel Boys)మలయాళ చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన ఈ సినిమా 2024 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ సినిమా కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా విడుదలై ఇక్కడ కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంది. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దా ఊహించని విధంగా విజయం సాధించడంతో నిర్మాతలు కూడా భారీ లాభాలను అందుకున్నారు.
40% లాభాలలో వాటాలు..
ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నిర్మాత అలాగే నటుడు సౌబిన్ షాహిర్ (Soubin Shahir)ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. అసలు నటుడు సౌబిన్ ను పోలీసులు అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇన్వెస్టర్ సిరాజ్ వలియతురు(Siraj Valiyathura) దాదాపు ఏడు కోట్ల రూపాయల వరకు సినిమా కోసం ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాలలో 40% వాటా ఇస్తామని చిత్రబృందం తెలియచేయడంతో ఇన్వెస్టర్ సిరాజ్ ఏడుకోట్ల రూపాయల వరకు డబ్బులను పెట్టుబడిగా పెట్టినట్టు తెలుస్తుంది.
7 కోట్ల రూపాయలు ఎగవేత..
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకొని దాదాపు 200 కోట్ల కలెక్షన్లు వచ్చినప్పటికీ ఇన్వెస్టర్ సిరాజ్ కు ఇవ్వాల్సిన లాభాలతో పాటు ఆయన పెట్టుబడిగా పెట్టిన ఏడు కోట్ల రూపాయలు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన నేపథ్యంలోనే ఈయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఇలా డబ్బు విషయంలో తనని మోసం చేసినట్టు స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్న నేపథ్యంలో పోలీసులు సౌబిన్ తో పాటు తన తండ్రి బాబు షాహిర్ (Babu Shahir)నిర్మాత షాన్ ఆంటోనీ(Shawn Antony) లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక నేరం కేసులో భాగంగా వీరిని పోలీసులు అరెస్టు చేయడంతో వెంటనే ఈ ముగ్గురు బెయిల్ తెచ్చుకొని స్టేషన్ నుంచి విడుదలైనట్టు తెలుస్తుంది. ఆర్థిక నేరం కేసులో భాగంగా వీరు మోసం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. అయితే ఆధారాలు పరిశీలించిన కోర్టు వీరుకు బెయిల్ తిరస్కరించినప్పటికీ మరోసారి వీరు బెయిల్ పిటిషన్ వేయడంతో షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
ఆర్థిక నేరం…
ఇలా కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేయడమే కాకుండా అవసరమైనప్పుడు విచారణకు హాజరు కావాలని సూచించారు. ఇక ఈ కేసు విచారణలో భాగంగా దాదాపు కొన్ని గంటల తరబడి ఆర్థిక లావాదేవీల గురించి ప్రశ్నించడమే కాకుండా వీరి వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ ఆర్థిక నేరం కేసులో భాగంగా పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక మంజుమ్మేల్ బాయ్స్ సినిమా విషయానికి వస్తే.. చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పరవ ఫిలింస్ పతాకంపై సౌబిన్ షాహిర్ , బాబు షాహిర్, షాన్ ఆంటోని నిర్మాతలుగా వ్యవహరించారు.
Also Read: Roja -Anasuya: అత్తా అంటూ అనసూయకు ఘోర అవమానం.. ఫీలింగ్స్ చచ్చాయంటూ?