BigTV English

OTT Movie : సైకలాజికల్ ట్రాప్ లో పడేసే మూవీ… క్రైమ్, కన్ఫ్యూజ్, మైండ్ గేమ్స్ ఉన్న మూవీ

OTT Movie : సైకలాజికల్ ట్రాప్ లో పడేసే మూవీ… క్రైమ్, కన్ఫ్యూజ్, మైండ్ గేమ్స్ ఉన్న మూవీ

OTT Movie : ఈ రోజు మన మూవీ సజెషన్ ఈ మంచి మలయాళం ఇండిపెండెంట్ యాక్షన్-థ్రిల్లర్. ఒక గ్రామంలో ఎద్దు తప్పించుకుని పారిపోవడం వల్ల ఏర్పడే గందరగోళం, మానవ స్వభావంలోని క్రూరత్వం వంటి ఇంట్రెస్టింగ్ థీమ్‌లతో ఈ చిత్రం మిమ్మల్ని కట్టిపడేస్తుంది. అద్భుతమైన సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, ఉత్కంఠభరిత కథాంశంతో ఈ సినిమా మలయాళం న్యూ వేవ్ సినిమా ఉద్యమంలో ఒక మైలురాయిగా నిలిచింది. మరి ఇలాంటి అద్భుతమైన సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? మూవీ పేరేంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…


కథలోకి వెళ్తే…
కథ కేరళలోని ఒక మారుమూల గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ కాలన్ వర్కీ (చెంబన్ వినోద్ జోస్) అనే కసాయి, తన హెల్పర్ ఆంటోనీ (ఆంటోనీ వర్గీస్)తో కలిసి ప్రతి రోజూ తెల్లవారుజామున ఒక ఎద్దును వధించి, దాని మాంసాన్ని మార్కెట్‌లో అమ్ముతాడు. ఒక రోజు వధకు సిద్ధంగా ఉన్న ఎద్దు తాడు తెంచుకుని కొండల్లోని అడవిలోకి పారిపోతుంది. అదే సమయంలో గ్రామంలో ఒక చోట్లో మంటలు అంటుకుంటాయి. గ్రామస్థులు దీనిని ఆ ఎద్దు గడ్డి కోసం చేసిన పనిగా భావించి, దానిని వేటాడేందుకు బయలు దేరతారు.

ఈ వేట ఒక సాధారణ ప్రయత్నంగా మొదలై, గ్రామంలోని పురుషుల మధ్య అసూయ, పోటీ, క్రూరమైన స్వభావాన్ని బయట పెడుతుంది. అది ఒక హింసాత్మక గందరగోళంగా మారుతుంది. ఈ క్రమంలో ఎద్దు రబ్బర్ తోటలను, ఒక డ్రింక్స్ బండిని ధ్వంసం చేస్తుంది. గ్రామంలోని బ్యాంకుతో సహా, అన్ని ప్రాంతాలను నాశనం చేస్తుంది. గ్రామస్థులు ఎద్దును పట్టుకోవడంలో ఫెయిల్ అవుతూనే ఉంటారు. అదే టైమ్ లో వారి మధ్య ఉన్న వ్యక్తిగత శత్రుత్వాలు, సామాజిక తరగతుల విభేదాలు, పురుషాహంకారం బయటపడతాయి. ఆంటోనీ, వర్కీల మధ్య ఒక మహిళ (సంతి బాలచంద్రన్) గురించి పోటీ, అలాగే ఇతర గ్రామస్థుల మధ్య ఉన్న ఘర్షణలు కథను మరింత ఇంటెన్స్ గా మారుస్తాయి. మరి చివరికి ఈ పోటీ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? ఆంటోని, వర్కిల గొడవ ఏమైంది? క్లైమాక్స్ ఏంటి? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.


Read Also : ఓర్ని.. స్క్విడ్ గేమ్ ఎండింగ్ మొత్తం మార్చేశారు కదా? విన్నర్ ఎవరంటే?

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ అదిరిపోయే మలయాళ యాక్షన్ ఎంటర్టైనర్ పేరు ‘జల్లికట్టు’ (Jallikattu). S. హరీష్ రాసిన “మావోయిస్ట్” అనే చిన్న కథ ఆధారంగా తెరకెక్కింది. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీ లిజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళం యాక్షన్-థ్రిల్లర్. ఆంటోనీ వర్గీస్ (ఆంటోనీ), చెంబన్ వినోద్ జోస్ (వర్కీ), సబుమోన్ అబ్దుసమద్, సంతి బాలచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 91 నిమిషాల రన్‌టైమ్‌తో ఉంటుంది. ఈ మూవీకి హింస, తీవ్రమైన సన్నివేశాల కారణంగా A రేటింగ్‌ రావడం గమనార్హం. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie’s: ఘాటీ, మదరాసి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : పిచ్చి అమ్మాయిలను కిరాతకంగా అనుభవించే సైకో డాక్టర్… బ్లాక్ మార్కెట్ లో బాడీ పార్ట్స్… భయంకరమైన రియల్ స్టోరీ సామీ

OTT Movie : ముసలోడే కానీ మహానుభావుడు… ఆడవాళ్లు కన్పిస్తే అదే పని… అవార్డు విన్నింగ్ మలయాళ మూవీ

OTT Movie : పని మనిషితో ఇంటి ఓనర్ రాసలీలలు… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న హర్రర్ మూవీ

OTT Movie : నల్ల క్యాబ్ లో నరకానికి పంపే దెయ్యం… గర్భిణులను టార్గెట్ చేసి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ

OTT Movie : దొంగతనానికి వెళ్లి దిక్కుమాలిన పని… వీడియో తీస్తూ దారుణంగా… విష్ణు ప్రియ ఇలాంటి పాత్రలోనా ?

Big Stories

×