E-Paper
Advertisement

ముగ్గురు సభ్యులుంటే.. ఇద్దరికే రేషన్ బియ్యం!

ముగ్గురు సభ్యులుంటే.. ఇద్దరికే రేషన్ బియ్యం!
Advertisement

Ration Rice: రేషన్‌ బియ్యం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ దౌల్తాబాద్‌ మండలం మాచినపల్లి గ్రామానికి చెందిన ఎల్లబోయిన సత్తయ్య అధికారులకు ఫిర్యాదు చేశారు. తన రేషన్‌ కార్డులో ముగ్గురు కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నప్పటికీ డీలర్ భూషణం ఇద్దరికి మాత్రమే రేషన్‌ బియ్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై రేషన్‌ డీలర్‌ భూషణం ను ప్రశ్నించగా.. ఇద్దరికే బియ్యం వస్తుందని సమాధానం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మాచిన్పల్లి గ్రామానికి చెందిన..

ఫిర్యాదు వివరాల ప్రకారం.. మాచిన్పల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారుడు రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందిస్తున్న రేషన్‌ బియ్యం తమకు ఎంతో ఆధారంగా ఉందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్ణయించిన పూర్తి పరిమాణంలో, పారదర్శకంగా బియ్యం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.

Advertisement

Also Read: మీ తాటాకు చప్పుళ్లకు భయపడను.. దమ్ముంటే ఆధారాలు చూపించు.. మంత్రి పొంగులేటి ఫైర్!

ముగ్గురు సభ్యులున్నా.. ఇద్దరికే?

తన రేషన్‌ కార్డులో మొత్తం ముగ్గురు కుటుంబ సభ్యులు ఉన్నారని ఫిర్యాదుదారుడు తెలిపారు. అయితే గత మూడు నెలలుగా రేషన్‌ షాపు నంబర్‌ 3808001కు వెళ్లినప్పుడు తనకు ఇద్దరు సభ్యులకు మాత్రమే బియ్యం ఇస్తున్నారని ఆరోపించారు. మూడో సభ్యుడికి ఎందుకు బియ్యం ఇవ్వడం లేదని డీలర్‌ను ప్రశ్నించగా.. తమకు ఇద్దరికే బియ్యం వస్తుందని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

విచారణ జరిపి న్యాయం చేయాలి

Advertisement

ముగ్గురు సభ్యులు ఉన్న రేషన్‌ కార్డుకు ఇద్దరికి మాత్రమే బియ్యం అందుతున్న అంశంపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపించాలని లబ్ధిదారుడు కోరుతున్నారు. పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యంలో కోతలు లేకుండా పూర్తి పరిమాణంలో పంపిణీ జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Also Read: బాలయ్య అసలు సీక్రెట్ బయటపెట్టిన సిద్ధు జొన్నలగడ్డ!

Tags

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×