E-Paper
Advertisement

బాలయ్య అసలు సీక్రెట్ బయటపెట్టిన సిద్ధు జొన్నలగడ్డ!

బాలయ్య అసలు సీక్రెట్ బయటపెట్టిన సిద్ధు జొన్నలగడ్డ!
Advertisement

Siddu Balakrishna:సిద్దు జొన్నల గడ్డకి , బాలయ్య కి మంచి ఫ్రెండ్ షిప్ ఉందన్న సంగతి తెల్సిందే.అయితే ఇదే విషయం పై చెఫ్ మంత్ర అనే షోలో అసలు విషయం చెప్పుకొచ్చాడు సిద్దు జొన్నలగడ్డ.తాజాగా ఒక షో లో పాల్గొన్న సిద్దుని “మీకు బాలయ్య సర్‌తో ఫ్రెండ్‌షిప్‌ ఉందని తెలుసు కదా?” అంటూ ప్రశ్నించడంతో.. వారి స్నేహం పై క్లారిటీ ఇలా క్లారిటీ ఇచ్చాడు.

బాలయ్య చాలా కూల్‌

మొదట్లో బాలయ్యతో అంత క్లోజ్‌ ఫ్రెండ్‌షిప్‌ ఏర్పడుతుందని అనుకోలేదని చెప్పిన ఆయన.. కొన్ని సార్లు కలిసిన తర్వాత మంచి బాండింగ్‌ ఏర్పడిందని తెలిపారు. బాలయ్య చాలా కూల్‌గా ఉంటారని, ఆయనతో కలిసి సమయం గడిపే అవకాశం కూడా తనకు వచ్చిందని చెప్పారు.

నాకు తెలిసిన బాలయ్య వేరే 

Advertisement

బయట కనిపించే బాలయ్య ఇమేజ్‌ ఒకలా ఉంటే.. తనకు పరిచయమైన బాలయ్య మరోలా ఉంటారని చెప్పడం ఇక్కడ హైలెట్. సాధారణంగా బాలయ్య అంటే పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, మాస్‌ యాటిట్యూడ్‌, ఎనర్జీ గుర్తొస్తాయి. కానీ ఆయనతో వ్యక్తిగతంగా కలిసిన వాళ్లు మాత్రం చాలా సరదాగా, ఆప్యాయంగా ఉంటారని చెప్పడం కొత్తేమీ కాదు.ఆ విషయాన్నే చెప్పుకొచ్చాడు సిద్దు జొన్నలగడ్డ.ఇక ఈ షోలో సిద్దు తో పాటు తెలుసు కదా సినిమాలో తనతో పాటు కలిసి చేసిన రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కూడా కలిసి పాలోనడం విశేషం.

‘డీజే టిల్లు’తో ఫుల్ క్రేజ్ 

సిద్దు జొన్నల గడ్డ విషయానికి వస్తే 2013లో ‘జోష్’ సినిమాతో నటుడిగా పరిచయమయిన సిద్దు  ‘లైఫ్ బిఫోర్ వెడ్డింగ్’, ‘గుంటూరు టాకీస్’, ‘కృష్ణ అండ్ హిస్ లీలా’, ‘మా వింత గాథ వినుమా’ వంటి సినిమాల్లో నటించాడు.అయితే సిద్దు కెరీర్ ని మార్చేసిన సినిమా మాత్రం ‘డీజే టిల్లు’ అని చెప్పాలి. విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యూత్ ని ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఏ ఈవెంట్ లో చూసినా ‘డీజే టిల్లు’ టైటిల్స్ సాంగే మారుమ్రోగిపోయింది.

Advertisement

also read :పెళ్లికి ముందు జరగాల్సినవి ముందే అయిపోతున్నాయి–శాంతి స్వరూప్‌ వైరల్ కామెంట్స్

అయితే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన జాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో కాస్త స్లో అయిన సిద్దు ఇపుడు డీజే టిల్లు 3 తో రాంబో అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది.చూడాలి మరి తెలుసా కదా తో అలరించలేకపోయిన సిద్దు ఈ సినిమాలతోనైనా మునుపటి ఫామ్ ని అందుకుంటారో లేదో .

ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో !

ఇక సిద్దు బాలయ్య తో తనకున్న స్నేహాన్ని చెప్పడంతో మా బాలయ్య బాబు అంతే ..బంగారం అంటూ మురిసిపోతున్నారు నందమూరి అభిమానులు. ఏది ఏమైనా బాలయ్య అంటే కొడతాడు అన్న ముద్రని మరోసారి సిద్దు జొన్నలగడ్డ చెరిపెశాడనే చెప్పాలి. చూడాలి మరి సిద్దు చేసిన ఈ కామెంట్స్ పై ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో !

Tags

Related News

ఆ రోజు వచ్చేసరికి నేను చనిపోయి ఉంటా.. తేజ వైరల్ కామెంట్స్

చెత్త యానిమేషన్ అని తిట్టారు.. రూ.లక్షతో తీస్తే కోట్లు కొల్లగొడుతోంది

విశ్వంభర ..ఒకప్పుడు ఫుల్ హైప్ – ఇప్పుడు నో హోప్ !

‘కాకా’ మెగా 158 టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ లాక్.. సంబరాలు సిద్ధం చేస్కో!

మాటలు కాదు.. చేతల్లో చూపిస్తా: అనసూయ స్ట్రాంగ్ మెసేజ్

సెన్సార్ పూర్తి చేసుకున్న రవితేజ ‘ఇరుముడి’.. రన్ టైమ్ లాక్!

దేవా మళ్లీ దిగుతున్నాడట.. సలార్ 2పై ఇంట్రెస్టింగ్ న్యూస్

Big Stories

Advertisement
×