E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మాంత్రికురాలు దెబ్బకు షాక్.. విల్లాలో దెయ్యాలు.. ఓ ఆట ఆడుకున్న బాలు..

Gundeninda GudiGantalu Today episode: మాంత్రికురాలు దెబ్బకు షాక్.. విల్లాలో దెయ్యాలు.. ఓ ఆట ఆడుకున్న బాలు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode May4th: తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చెప్పిన గురూజీ లోపలికి వెళ్ళిన తర్వాత మనోజ్ గాలి తీసేస్తాడు. ఇక రోహిణి కూడా అడ్డంగా ఇరుక్కుని ఎలా కనిపిస్తుంది. మొత్తానికి తర్జనభజన పడి ఆ ఇంటి పేరు రోమతి అని చెప్తాడు. రోమతి ఏంటి శాంతి నిలయం అని పెడితే బాగుంటుంది కదా అని సత్యం అంటాడు. స్వామీజీకి తెలిసినంతగా మీకు తెలుసా మీరు ఆగండి కాసేపు అని ప్రభావతి అంటుంది. రోమతి ఏం బాగుంది రోజ్ నిలయం అని పెడితే ఇంకా బాగుంటుంది కదా అని కామాక్షి అంటుంది. మొత్తానికి ఈ ఇద్దరూ కాసేపు కామెడీగా అందరిని నవ్వించేస్తారు. రోమతి అనే పేరు ఫిక్స్ చేసుకోండి అని అతను కచ్చితంగా చెప్తాడు ఇక 20,000 ఫీజు అనగానే అందరూ నోర్లు వెళ్ళబెట్టుకొని చూస్తారు. ఏంటి 20,000 ఫీజా అని బాలు కూడా షాక్ అవుతాడు. ఇక మనోజ్ ఆ డబ్బులు ఇచ్చేస్తాడు. మొత్తానికి ఇంటి పేరు కూడా పెట్టేసామని చాలా సంతోషంగా ఉంటారు మనోజ్..

దెయ్యాల మాంత్రికురాలు ఎంట్రీ.. 

న్యూమరాలజిస్ట్ ఆర్మోహం డబ్బులు ఇస్తే వెళ్లిపోతాను అని చెప్పగానే మనోజ్ బాలు ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇక చేసేదేమీ లేక మనోజ్ డబ్బులు ఇచ్చేస్తాడు. ఇక మనం ఆవిడొస్తుంది ఆవిడ కోసం వెయిట్ చేద్దాం పదండి అనేసి మణికంఠ అంటాడు.. ఆవిడ ఆవిడ ఎవరు..? ఎందుకు వస్తుంది అని బాలు తో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా సందేహంగా అడుగుతారు.. ఇంట్లో ఏదైనా దెయ్యాలు లేదా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే ఆవిడ చూసుకుంటారు. దయ్యాలు ఉంటే గాజు సీసాలో బంధిస్తారు అని మనోజ్ చెప్తాడు. ఇక ఆవిడ కోసమని అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఆవిడ రాగానే ఆవిడని చూసి అందరూ షాక్ అవుతారు..

దొంగ అని కనిపెట్టిన మీనా.. 

Advertisement

ఆ దెయ్యాల రాణి వచ్చి రాగానే కాబాషతో మాట్లాడుతూ అందరిని తెగ భయపెట్టేస్తుంది. మీనా ఇది కా భాష నాకు బాగా తెలుసండి అని అనగానే బాలు అవునా నీకు నిజంగానే తెలుసా అని అంటాడు. అందరిని ఒకసారి పరీక్షించిన ఆవిడ ప్రభావతిలో దయ్యం ఉంది అని చెప్తుంది. ఈవిడ దొంగ మంత్రగత్తండి. ఇవి చెప్పేది అసలు నమ్మకండి అని మీనా ఎంత చెప్తున్నా సరే మనోజ్ మాత్రం వినకుండా మీకేం తెలీదు అని అంటాడు. ఇక ఈ ఇంట్లో దెయ్యం ఉందా లేదా అని తెలుసుకోవడానికి లైఫ్ లో ఆపేస్తారు. అయితే ఇంట్లో దెయ్యం లేదని ఆవిడ కన్ఫర్మ్ చేస్తుంది..

బాలు దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. 

మీరందరూ ఈ లాంతరు వైపే చూడండి అని ఆ దయ్యాల మంత్రగత్తె అంటుంది. అందరూ దాని వైపు చూస్తూ ఉండగా ఒక్కసారిగా లైట్లు ఆగిపోతూ ఆన్ అవుతూ ఉంటాయి. అది చూసిన అందరూ నిజంగానే ఇంట్లో దెయ్యం ఉందేమో అని కంగారు పడిపోతూ ఉంటారు.. ఆ దెయ్యాల రాణి కూడా ఈ ఇంట్లో నిజంగానే దెయ్యం ఉందేమో అని భయపడిపోతూ ఉంటుంది. ఇంట్లో ఏ దయము లేదన్నారు కదా మరి ఇదేంటి అని ప్రభావతి అడుగుతుంది. ఇక తర్వాత బాలు వచ్చి నేనే మెయిన్ ఆఫ్ చేశాను అని చెప్పగానే అందరూ బాలు పై సీరియస్ అవుతారు. ఆమె కూడా 20,000 తీసుకుని వెళ్ళిపోతుంది.

ఇంటిని అమ్మేందుకు మనోజ్ ప్లాన్..

Advertisement

లోన్ ఇవ్వడానికి బ్యాంకు వాళ్లు ఇంటికి వస్తారు.. వాళ్లు ఇల్లంతా చూసి రెండు కోట్లు ఇస్తామని అంటారు.. అయితే ఇంకా 70 లక్షలు కావాల్సి వస్తుంది కదా మనం ఏం చేయాలి అని రోహిణి మనోజ్ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు.. అయితే ప్రభావతి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి భోజనం తీసుకురా అని బాలుతో చెప్తుంది. బాలు వెళ్లి భోజనం తీసుకొని వస్తాడు. మీరందరూ బయటకు వెళ్ళండి నేను అమ్మానాన్న తో మాట్లాడాలి అని మనోజ్ అంటాడు.. ఏం మాట్లాడినా అందరి ముందే మాట్లాడాలి అని సత్యం కూడా అనడంతో మనోజ్ ఆ ఇంటిని అమ్మేద్దామని అడుగుతాడు. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఆ ఇంట్లో మాకు ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి అమ్మడానికి వీల్లేదు అని అందరూ అంటారు. ప్రభావతి కూడా ఆ ఇంటి నమ్మడానికి వీలు లేదు అని చెప్పగానే బాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు..

అడ్డంగా ఇరుక్కున్న రోహిణి..

70 లక్షలు లేకుండా ఎలా ఇంటిని కొనగలం అత్తయ్య అని రోహిణి అడుగుతుంది. ఎందుకు కొనలేం కొనడానికి ఒక మార్గం ఉంది అని ప్రభావతి అంటుంది. జైల్లో ఉన్న మీ నాన్నని ఆ 70 లక్షలు అడుగు అని ప్రభావతి అనగానే రోహిణి ఫీజులు ఎగిరిపోతాయి. మీ నాన్న లేకుండా ఉంటే ఏమీ మీ మామయ్య ఉన్నాడు కదా ఆయన అడుగు అని అంటుంది. అటుచి ఇటు వచ్చి నేనే అడ్డంగా ఇరుక్కున్నానా అని రోహిణి అనుకుంటుంది.. విద్య కు ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్తుంది.. డబ్బులు లేవు అని తన మలేషియా మావయ్య చెప్పాడు అని రోహిణి ప్రశ్నలు సమాధానాలు తానే చెప్పడంతో మీనా బాలుకి అనుమానం వస్తుంది. మరి రోహిణి బండారం బాలు బయట పెడతాడా లేదా అన్నది చూడాలి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : చక్రీ మాటతో కన్నా కన్నీళ్లు.. సెంటిమెంట్ తో ఏడ్పించేశారు.. కన్నాను కొట్టిన మహా..ట్విస్ట్ ఇదే..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×