Muhammad Furqan Bhatti On IND VS SL: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026 ) భాగంగా నిన్న జరిగిన తొలి సెమీ ఫైనల్స్ సందర్భంగా టీమిండియా ఘోరంగా ఓడి ఇంటి దారి పట్టింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి.. నేరుగా ఫైనల్ కు దూసుకెళ్లింది. టీమ్ ఇండియా ఓటమిపై పాక్ స్పోర్ట్స్ జర్నలిస్టు ఫుర్ఖాన్ భట్టి ( Muhammad Furqan Bhatti ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కర్మ ఎవరినీ వదిలి పెట్టదని, అందుకే గతంలో చేసిన పాపాలు ఇప్పుడు టీమిండియాను వేధిస్తున్నాయన్నాడు. ఈ తరుణంలోనే లంక చేతిలో చిత్తుగా ఓడిపోయారని బాంబు పేల్చాడు.
పాకిస్తాన్ క్రికెటర్లను అనవసరంగా హర్షిత్ రాణా దూషించాడని.. ఇప్పుడు టీమిండియాకు తగిన శాస్తి జరిగిందని ఫుర్ఖాన్ భట్టి ( Muhammad Furqan Bhatti ) ఫైర్ అయ్యాడు. హర్షిత్ రాణా చేసిన తప్పిదాలు..ఇప్పుడు టీమిండియాను వెంటాడి వేధిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడు చేసిన పాపాల వల్ల టీమిండియాకు ఈ దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026 ) ప్రారంభంలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా ఉందని పాకిస్తాన్ జర్నలిస్టు ఫుర్ఖాన్ భట్టి పేర్కొన్నాడు. తన అంచనాల ప్రకారం పాకిస్తాన్ కంటే టీమిండియా అనే బలంగా ఉందని.. వాళ్లే టైటిల్ గెలుస్తారని ముందుగా అనుకున్నట్టు చెప్పుకొచ్చాడు. కానీ పాకిస్తాన్ తో మ్యాచ్ సందర్భంగా తమ ప్లేయర్ల పట్ల హర్షిత్ రాణా లాంటి రెచ్చిపోయి ప్రవర్తించాడని ఫైర్ అయ్యాడు. మొదటి బంతి నుంచి చివరి వరకు పాకిస్తాన్ క్రికెటర్లను హర్షిత్ రానా వేధించాడని మండిపడ్డాడు.
ఆ పాపాలే ఇప్పుడు టీమిండియాను వేధించి.. చిత్తుగా ఓడించాయని ఆగ్రహించాడు. శ్రీలంకతో జరిగిన సెమీ ఫైనల్ పోరులో 300కు పైగా పరుగులు చేసినప్పటికీ టీమిండియా కాపాడుకోలేదని చురకలు అంటించాడు. తిలక్ వర్మ సేన ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈ సెమిస్ ఆడిందన్నాడు. యూఏఈ పై గెలిచినట్టుగానే శ్రీలంకపై దూకుడుగా వెళ్లాలని ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియా చేసిందని తెలిపాడు. కానీ వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ లాంటి ఆటగాళ్లు కీలక మ్యాచ్ లో విఫలమయ్యారని.. ఈ క్రమంలో ఓడిపోవాల్సిన వచ్చిందని తెలిపారు. కానీ పాకిస్తాన్ అభిమానులు మాత్రం టీమిండియా గెలవాలని పూజలు చేసినట్టు పేర్కొన్నాడు. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఉంటేనే మజా వచ్చేదని కానీ అదృష్టం ఈ సారి లేదంటూ వ్యాఖ్యానించాడు.