E-Paper
Advertisement

హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ యత్నం.. చితకబాదిన స్థానికలు!

హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ యత్నం.. చితకబాదిన స్థానికలు!
Advertisement

Child Kidnap Attempt: స్వేచ్చ బ్యూరో: దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో చిన్నారుల కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి ఇద్దరు చిన్నారులను చాక్లెట్ల ఆశ చూపి ఆటోలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం గమనించిన స్థానికులు అప్రమత్తమై ఆ వ్యక్తిని పట్టుకున్నారు.

ఆటోలో ఎక్కించుకునే ప్రయత్నం..

స్థానికుల కథనం ప్రకారం.. కాలనీలో ఇద్దరు చిన్నారుల వద్దకు వచ్చిన సదరు వ్యక్తి చాక్లెట్లు ఇస్తానంటూ వారిని తన వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అనంతరం వారిని ఆటోలో ఎక్కించుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే అతడిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే కొందరు స్థానికులు ఆ వ్యక్తిపై దాడి చేసినట్లు సమాచారం. అతడిని అదుపులోకి తీసుకుని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు అక్కడికి చేరుకుని అనుమానితుడిని తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిసింది.

Advertisement

Also read: స్కూళ్లలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరి చేయలేం.. సుప్రీంకోర్టు సంచలనం!

పలు గుర్తింపు కార్డులు స్వాధీనం

అనుమానితుడి వద్ద పోలీసులు పలు గుర్తింపు కార్డులను గుర్తించినట్లు సమాచారం. ఒక్కో కార్డుపై ఒక్కో పేరు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడి వివరాలు, గుర్తింపు, గత చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. చిన్నారులను నిజంగానే కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడా? లేక ఘటనకు మరేదైనా కారణముందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుడి నుంచి వివరాలు సేకరించి ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను నిర్ధారించే పనిలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Also read: ప్రియాంక జైన్ సీరియల్స్ ఎందుకు మానేసిందో తెలుసా?

Tags

Related News

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

రేవంత్, కేటీఆర్ ఆస్తుల చిట్టాల డ్రామా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!

రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు

రాజన్న గుడికి కాంక్రీటా?.. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు.. కల్వకుంట్ల కవిత ఫైర్

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్!

అంగన్‌వాడీ కేంద్రంలో ఊడిపడ్డ స్లాబ్ పెచ్చులు.. స్పాట్‌లో 5 గురు చిన్నారులు..!

Big Stories

Advertisement
×