E-Paper
Advertisement

వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Advertisement

Bhatti Vikramarka: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హిల్ట్ పాలసీ అమలు, పర్యాటక రంగంలో పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సెక్రటేరియట్ లో వనరుల సమీకరణపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ..

Advertisement

సివిల్‌ సప్లై, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా ప్రభుత్వ భూములను సమర్థవంతంగా వినియోగించుకోవడం, వాటి విలువను పెంచడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం, పర్యాటక రంగంలో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అధికారులకు ఆదేశాలు..

Advertisement

అదనపు ఆదాయ వనరులను గుర్తించడంతోపాటు పెట్టుబడులను ఆకర్షించే ప్రాజెక్టులను వేగంగా కార్యరూపంలోకి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తులు, భూముల ద్వారా గరిష్ఠ ఆర్థిక ప్రయోజనం పొందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. హిల్ట్ పాలసీ లో ఎలాంటి అభ్యంతరాలు లేని పార్కులకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన క్లియరెన్స్‌ ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. తద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని వేగంగా సమీకరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

Also Read: పీపీపీ పేరుతో రాష్ట్రం అమ్మకానికి? చంద్రబాబు, లోకేష్‌లపై పేర్ని నాని సంచలన ఆరోపణలు

Tags

Related News

సీఎం ఆదేశాలతో పొన్నం సుడిగాలి పర్యటనలు.. ఆర్టీసీ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి!

హైదరాబాద్ OYO రూమ్‌లలో వరుస హత్యలు.. 10 రోజుల్లో ముగ్గురు అమ్మాయిల బలి.. అసలు ఏం జరుగుతోంది?

భూపాలపల్లి ఆస్పత్రిలో తప్పిన పెను ప్రమాదం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర ఆగ్రహం

ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు.. ఈసారి ప్రత్యేకం ఏంటో తెలుసా?

పిచ్చోడికి గుడులు కూల్చడమే తెలుసా? రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్!

సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ మాస్టర్ స్ట్రోక్.. ఆ పద్మశాలి నేత ఎవరు? కాంగ్రెస్‌లో హీటెక్కిన రేస్!

బార్‌లో వార్.. రోడ్డుపై రివేంజ్! ఈసీఐఎల్ కారు యాక్సిడెంట్ వెనుక దాగిన కోణం ఇదే!

Big Stories

Advertisement
×