E-Paper
Advertisement

ట్రైలర్‌కు బాలయ్య.. ప్రీ రిలీజ్‌కు ఎన్టీఆర్.. అదిరిపోయే ప్లాన్!

ట్రైలర్‌కు బాలయ్య.. ప్రీ రిలీజ్‌కు ఎన్టీఆర్.. అదిరిపోయే ప్లాన్!
Advertisement

Don’t Trouble the Trouble:డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’..బాలయ్య నోటి నుండి జాలు వారిన ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ఎంత ఫేమసో చెప్పక్కర్లేదు. చాలా మంది మీ మర్స్ కి మాంచి స్టఫ్ అయింది కూడా.ఇదిగో ఇపుడు ఆ పేరుతోనే ఒక సరికొత్త సినిమా రాబోతుంది.

అవును ..పుష్ప సిరీస్ లో షెకావత్ గా మనల్ని అలరించిన ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్ లో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అంటూ ఒక సరికొత్త సినిమా ఇపుడు ఆడియన్స్ ని పలకరించడానికి సిద్దమైంది.

Advertisement

స్పెషల్ గెస్ట్ గా యంగ్ టైగర్ తారక్

మన ముగ్గురి లవ్ స్టోరీ సిరీస్ తో అలరించిన శశాంక్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్ లో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయిపొయింది.ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో వేగం పెంచిన మూవీ టీమ్ త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమా ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా యంగ్ టైగర్ తారక్ రాబోతున్నాడని తెలుస్తుంది. ఇదే విషయన్ని సినిమాని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది కూడా.

Advertisement

సినిమాలో నటించిన పాప రాజమౌళి కొడుకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తికేయ వద్దకి వచ్చి మన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఎవరొస్తున్నారు అని అడగడం, దానికి సమాధానంగా కార్తికేయ తారక్ కి ఫోన్ చేయడం,వెంటనే చెప్పు నాన్నా అని అనడం, దానికి కార్తికేయ రియాక్ట్ అవుతూ అన్నా అనడం అంతా ఆ వీడియోలో కనిపిస్తుంది.

మొతానికి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ సెప్టెంబర్ 29న జె.ఆర్.సి. కన్వెన్షన్‌లో ఘనంగా,అది కూడా తారక్ సమక్షంలో జరగబోతుందని మేకర్స్ హింట్ ఇవ్వడంతో మురిసిపోతున్నారు నందమూరి ఫ్యాన్స్.

ట్రైలర్ రిలీజ్ చేసిన బాలయ్య 

ఇక ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ని బాలయ్యతో రిలీజ్ చేయించిన సంగతి తెల్సిందే.డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’..అనే డైలాగ్ బాలయ్య నోటి నుండి ఫేమస్ కాగా ఇపుడు అదే డైలాగ్ టైటిల్ గా వస్తున్న సినిమాకి బాలయ్యే ట్రైలర్ లాంచ్ చేయడం ఇక్కడ విశేషం.పైగా ఈ సినిమా దర్శకధీరుడు రాజమౌళి కాంపౌండ్ లో రానుండటంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

మరి బాలయ్య డైలాగ్ తో సినిమాగా వస్తున్న ఈ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఆడియన్స్ ని ఏ మేరకి అలరిస్తుందో వచ్చే నెల అక్టోబర్ 2న థియేటర్లలోనే చూడాలి !

 

Tags

Related News

శ్రీకాంత్ ఓదెలను దాసరితో పోల్చిన మోహన్ బాబు.. గ్రేట్ డైరెక్టర్ అంటూ!

ఇండస్ట్రీ ఎవడి అబ్బా సొత్తు కాదు.. మోహన్ బాబు కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి?

మలేషియాలో బ్యాన్ చేసిన కీర్తి సురేష్ బోల్డ్ మూవీ.. తెలుగులో రిలీజ్, ఎప్పుడంటే?

నాని, నేను మూతులు నాక్కుంటాం.. శ్రీకాంత్ ఓదెల కామెంట్స్ వైరల్

నాని ‘ది ప్యారడైజ్’ మూవీలో కేసీఆర్ ను అవమానించారు: కవిత

స్నిగ్ధ చేతిపై టాటూగా స్టార్ సింగర్ ఆటోగ్రాఫ్.. ఎవరిదంటే?

‘డోరతీ’ సినిమాలో కీర్తి సురేష్ అసభ్యకర సీన్ .. సోషల్ మీడియాలో నిరసన సెగ!

Big Stories

Advertisement
×