Awarapan 2 OTT: ఓ గ్యాంగ్‌స్టర్ తన గతాన్ని మర్చిపోయి ఒంటరి జీవితాన్ని గడుపుతుంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి అనుకోకుండా ఓ చిన్నారి వస్తుంది. ఆ అమ్మాయిని తన గత ప్రేమకు గుర్తుగా భావించి పెంచుకుంటాడు. కానీ అదే చిన్నారి ఓ ప్రమాదకరమైన క్రైమ్ నెట్‌వర్క్ చేతుల్లో చిక్కితే ? ఆమెను కాపాడేందుకు మళ్లీ తుపాకీ పట్టాల్సి వస్తే ? దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి వచ్చిన మూవీనే ‘అవారాపన్ 2’ (Awarapan 2). మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనేది తెలుసుకుందాం పదండి.
మొదటి పార్ట్ ‘అవారాపన్’ (Awarapan)లో జరిగిన విషాద ఘటనల తర్వాత 19 ఏళ్లు గడుస్తాయి. శివమ్ పండిట్ తన జీవితంలో జరిగిన ప్రేమ విషాదం నుంచి పూర్తిగా బయట పడలేకపోయినా, క్రైమ్ ప్రపంచానికి దూరంగా ఒంటరిగా జీవిస్తుంటాడు. ఓ రోజు అతనికి ఓ అనాథ చిన్నారి కనిపిస్తుంది. ఆ చిన్నారిని చూసిన శివమ్ కు తన గత ప్రేమికురాలు ఆలియా గుర్తుకు వస్తుంది. దీంతో ఆ అమ్మాయికి కూడా ఆలియా అనే పేరే పెడతాడు. ఆమెను ఓ అనాథాశ్రమంలో ఉంచి, ఆమె భవిష్యత్తు కోసం అవసరమైన సహాయం చేస్తుంటాడు.
కొంతకాలానికి ఓ కుటుంబం ఆ చిన్నారిని దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తుంది. తనతో ఉండటం కంటే కుటుంబంతో పెరగడం ఆమెకు మంచిదని భావించిన శివమ్, ఆమెను వెళ్లేందుకు ఒప్పిస్తాడు. కానీ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. ఆ కుటుంబానికి సంబంధించి అనుమానాస్పద విషయాలు బయట పడతాయి. ఆలియా అంతర్జాతీయ చైల్డ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ చేతుల్లో చిక్కిన విషయం శివమ్ కు తెలుస్తుంది. ఆలియాను వెతుక్కుంటూ శివమ్ బ్యాంకాక్‌కు వెళ్తాడు. అక్కడ రెండు ప్రత్యర్థి డ్రగ్ మాఫియా గ్రూపుల మధ్య పోరు జరుగుతుంటుంది. ఓ వైపు నఫీసా, మరోవైపు అమ్రిత్ కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తాయి.
అమ్రిత్ మరణం తర్వాత అతని కుమారుడు జోర్వార్ క్రైమ్ సామ్రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. శివమ్ తన ధైర్యంతో జోర్వార్ నమ్మకాన్ని సంపాదించి అతని గ్యాంగ్ లోకి ప్రవేశిస్తాడు. అక్కడ పాత అనుచరులు జేడీ, మెహమూద్ తో అతనికి విభేదాలు మొదలవుతాయి. ఇదే సమయంలో జోర్వార్ సోదరి జారాతో శివమ్ కు అనుబంధం ఏర్పడుతుంది. మరి ఆ చిన్నారికి ఎదురైన ప్రమాదం ఏంటి ? ఆమెను హీరో ప్రమాదం నుంచి తప్పించగలిగాడా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
ఇమ్రాన్ హష్మీ, దిశా పటానీ, షబానా ఆజ్మీ తదితరులు నటించిన ఈ సినిమాకు నితిన్ కక్కర్ దర్శకత్వం వహించారు. యాక్షన్, క్రైమ్, రొమాన్స్, డ్రామా అంశాలతో రూపొందిన ఈ సినిమా ఇదే ఏడాది ఆగస్టు 14 థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో రెంట్ బేసిస్ లో అందుబాటులోకి వచ్చింది.
Read Also: చనిపోయిన వ్యక్తి బాడీకి కాపలాగా వెళ్తే తెల్లారేసరికి శవం మాయం… క్రేజీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్