Dulquer Salman:ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయిన నేపథ్యంలో సెలబ్రిటీలకు సంబంధించిన అకౌంట్లను హ్యాక్ చేయడం లేదా ఫేక్ అకౌంట్లను వారి పేరు మీద క్రియేట్ చేసి సామాన్య ప్రజలను పెద్ద ఎత్తున మోసం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు జరిగే ఈ ఫేక్ అకౌంట్ మోసాలకు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ వీటికి చెక్ పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salman) కూడా సోషల్ మీడియాలో తన పేరుతో చలామణీ అవుతున్న ఫేక్ ఖాతాపై స్వయంగా స్పందించి , అభిమానులకు క్లారిటీ ఇచ్చారు.
కొన్ని రోజులుగా నా పేరుతో ఒక ఫేక్ అకౌంటు తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఆ ఫేక్ అకౌంట్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు.. dulQuer పేరుతో ఉన్న ఆ ఖాతా అసలైనది కాదు. అది పూర్తిగా ఫేక్ అకౌంటు. నేను మాట్లాడినట్లుగా నటిస్తూ.. ప్రతి చిన్న విషయానికి నా తరఫున వాళ్లే కామెంట్లు చేయడం వారికి సరదాగా మారింది. సినిమాలపై పోస్ట్లు పెట్టడం, తోటి నటీనటుల గురించి మాట్లాడటం, చివరికి నా కుటుంబ సభ్యులకు కూడా ఈ నకిలీ ఖాతా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఫేక్ అకౌంట్ చేస్తున్న తప్పుడు ప్రచారం వల్ల సోషల్ మీడియాలో అనవసర గందరగోళం , నెగిటివిటీ పెరుగుతోంది. ఈ నకిలీ ఖాతాను నమ్మి మోసపోవద్దు అంటూ అభిమానులను కోరారు. అంతేకాదు ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు కూడా దుల్కర్ సల్మాన్ తెలిపారు.
ఇకపోతే ఈ విషయాన్ని చెప్పిన దుల్కర్ సల్మాన్ అధికారిక ఎక్స్ సంస్థ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని ,రిప్లై కోసం ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. తన అభిమానులను, ఆ నకిలీ ఖాతాతో జాగ్రత్తగా ఉండాలని, తానే మెసేజ్లు పెడుతున్నానని నమ్మి ఎవరు మోసపోకండి” అంటూ కూడా ముందస్తు హెచ్చరిక చేశారు. మొత్తానికైతే దుల్కర్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా దుల్కర్ సల్మాన్ పేరుతో నడుపుతున్న ఈ ఫేక్ అకౌంట్ గురించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ALSO READ: మనకీ వాళ్లకీ తేడా ఏంటి? ఆ హీరో వివాదం వేళ సూర్య హితవు!
మహానటి చిత్రంలో జెమినీ గణేషన్ పాత్రతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈయన.. సీతారామం సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత లక్కీ భాస్కర్ తో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న దుల్కర్ సల్మాన్.. ప్రస్తుతం ఆకాశంలో ఒక తార అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. పవన్ సాధినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న తమిళ ప్రాజెక్టు పురాణనూరు అనే చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నారు. అలాగే సెల్వమని సెల్వరాజు దర్శకత్వం వహించిన బహు భాష చిత్రం కాంత లో కూడా నటిస్తున్నారు. సౌబిన్ షాహిర్ దర్శకత్వం వహిస్తున్న ఓతిరమ్ కడకం అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు.