E-Paper
Advertisement

సీబీఐ సంచలనం.. ఆపరేషన్ చక్ర తో నకిలీ సుప్రీంకోర్టు వెబ్‌సైట్ గుట్టు రట్టు!

సీబీఐ సంచలనం.. ఆపరేషన్ చక్ర తో నకిలీ సుప్రీంకోర్టు వెబ్‌సైట్ గుట్టు రట్టు!
Advertisement

CBI Operation Chakra:స్వేచ్ఛ బ్యూరో: డిజిటల్ అరెస్ట్ పేర నేరాలకు పాల్పడుతున్న సైబర్ క్రిమినల్స్ నెట్ వర్క్ ను ఛేధించటానికి సీబీఐ అధికారులు ఆపరేషన్ చక్ర పేర దేశవ్యాప్తంగా దాడులు చేశారు. 16 రాష్ట్రాల్లో 80కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరిపారు.సోదాలు చెన్నై, కోల్‌ కతాలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

సైబర్ మోసగాళ్లకు చెక్ పెట్టేందుకు సీబీఐ భారీ ఆపరేషన్

Advertisement

డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్న సైబర్ మోసగాళ్లకు చెక్ పెట్టేందుకు సీబీఐ భారీ ఆపరేషన్ ను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమబెంగాల్, మణిపూర్, కర్ణాటక, ఒడిశా తదితర 16 రాష్ట్రాల్లో దాదాపు 60 ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే డిజిటల్ ప్రాడ్ నెట్‌ వర్క్‌ 200కు పైగా సైబర్ ఫ్రాడ్ కేసుల్లో పాలుపంచుకున్నట్టుగా అధికారులు గుర్తించారు. నిందితులు షెల్ కంపెనీలను సృష్టించి మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా మోసాల ద్వారా కొల్లగొట్టిన డబ్బును లాండరింగ్ చేయడంలో కీలక పాత్ర పోషించారని తేల్చారు. దర్యాప్తులో దాదాపు 2 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో అధికారులు మొబైల్ ఫోన్లు, డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలు, బ్యాంకు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

సుప్రీం కోర్టు వెబ్ సైట్లా..

Advertisement

డిజిటల్ ఫ్రాడ్ నెట్ వర్క్ నిందితులు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెబ్‌ సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌ సైట్ ను సృష్టించి దాని ద్వారా ప్రజలను భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్నట్టు సీబీఐ దర్యాప్తులో తేలింది. నకిలీ కోర్టు ఉత్తర్వులు, ఫోర్జరీ పత్రాలు, దర్యాప్తు సంస్థల పేరుతో తయారు చేసిన డాక్యుమెంట్లను ఉపయోగించి సామాన్యులను మోసం చేస్తున్నట్టు గుర్తించింది. సుప్రీం కోర్టు రిజిస్ట్రీ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. డిజిటల్ మోసాల నెట్‌ వర్క్ కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాల్లోని ప్రజలను కూడా మోసం చేస్తున్నట్టు సీబీఐ గుర్తించింది. సంబంధిత దేశాల ఏజెన్సీలకు సమాచారం అందించి, వారితో సమన్వయం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపింది. ఈ డిజిటల్ ప్రాడ్ నెట్ వర్క్ కి సంబంధించి సీబీఐ మరిన్ని అరెస్టులు చేసే అవకాశం ఉంది.

అధికారుల సూచనలు..

ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. డిజిటల్ అరెస్ట్, ఫేక్ కోర్టు నోటీసులు, వీడియో కాల్ మోసాలకు పాల్పడే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అపరిచితుల నుంచి వచ్చే అరెస్ట్ బెదిరింపులు, ఫేక్ కోర్టు లింకులను పట్టించుకోవద్దన్నారు. సందేహం వస్తే వెంటనే స్థానిక పోలీసులు లేదా cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

Also Read: మెట్రో పిల్లర్ల కేసులో అసలు కథ ఇదేనా? బెయిల్ కోసం సెక్షన్లు తగ్గించేశారా?

Tags

Related News

తెలంగాణ టూరిజంలో సరికొత్త విప్లవం.. ఇక ఇంట్లో కూర్చునే హోమ్‌స్టే రిజిస్ట్రేషన్!

దిశ ఘటన జరిగిన చోటే మళ్లీ దారుణం.. శంషాబాద్‌లో మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగికదాడి యత్నం!

మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ఆటో ఢీకొని ముగ్గురు యువతులు మృతి!

గద్వాల జిల్లాలో విద్యార్థుల బస్సు బోల్తా.. తప్పిన పెద్ద ప్రమాదం!

వచ్చేవారం నుంచి దసరా సెలవులు.. ఈసారి రెండువారాలు, విద్యార్థుల్లో ఒకటే సందడి

అల్వాల్‌లో దారుణం.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య.. కారణం తెలిస్తే షాక్!

డిండి నీళ్లపై ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్‌ను లక్ష్యంగా చేసుకుని..

Big Stories

Advertisement
×