E-Paper
Advertisement

మనకీ వాళ్లకీ తేడా ఏంటి? ఆ హీరో వివాదం వేళ సూర్య హితవు!

మనకీ వాళ్లకీ తేడా ఏంటి? ఆ హీరో వివాదం వేళ సూర్య హితవు!
Advertisement

Actor Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya ) వరుస సినిమాలతో.. భారీ బ్లాక్ బస్టర్ విజయాలతో సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు ముఖ్యంగా సినిమాలతో ఏ రేంజ్ లో అయితే కలెక్షన్లు రాబడుతూ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. అదేవిధంగా అభిమానులకి కూడా హితవు పలుకుతూ సమయాన్ని, శక్తిని వృధా చేసుకోకండి.. జీవితంలో ఉన్నత ఆశయాలతో దృష్టి పెట్టండి అంటూ సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఒక హీరో వివాదం సోషల్ మీడియాలో నడుస్తున్న వేళ సూర్యా తన అభిమానులకు చేసిన ఈ హితబోధ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఎవరికి ఉపయోగం – సూర్య

గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల మధ్య జరుగుతున్న ఆన్ లైన్ వార్, అనవసర వివాదాలకు పుల్ స్టాప్ పెట్టాలి అంటూ ఆయన కామెంట్లు చేశారు. విమర్శించే స్థాయికి దిగజారవద్దని , ఎదుటివారిని మార్చడం అసాధ్యమని తన అభిప్రాయాలుగా చెప్పుకొచ్చారు. ఇటీవల తన అభిమాన సంఘాల ముఖ్య సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమైన సూర్య.. ఆన్ లైన్ వేదికలపై జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ.. ” సోషల్ మీడియాలో ఎవరో ఏదో పోస్ట్ చేశారని లేదా ట్రోల్స్ చేశారని మనం కూడా దానిపై తిరిగి స్పందిస్తే.. అసలు మనకు వాళ్లకు తేడా ఏంటి? ఎదుటి వాళ్ళను మార్చడం మన వల్ల కాదు.. కాబట్టి విమర్శలు చేసే వారికి సమాధానాలు చెబుతూ సమయాన్ని, శక్తిని వృధా చేసుకోకుండా.. వాళ్లను వాళ్లలాగే వదిలేసి, ప్రతిరోజు మనం చేసే పని, లక్ష్యాలపైనే దృష్టి పెడితే ఖచ్చితంగా విజయం లభిస్తుంది ” అంటూ అభిమానులకు దిశా నిర్దేశం చేశారు . ఎవరి పేరు ప్రస్తావించకుండా సోషల్ మీడియా ట్రోల్స్ పై స్పందించి అభిమానులకు హితబోధ చేశారు సూర్య.

ఆ హీరో వివాదం వేళ.. సూర్య కామెంట్స్ వైరల్..

Advertisement

ఇకపోతే సూర్య ఇక్కడ ఎవరి పేరును ప్రస్తావించలేదు . కానీ ఇటీవల కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జరిగిన పరిణామాలు, ఈ కామెంట్స్ వెనుక ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. విషయంలోకి వెళ్తే.. ఇటీవల ప్రముఖ కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) .. సర్దార్ 2, మండాడి చిత్ర బృందాలను అభినందిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్లు , ఇరువర్గాల అభిమానుల మధ్య పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలకు, ట్రోలింగుకు దారితీసాయి. ముఖ్యంగా నెట్టింట పరస్పరం దూషించుకునే స్థాయికి చేరిన ఈ వ్యవహారం పైనే సూర్య చాలా హుందాగా , సున్నితంగా స్పందించి వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారని నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనా సూర్య చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ: అలాంటి అమ్మాయే భార్యగా రావాలంటున్న బిగ్ బాస్ పవన్.. గొప్ప కోరికే!

సూర్య చిత్రాలు..

Advertisement

సూర్య సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ వంటి చిత్రాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం మలయాళ స్టార్ డైరెక్టర్ జీతూ జోసఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘సీన్’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Related News

రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. బయటపడ్డ నమ్మలేని నిజాలు!

ఫేక్ అకౌంట్..మోసపోవద్దు..ఫ్యాన్స్ కు దుల్కర్ రిక్వెస్ట్!

అర్ధరాత్రి ఆలయంలో పెద్ద సౌండ్ తో మ్యూజిక్.. పోలీసులకు అల్లు శిరీష్ ఫిర్యాదు..

చచ్చిపోతామని డ్రామా ఆడారు.. పూరి, ఛార్మి లీలలు బయటపెట్టిన ప్రొడ్యూసర్!

బూతులు తిడుతూ..చచ్చిపో అంటూ శాపాలు… రేణు దేశాయ్ ఎమోషనల్!

‘ముంజ్యా’ బ్యూటీ శర్వరీకి క్రేజీ అవార్డ్… ఆమె చేసిన సినిమాల లిస్ట్ ఇదే!

ప్రమోషన్లలో రణబాలి సరికొత్త స్ట్రాటజీ.. సినిమాకు ప్లస్ అయ్యేనా?

Big Stories

Advertisement
×