DCM Pawan Kalyan :ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ కి డీసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyothi krishna ) దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా చేశారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలోనే పవన్ కళ్యాణ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.. అసలు విషయంలోకి వెళ్తే.. ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రమోషన్స్ కోసం మంత్రిగా ఉంటూనే.. ప్రభుత్వ నిధుల్ని వాడుకున్న వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కోరుతూ.. పిటిషన్ దాఖలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్. పిటీషన్ ను స్వీకరించిన హైకోర్టు.. ఇందులో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల్ని ప్రతివాదులుగా చేర్చాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక విచారణకు ముందే వారికి నోటీసులు ఇవ్వాలని పిటీషనర్ చేసిన విజ్ఞప్తిని మాత్రం హైకోర్టు తోసిపుచ్చింది.
అధికార దుర్వినియోగం కేసులో పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్..
అసలు విషయంలోకి వెళ్తే.. మాజీ ఐఏఎస్ , లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి ఎస్ ఆర్ కె ఆర్ విజయ్ కుమార్ (GSRKR Vijay kumar) పవన్ కళ్యాణ్ పై పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిధులతో తన సినిమా హరిహర వీరమల్లు సినిమాను ప్రమోషన్ చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ లో ప్రజాప్రతినిధిగా ఉంటూ తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం, కలెక్షన్లు, లాభాల కోసం సినిమా టికెట్ ధరల పెంపుపై దృష్టి పెట్టారని ఆయన ఆరోపణలు చేశారు. అంతేకాదు ధరల పెంపుకు సంబంధించిన ఫైల్ ను తానే స్వయంగా ప్రాసెస్ చేసినట్లు కూడా పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అంతేకాదు సొంత సినిమా కావడంతో సొంత శాఖ కాకపోయినా ఫైల్ ను ఎలా ప్రాసెస్ చేస్తారు? దీనిని అధికార దుర్వినియోగం కిందే పరిగణించాలి.. అంటూ కూడా తన పిటీషన్ లో కోరారు.
పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలి – మాజీ ఐఏఎస్
అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి పనులు చేయడం నేరం. సినిమాలే జీవనోపాధి అంటున్న పవన్ కళ్యాణ్.. భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రవర్తన నియమావళిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు. అధికారం చేపట్టే ముందు వ్యాపారాలు, ఇతర ఆదాయ మార్గాలలో భాగస్వామిగా ఉండకూడదనే నిబంధన పవన్ కళ్యాణ్ కు తెలియదా? అంటూ కూడా ప్రశ్నించారు. అంతేకాదు ఆదాయం కోసమే సినిమాలలో నటిస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్.. బహిరంగంగానే తన తప్పును ఒప్పుకున్నారని కూడా తన పిటిషన్ లో పేర్కొన్నారు విజయ్ కుమార్.
ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తున్నారు – విజయ్ కుమార్
ప్రభుత్వ వనరులను, అధికారాన్ని దుర్వినియోగం చేసిన పవన్ కళ్యాణ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏసీబీ , డీజీ కి సీఎస్ కు లేఖ రాశారట. పవన్ కళ్యాణ్ మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసినా వారు పట్టించుకోకపోవడంతోనే.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు స్పష్టం చేశారు. ఇక హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ చేసుకోవడం, తన సినిమాకు టికెట్లు రేట్లు పెంచుకుంటూ ఆదేశాలు ఇచ్చుకున్నట్లు చెప్పుకోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని.. సిబిఐ దర్యాప్తు చేయించాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణను మరో వారం రోజులకు హైకోర్టు వాయిదా వేసింది. మొత్తానికి అయితే ఈ అంశం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెడకు చుట్టుకున్నట్లు సమాచారం.
also read:Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!
పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్ #Pawankalyan #HariHaraVeeraMallu #HHVM #IASVijayKumar #HighCourt @PawanKalyan pic.twitter.com/W08OfrGwjN
— BIG TV Cinema (@BigtvCinema) August 19, 2025