Fahadh Faasil uses 17 year old non-smartphone: పుష్ప చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. అక్కడ స్టార్ హీరో అయినప్పటికీ పుష్ప లో విలన్ గా నటించి మెప్పించాడు. ఈ హీరో విభిన్న స్టైల్ అనే విషయం తెలిసిందే. స్టార్ హీరో అయినప్పుడు సాధారణ లైఫ్ ని ఇష్టపడతాడు. సోషల్ మీడియా, మీడియాకు దూరంగా ఉంటాడు. ఆయన మీడియా ముందుకు చాలా అరుదుగా వస్తుంటాయి. అయితే ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఫాహాద్ ఫోన్ మాట్లాడుతూ కెమెరాలకు చిక్కాడు.
వైరల్ అవుతున్న ఫహాద్ ఫోన్
ఈ విజువల్స్ బయటకు రాగా.. అందరి ద్రష్టి ఆ ఫోన్ పై పడింది. అది ఐ ఫోన్ కాదు.. అలా అని స్మార్ట్ ఫోన్ కూడా కాదు. ఒక కీప్యాడ్ ఫోన్. అంత పెద్ద స్టార్ అయ్యిండు సాధారణమైన కీప్యాడ్ ఫోన్ వాడుతున్నాడనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే దీని ధర తెలిస్తే నోళ్లు వెల్లబెట్టాల్సిందే. ఏంటీ జస్ట్ కీప్యాడ్ ఫోన్ కే ధర అంత ఉంటుందా? షాక్ అవుతున్నారు. దీని ప్రత్యేకతలు ఆ రేంజ్ లో ఉన్నాయి మరి. మరి ఆ ఫోన్ ధర, ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.
17 ఏళ్ల నాటి ఫోన్.. ధరేంతంటే
ఫహాద్ ఫాజిల్ చేతిలో ఉన్న ఈ ఫోన్ 17 ఏళ్ల క్రితం ది. దాదాపు రెండు దశాబ్దాల క్రితమే ఈ మొబైల్ మార్కెట్ లోకి వచ్చింది. అప్పట్లో ధీని ధర రూ. 5.54 లక్షలు. ఇది అల్ట్రా లగ్జీరీ నాన్ స్మార్ట్ ఫోన్. 2007లో దీనిని ప్రకటించి.. 2008లో లాంచ్ చేశారు. లిమిటెడ్ ఫోన్ లు మాత్రమే మార్కెట్లోకి వచ్చాయి. వీటినిక సొంతం చేసుకున్న అతికొద్ది సెలబ్రిటీల్లో ఫాహాద్ ఒకరు. ఈ ఫోన్ ను టైటానియంతో తయారు చేశారట. నీలమణి స్పటికలతో పాటు చేతితో కుట్టిన లెదర్ తో పైభాగం కప్పబడి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్ మార్కెట్ అందుబాటులో లేదు.
అరుదైన హ్యాండ్ మేడ్ ఫోన్..
దీనిని కొనాలి అనుకునే వారు ప్రీ ఓన్డ్ వెబ్ సైట్లో కొనుక్కోవచ్చు. ప్రస్తుతం దీని ధర రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు ఉంది. ఈ ఫోన్ లో స్మార్ట్ లాంటి ఆధునిక ఫీచర్స్ లేనప్పటికీ.. దీని బ్రాండ్ వాల్యూ, అరుదైన డిజైన్ కారణంగా ప్రస్తుతం ఈ ఫోన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది. ఫహద్ లాంటి అగ్ర నటుడు చేతిలో ఈ కీప్యాడ్ ఫోన్ చూసి షాకైన దీని ఫీచర్స్ తెలిసి సర్ప్రైజ్ అవుతున్నారు. ఇప్పటీకే రెండు దశాబ్దాల కాలం నాటి ఫోన్ వాడుతండటం చూసి.. ఇది ఆయన నిరాడంబరతకు నిదర్శనం అంటూ కొనియాడుతున్నారు. ఇక ఫహాద్ సినిమాల విషయానికి వస్తే.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన భన్వర్ సింగ్ షెకవత్ అనే పోలీసు అధికారిగా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన నటించిన మారేసన్ మూవీ జూలై 25న విడుదలకు సిద్ధం అవుతుంది. మరోవైపు ‘ఒడుం కుతిర చాడుం కుతిర’, ‘కరాటే చంద్రన్’, ‘మారీసన్’ వంటి చిత్రాలతో పాటు మోహన్‌లాల్, మమ్ముట్టితో కలిసి ‘పేట్రియాట్’ చిత్రంలో కూడా నటిస్తున్నారు.
Also Read: స్క్విడ్ గేమ్‌లో బాలయ్య, అనసూయ.. పాపం రాజీవ్ కనకాల, ఎండింగ్ అదుర్స్