Nellore tallest building: ఏపీలోని ఓ నగరం ఆకాశానికే సవాలు విసురుతున్న శిల్పకళాభవనం వేగంగా రూపుదిద్దుకుంటోంది. ఎన్నడూ లేని ఎత్తులో, కనువిందు చేసే డిజైన్‌తో.. ఈ కట్టడం కేవలం నివాస గృహం మాత్రమే కాదు.. ఆ నగర అభివృద్ధికి ఒక ప్రతీకగా మారుతోంది. అసలు విషయం ఏమిటంటే..
నెల్లూరు నగరం ఇప్పటివరకు చూడని రీతిలో పెరుగుతోంది. సాధారణంగా చిన్న పట్టణాలుగా భావించబడే నగరాలు ఇప్పుడు మెట్రో నగరాల తరహాలో విస్తరిస్తున్నాయి. ఇటీవలి కాలంలో నెల్లూరులో జరుగుతున్న నిర్మాణాలు కూడా అదే దిశగా సంకేతాలిస్తున్నాయి. వాటిలోనే ఒకటి.. నగరంలో తొలిసారి 30 అంతస్థులతో నిర్మితమవుతున్న అతి ఎత్తయిన రెసిడెన్షియల్ టవర్.
నారాయణ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో భారీ నిర్మాణం
నారాయణ ఇంజినీరింగ్ కాలేజ్, ఎన్‌హెచ్-16 హైవే సమీపంలో నెల్లూరు వాసుల కలల నివాసంగా ఎదుగుతోంది ఈ మల్టీస్టోరీ ప్రాజెక్టు. DSR ఇన్‌ఫ్రా సంస్థ తీసుకువచ్చిన ఈ భవనం మొత్తం 30 అంతస్థులతో నిర్మితమవుతోంది. ఈ టవర్‌లో కేవలం 90 అపార్ట్‌మెంట్లు మాత్రమే ఉండటంతో, ప్రతి యూనిట్‌కు ఎంతో విశాలం, ప్రైవసీ లభించనుంది.
నెల్లూరులో మొదటి సారి 30 అంతస్థులు
ఇప్పటివరకు నెల్లూరు వంటి పట్టణాల్లో 15 అంతస్థులు దాటి వెళ్లిన భవనాలు అరుదు. అలాంటిది ఒకేసారి 30 అంతస్థుల రెసిడెన్షియల్ టవర్ ప్రారంభమవుతున్నది అంటే, అది నగర అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఇది కేవలం ఆస్తి వ్యాపారం కోసం నిర్మించిన భవనం కాదు.. ఇది నెల్లూరు మార్పును చాటే టవర్.
Also Read: Ice cream scam: ఐస్‌క్రీమ్ తింటున్నారా? వెలుగులోకి బిగ్ స్కామ్.. తస్మాత్ జాగ్రత్త!
కొద్ది దూరంలో మరో భారీ ప్రాజెక్టు
DSR The One ప్రాజెక్ట్‌కు దగ్గరలోనే, హరినాథపురం ప్రాంతంలో మరో భారీ నిర్మాణం కూడా ప్రగతిలో ఉంది. ఇది జీప్లస్ 23 అంతస్థులతో నిర్మితమవుతున్న ఇంకొక హైరైజ్ రెసిడెన్షియల్ టవర్. అదే ప్రాంగణంలోనే Unique Spire అనే 5 స్టార్ హోటల్ కూడా నిర్మాణ దశలో ఉంది. దీని వల్ల ఆ ప్రాంతం పూర్తిగా ఒక ప్రీమియం నివాస, వాణిజ్య హబ్‌గా మారనున్నది.
సిటీల లైఫ్ స్టైల్.. ఇప్పుడు నెల్లూరులో
ఇటువంటి భారీ ప్రాజెక్టులు సాధారణంగా హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో సిటీల్లో కనిపిస్తాయి. కానీ ఇప్పుడు నెల్లూరులోనూ ఆ తరహా లైఫ్ స్టైల్ అందుబాటులోకి వస్తోంది. అధునాతన డిజైన్, అధిక భద్రత, ఆధునిక సౌకర్యాలు కలిగిన అపార్ట్‌మెంట్లు, సమీపంలో ఉన్న ఎడ్యుకేషన్, హెల్త్, టెక్ కేంద్రాలు.. ఇవన్నీ కలిపి, నూతన తరం నివాసాలకు సరైన మిక్స్ అందిస్తున్నాయి.
అభివృద్ధి దిశగా గట్టి అడుగులు
ఈ రెండు ప్రాజెక్టులు నెల్లూరు నగర అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. నేడు నివాస అవసరాలు మారుతున్న తరుణంలో, అధునాతన అపార్ట్‌మెంట్లు, ఆవాస సముదాయాల నిర్మాణం అనివార్యంగా మారింది. DSR Infra, Unique Spire లాంటి ప్రాజెక్టులు నెల్లూరును కొత్త ఆకర్షణీయ గమ్యస్థలంగా మారుస్తున్నాయి.
రియల్ ఎస్టేట్ రంగానికి వెలుగు
ఈ అభివృద్ధి రియల్ ఎస్టేట్ రంగానికి ఊపిరివ్వడమే కాదు, స్థానిక ఉపాధికి కూడా దోహదపడుతోంది. నిర్మాణ రంగంలో నేరుగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కలుగుతోంది. పక్కనే ఉండే హైవే, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ వల్ల ఆ ప్రాంతం త్వరలోనే హైడిమాండ్ లోకి వస్తుంది. మొత్తం మీద నెల్లూరు జిల్లాకు మంచి రోజులు వచ్చాయని నగరవాసులు అంటున్నారు.