Vinayaka chavithi songs : కొన్ని పండగలు ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసి ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో సినిమాలు రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు ఆశపడుతుంటారు. అలానే పండగలకి సినిమాలు రిలీజ్ చేయడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీగా మారిపోయింది. అలానే కొన్ని పండగలకు సినిమాల్లో కూడా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా వినాయక చవితికి సంబంధించి తెలుగు సినిమాల్లో అద్భుతమైన పాటలు ఉన్నాయి.
ఎప్పుడు వినాయక చవితి వచ్చినా కూడా ఈ పాటలు అదేపనిగా వినిపిస్తూ ఉంటాయి. ఈసారి కూడా ఆ పాటలను మరోసారి పెట్టుకొని తెలుగు ప్రేక్షకులంతా వైబ్ అవ్వబోతున్నారు. ఓసారి ఆ పాటల లిస్ట్ లుక్ ఏద్దామా.?
కూలి నెంబర్ 1 – దండాలయ్య
రాఘవేందర్రావు దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సినిమా కూలీ నెంబర్ వన్. అప్పట్లో ఈ సినిమా కమర్షియల్ గా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో పాటలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఇళయరాజా ఈ సినిమా పాటలను కంపోజ్ చేశారు. ఈ సినిమాలో ఎప్పుడూ వినిపించే పాట “దండాలయ్యా ఉండ్రాలయ్యా”ఈ పాటకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అసలు ఈ పాట వినిపించకుండా వినాయక చవితి జరగదు.
దేవుళ్ళు – వక్రతుండ మహాకాయ
దేవుళ్ళు సినిమాలో చాలామంది దేవుళ్ళకి సంబంధించిన పాటలు ఉంటాయి. కానీ వాటన్నిటిని మించి వక్రతుండ మహాకాయ అనే పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వినాయక మండపాల్లో గణేష్ ని ప్రతిష్టించిన తర్వాత మొదటి వినిపించే పాట వక్రతుండ మహాకాయ.
జై చిరంజీవ – జై జై గణేశా
మెగాస్టార్ చిరంజీవి భూమిక సమీరారెడ్డి నటించిన సినిమా జై చిరంజీవ. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. కానీ ఈ సినిమాకి ఇప్పటికీ ఒక మంచి వాల్యూ ఉంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమాలో “జై జై గణేశా” సాంగ్ ఎప్పటికీ ప్రత్యేకం. చంద్రబోస్ రాసిన ఈ పాట అద్భుతమైన మీనింగ్ తో కూడుకొని ఉంటుంది.
ఇద్దరమ్మాయిలతో – గణపతి బప్పా మోరియా
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమా ఇద్దరమ్మాయిలతో. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో గణపతి బప్పా మోరియా అనే పాట అద్భుతంగా ఉంటుంది. చాలామంది యూత్ ఈ పాట పెట్టుకుని వైబ్ అవుతుంటారు. ఇలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వినాయకునికి సంబంధించిన పాటలు చాలా ఉన్నాయి. కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా హిందీ సినిమాల్లో కూడా గణేష్ పాటలు బాగా ఫేమస్. ముఖ్యంగా హృతిక్ రోషన్ నటించిన అగ్నిపత్ సినిమా లో దేవ శ్రీ గణేష్ పాట గురించి ఎంత చెప్పినా తకవే అవుతుంది. సినిమాల్లోనే కాకుండా చాలా ప్రైవేట్ సాంగ్స్ కూడా గణేష్ మీద ఉన్నాయి.
Also Read: Anushka Shetty: అనుష్క లేకుండానే ప్రమోషన్స్… పాపం నిర్మాతే స్వయంగా…