Intinti Ramayanam Today Episode August 27th : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీకర్ కమల్ ఇద్దరూ కూడా అక్షయ్ దగ్గరికి వెళ్తారు. నువ్వు వ్రతానికి రానన్నావ్ అంట కదా ఏమైంది అన్నయ్య అమ్మ బాధపడుతుంది అని కమల్ అంటాడు.. అతనికి రావాలని పిలవడానికి వచ్చాము అని అక్షయ్ అంటాడు.. నువ్వు రాలేదని అమ్మ దిగులుగా కూర్చుంది వ్రతం చేయలేదు… అక్షయ్ మాత్రం తమ్ముళ్లపై సీరియస్ అవుతాడు.. కమల్ అవనీకి ఫోన్ చేసి మేమెంత రిక్వెస్ట్ చేసినా రానన్నాడు వదిన అని అంటాడు.. మీరేం కంగారు పడకండి కన్నయ్య మీ అన్నయ్యను వ్రతానికి తీసుకొచ్చే బాధ్యత నాది అని అంటుంది. అక్షయ్ ఇంటర్వ్యూకి వెళ్లిన ఆఫీస్ లో మేడం భార్యలను ప్రేమించే వాళ్ళకి మాత్రమే ఉద్యోగం ఇస్తుందని తెలుసుకొని షాక్ అవుతాడు. మొత్తానికి అక్షయ్ కు జాబ్ వస్తుంది. ఆ సంతోషాన్ని ఇంట్లో పంచుకోవాలని ఇంటికొస్తాడు అక్షయ్ అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది…
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అవని అక్షయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈయనకు జాబు రాలేదంటే కచ్చితంగా నువ్వు ఎదురు రావడం వల్ల అని నా మీద వేస్తాడు మామయ్య అని అంటుంది. అక్షయ్ అక్కడికి సంతోషంగా స్వీట్లు పట్టుకుని వస్తాడు. జాబ్ వచ్చింది అన్న విషయాన్ని అందరితో పంచుకుంటాడు.. ఆరాధ్యను ఎత్తుకొని ముద్దాడుతూ నాకు జాబ్ వచ్చిందమ్మా అని సంతోషంగా చెప్తాడు. నీకోసం స్వీట్స్ తెచ్చానని ఆరాధ్యతో అంటాడు. నీ సంతోషాన్ని నాతో పంచుకున్నావు అయితే అమ్మతో తాతయ్యతో కూడా పంచుకో అనేసి అంటుంది.. నేనైతే ఇవ్వను నువ్వు కావాలంటే స్వీట్స్ ఇవ్వు అని అక్షయ్ అంటాడు.
వీడికి ఎంత జరిగినా పొగరు మాత్రం తగ్గట్లేదు అని రాజేంద్రప్రసాద్ అంటాడు. కానీ అవని మాత్రం ఆయనకు జాబ్ వచ్చిందని సంతోషం అలా ఉండనివ్వండి మావయ్య అని అవని అంటుంది. ఇక ఉదయం సత్యనారాయణ వ్రతం కోసం ఇంట్లో హడావిడి చేస్తూ ఉంటారు. ఇంట్లో వ్రతం కోసం ఎంత హడావిడి చేస్తున్నారు అక్షయ్ బాబు రాకుండానే ఇదంతా చేస్తారని పల్లవి శ్రియాలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్షయ్ బావ కచ్చితంగా రాడు. అయితే అవని వస్తుంది కదా మనము షాక్ ఇవ్వాలి.
మా డాడీ ఈ వ్రతం ఆగిపోయేందుకు ఏదో ఒక ప్లాన్ చేస్తానని అన్నాడు. నువ్వు కూడా నీ మట్టి బుర్రకి పదును పెట్టి ఆలోచించు అని అవమానిస్తుంది పల్లవి.. ఏంటి నాది మట్టిబుర్రనా.. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని శ్రేయ పల్లవి పై సీరియస్ అవుతుంది. కమల్ శ్రీకర్ ఇద్దరు ఇంటిని వ్రతం కోసం అందంగా ముస్తాబు చేస్తారు.. పార్వతీ భానుమతి ఇద్దరు పూజ కోసం అన్ని వస్తువులను సిద్ధం చేస్తూ ఉంటారు.. అయితే అప్పుడే శ్రీకర్ కమల్ లోపలికి వచ్చి మీరు ఇద్దరు ఇక్కడ కష్టపడుతుంటే వాళ్ళు లోపల ఏం చేస్తున్నారు అని అడుగుతారు.
పల్లవి, శ్రియాలను పిలుస్తారు.. ఏంటి పిలిచారు అని అడుగుతారు. అమ్మ నాన్నమ్మ ఇద్దరు ఇక్కడ కష్టపడుతుంటే మీరిద్దరు మాత్రం లోపల రెస్ట్ తీసుకుంటున్నారా? పూజకు టైం అవుతుంది మీరిద్దరూ సాయం చేయాలని మీకు అనిపించలేదా అని కమల్ అంటాడు.. ఎలాగూ అక్షయ్ బావ రారు కదా పూజకి అన్ని సిద్ధం చేసి వేస్ట్ కదా అని పల్లవి రియల్ ఇద్దరు అపశకుణంగా మాట్లాడుతారు. ఈ పూజ ఎలాగో జరగదు కదా అక్షయ్ బాబు వచ్చిన తర్వాత అన్ని సిద్ధం చేద్దాంలేని కూర్చున్నామని పల్లవి అంటుంది.
అక్షయ్ బావ రాకుండా పూజ జరగదు కదా వాళ్లు వచ్చిన తర్వాత అన్ని సిద్ధం చేద్దాంలే అనుకున్నాను అని పల్లవి శ్రీయళ్లిద్దరూ అంటున్న సమయంలో అవని రాజేంద్రప్రసాద్ వస్తారు.. వాళ్ళిద్దరూ రావడం చూసి ఇంట్లోనే వాళ్ళందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. పల్లవి, శ్రీయాలు ఇద్దరు మాత్రం షాక్ అవుతారు.. అందరూ రాజేంద్రప్రసాద్ అవనీలు రావడం చూసి సంతోషపడతారు.. ఇంట్లోకి రాగానే బాగోగులను అడుగుతారు. కానీ పల్లవి, శ్రీయాలు మాత్రం రాజేంద్రప్రసాద్ ని మాత్రమే పలకరిస్తారు.
నేను బాగానే ఉన్నాను కానీ నాతోపాటు అవని కూడా వచ్చింది మీరు తనని ఎందుకు పలకరించలేదు అని అడుగుతాడు.. అయితే పల్లవి శ్రేయాలు ఇద్దరూ కూడా అవనిని పలకరిస్తారు.. ప్రణతి భరత్లు ఎక్కడున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అవని. బావున్నారా అని అడుగుతుంది. ఇంట్లో వాళ్ళు మమ్మల్నిలా అంటున్నారని ప్రణతి అవనితో చెప్తుంది. అత్తయ్య ఇప్పుడు మనకు సపోర్ట్ గా ఉంది మీ ప్రేమను అర్థం చేసుకొని పెళ్లి చేయడానికి ఒప్పుకుంది కదా.. వాళ్ళ నోరులు ఎలా మూయించాలో నాకు తెలుసు అని అవని అంటుంది.
Also Read : సంజయ్ కు దిమ్మతిరిగే షాక్.. కారు కొన్న మనోజ్.. రోహిణికి దారుణమైన అవమానం..
పల్లవి శ్రేయ ఇద్దరూ కూడా.. అవనికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని అనుకుంటారు.. మంటు గదిలోన మిక్సీకి షాక్ వచ్చేలా ప్లాన్ చేస్తారు. ముందుగా అవని వంట గదిలోకి వెళ్తుందని అందరూ అనుకుంటారు.. కానీ అవని మంట గదిలోంచి మళ్లీ బయటకు వస్తుంది ఆ తర్వాత వెంటనే పార్వతి అక్కడికి వెళ్తుంది. మిక్సీని ఆన్ చేయగానే షాక్ కొడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఆ తర్వాత అవని పార్వతిని కాపాడుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…