Gundeninda GudiGantalu Today episode August 27th : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా బాలు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు..మీనా చేసిన ధైర్యానికి అక్కడున్న సిఐ వాళ్ళందరూ మెచ్చుకుంటారు.. బాలు మాత్రం నాది తప్పు అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు మీనానే పొగుడుతున్నారని ఫీల్ అవుతుంటారు.. ఏది ఏమైనా కూడా నిజం అందరికీ తెలిసిపోయిందని సంతోషపడతారు. బయటికి రాగానే కారును తీసుకుని వెళ్లాలని బాలు అనుకుంటాడు. అందరూ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రాగానే బాలు మీనాన్ని పొగిడాడు తప్ప నా తప్పేమీ లేదని ఒక్క మాట కూడా అనలేదని తెగ ఫీల్ అయిపోతాడు. శివ గుణాన్ని చూసి బాధపడతాడు. శివ ఎక్కడ దూరం అవుతాడు అని గుణ తనకి అబద్దం చెప్తాడు. శివ అది నిజమే అనుకొని నమ్మేస్తాడు.. నువ్వేం భయపడకు గుణ నిన్ను బెయిల్ మీద బయటకు తీసుకొస్తాను అని అంటాడు.. సత్యం ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పోలీస్ వాళ్ళ ఇంట్లో డెలివరీ ఇవ్వడానికి వెళుతుంది అయితే అక్కడ మీనాన్ని చూసి నువ్వు చాలా ధైర్యవంతురాలు అమ్మ అని మెచ్చుకుంటారు. అంతేకాదు అయితే బాలు ని ఇరికించడానికి కారణం సంజయ్ ని చెప్పడంతో మీనా షాక్ అవుతుంది.. మౌనిక తన అన్న మీద పడ్డ నింద పోయింది అని సంతోషంగా ఉంది. సంజయ్ ని ఇదంతా చేశాడని తెలుసుకొని సంజయ్ దగ్గరికి వెళ్లి చెప్తుంది. ఇదంతా చేసింది నేనే అని నీకు తెలిసిపోయిందా అని మౌనికను సంజయ్ అంటాడు. మీ ఇంట్లో వాళ్ళు అందులోను మీ అన్న అంటే నాకు చాలా కోపం ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలనుకుని ఇదంతా చేశాను అని సంజయ్ అంటాడు.
ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకొని మౌనిక వార్నింగ్ ఇస్తుంది. ఏంటే నా ముందు రే నోరు లేస్తుంది అని సంజయ్ మౌనికను కొట్టబోతాడు. అడ్డుకున్న మేన సంజయ్ ఇదంతా చేస్తున్నాడని తెలిసి కొడుతుంది. శృతిని ఎవరో ఎదవ ఏడిపిస్తుంటేనే చావబాదాను.. నిన్ను కొట్టడం పెద్ద పని కాదు అని చెంప పగలగొడుతుంది. మా ఆయన మీద నీకు కోపం ఉండొచ్చు కానీ ఇలా నీ కోపాన్ని తీర్చుకోవాలని ఇంకోసారి చూస్తే అస్సలు ఊరుకోను.. మౌనిక నువ్వు ఎలాంటి వాడివో తెలిసి కూడా నువ్వు మారతావని ఆశగా ఎదురుచూస్తుంది జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది మీనా.
ఇక రోహిణి మనోజ్ కారు కొన్న విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పాలని ఫోన్ చేసి ప్రభావతిని అందరినీ బయటికి రమ్మని అడుగుతాడు.. ప్రభావతి మాత్రం మనోజ్ కారు కొన్నాడన్న విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ లో ఉండిపోతుంది. ఇక అందరూ కలిసి బయటకు వెళ్లి కారును చూస్తారు. మనోజు రోహిణి మీనాను అవమానిస్తారు. బాలు డ్రైవర్ అంటూ ఓనర్ కాదు అని ప్రభావతి కూడా బాలుని అవమానిస్తుంది. బాలు మాత్రం రెండు లక్షలు విలువ చేసే కార్ ని నాలుగు లక్షలు పెట్టి కొన్నావా అంటూ షాక్ ఇస్తాడు.
Also Read:< ‘సత్యభామ ‘ హీరో జీవితంలో అన్నీ కష్టాలే.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ../p>
రవి కారు కొన్నావు కదా మరి పార్టీ ఏది అన్నయ్య అని మనోజ్ ని అడుగుతాడు. రాత్రి టెర్రస్ పై పార్టీ కావాలి మాకు అని రవి అడుగుతాడు. ఇక రాత్రి అవ్వగానే రవి సైగలు చేస్తూ ఉంటాడు బాలుని పైకి రమ్మని అడుగుతాడు. బాలు మాత్రం మీనాకి ఇచ్చిన మాట ప్రకారం తాగకుండా పైకి వెళ్లి కూర్చుంటాడు. మనోజ్ బిజినెస్ ఐడియాల గురించి అడుగుతుంటే బాలు అతనిపై సెటైర్ల వర్షం కురిపిస్తాడు. కింద ముగ్గురు కోడళ్ళు ఒక చోటికి చేరి ముచ్చట్లు పెట్టుకుంటారు. మీనా ఇచ్చిన బిజినెస్ ఐడియా వల్ల రోహిణి దారుణంగా మీనాని అవమానిస్తుంది.. మీనామాటంటే బాలుక అసలు లెక్కలేదు.. కచ్చితంగా బాలు తాగడానికి ముందుంటాడు అని రోహిణి అంటుంది.. ఆ మాట వినగానే మీనా షాక్ అవుతుంది. శృతి మాత్రం రోహిణికి కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..