Coolie Vs War 2 Plus and Minus: వచ్చే వారం బాక్సాఫీసు వద్ద సందడి మామూలుగా ఉండదు. రెండు భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అవే రజనీకాంత్ కూలీ, ఎన్టీఆర్ వార్ 2 చిత్రాలు. రెండు పాన్ ఇండియా, బడా హీరోల సినిమాలు. ఒకే రోజు విడుదల. ఇక బాక్సాఫీసు వద్ద జాతరే జాతరే అన్నట్టు ఉంది ప్రస్తుత బజ్ చూస్తుంటే. ఇద్దరు బడా హీరోలు కావడంతో మూవీ ఎంత బజ్ ఉందో.. అదే స్థాయిలో ఫ్యాన్ వార్ కూడా జరుగుతుంది. మా హీరో సినిమాకు హైప్ ఎక్కువ అంటే మా హీరో సినిమాకు హైప్ ఎక్కువ అంటున్నా అభిమానులు. మరోవైపు మూవీ టీంస్ కూడా ప్రమోషన్స్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. ఇంటర్య్వూస్, ఈవెంట్స్ కూలీ టీం దూసుకుపోతుంటే.. వార్ 2 హీరో మాత్రం ట్విటర్ కోట్టుకుంటే అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.
వార్ 2 టీం వినూత్న ప్రమోషం.. అయినా
వినూత్నంగా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇద్దరు పెద్ద హీరోల బాక్సాఫీసు క్లాష్ వల్ల కూలీ, వార్ 2 చిత్రాల ప్లస్, మైనస్ పై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంంటే సౌత్ లో కూలీకే ఎక్కువ బజ్ కనిపిస్తోంది. నార్త్ సంగతి పక్కన పెడితే సౌత్ లో మాత్రం వార్ 2 కంటే కూలీకే హైప్ ఎక్కువ ఉందనిపిస్తోంది. అంతేకాదు సౌత్ ఆడియన్స్ కూడా కూలీనే ఎక్కువ ఓన్ చేసుకున్నారనిపిస్తోంది. వార్ 2 విషయానికి వస్తే సౌత్ ఆడియన్స్ లో ఆకట్టుకునే అంశం ఏదైన ఉందటంటే.. అది ఒక్క హీరోనే. ఎందుకంటే.. వార్ 2 బాలీవుడ్ సినిమా. పాన్ ఇండియా అంటూ మూవీని తెలుగు, తమిళ్ లో విడుదల చేస్తున్నారు. కానీ, ఆయన ఇండస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకునేందు సౌత్ నటీనటులు ఇందులో ఎవరూ లేరు.
ఒక్క ఎన్టీఆర్ కారణం తప్పితే.. దక్షిణాది ప్రేక్షకులు వార్ 2 చూడాలనుకునే అంశమేది లేదు. డైరెక్టర్, నిర్మాణ సంస్థ, లీడ్ యాక్టర్ నుంచి నటీనటులు వరకు ప్రతి ఒక్కరు నార్త్ వాల్లే. కూలీలో అత్యంత ప్లస్ అంటే రజనీకాంత్. దానికి తోడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం. లోకేష్ చిత్రాలకు తమిళంలో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అది విక్రమ్, లియో చిత్రాలతో రుజువైంది. కానీ, వార్ 2.. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ప్రస్తుతం చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు లేవు. ఈ మూవీ నిర్మాత ఆదిత్య చోప్రా సౌత్ ఆడియన్స్ పెద్దగా పరిచయమే లేడు. ఇక దర్శకుడు ఆయాన్ ముఖర్జీ సంగతి అంతే. ఒకేఒక్క సినిమా తీశాడు. బ్రహ్మస్త్ర మూవీ చేశాడు. కానీ, ఈ మూవీ బాలీవుడ్ తప్పితే సౌత్ లో పెద్దగా ఆడలేదు. ఇందులో నాగార్జున ఉండటంతో తెలుగులో కాస్తా బజ్ వచ్చింది.
వార్ 2పై కూలీదే పై చేయి..
అయినా.. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఐదు భాగాలుగా రావాల్సిన బ్రహ్మస్త్ర ఆగిపోయింది. ఆయాన్ ముఖర్జీలో సరైన సత్తా లేకపోవడం వల్లే ఈ బ్రహ్మస్త్ర ఫ్రాంచైజ్ ఆగిపోయిందనేది కొందరి అభిప్రాయం. అలాంటి దర్శకుడు వార్ 2 చేస్తున్నాడు. పైగా ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ ఈయన కాదు. ప్రస్తుతం బాలీవుడ్ లో కంటెంట్ బలం ఉన్న సినిమాలు పెద్దగా రావడం లేదు. అలాంటి స్పై యాక్షన్ గా వార్ కి పార్ట్ 2 వస్తున్న ఈ సినిమా కొత్త ఆకట్టుకునే అంశం ఉంటుందని ఆడియన్స్ నమ్మడం లేదు. అదే జానర్, అదే కొథ తప్పితే ఇందులో కొత్తదనం ఉండకపోవచ్చనేది ప్రేక్షకులు అభిప్రాయం. ఈ సినిమాలో ప్లస్ ఏదైన ఉందంటే ఎన్టీఆర్, హీరోయిన్ కియార అద్వానీ గ్లామర్ షో. టీజర్ రిలీజ్ తర్వాత అంత ఆమె బికినీ లుక్ గురించే మాట్లాడుకున్నారు. తప్పితే ఇందులో కమర్షియల్ అంశాల ఊసే లేదు. దీంతో వార్ 2 మూవీ సౌత్ పెద్దగా బజ్ లేదనడంలో సందేహం లేదు.
కూలీకి రజనీ పెద్ద బలం అయితే.. దానికి లోకేష్ కనగరాజ్, అనిరుద్ లు తొడయ్యారు. దీంతో కూలీకి వస్తున్న హైప్ చూస్తుంటే సౌత్ మొత్తం ఓ వేడుకలా ఉంది. పైగా అన్ని భాష ఆడియన్స్ ఆకట్టుకునేందుకు ఆయా ఇండస్ట్రీల దిగ్గజాలను ఇందులో భాగం చేశాడు లోకేష్. తెలుగు నుంచి నాగార్జునను, కన్నడ నుంచి ఉపేంద్రను, బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్ లతో కీలక పాత్రలు ఇచ్చాడు. ఆయా నటులకు ఆయా భాషల్లో భారీ మార్కెట్ ఉంది. దీంతో అన్ని భాష ఆడియన్స్ లోకేష్ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే లియోతో హిందీలోనూ తన సత్తా చూపించాడు. దీంతో వార్ 2 తో పోలీస్తే.. కూలీకే సౌత్ లో ఎక్కువ బజ్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఆమిర్ వల్ల హిందీలోనూ కూలీకే హైప్ ఉందన్న ఆశ్చర్యపోనవసరం. ఇలాంటి టైంలో వార్ 2.. కూలీకి పోటీ బాక్సాఫీసు బరిలో దిగుతుందో. కూలీ దాటికి వార్ 2 కొట్టుకుపోతుందని, కాస్తా చూసుకుని వస్తే బాగుంటుందంటూ సూచిస్తున్నాయి. ఈ బాక్సాఫీసు వార్ లో కూలీదే పైచేయి అని ట్రేడ్ వర్గాలు సైతం అంటున్నాయి.