Actress Shanthi Williams Accused Mohanlal: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి సీనియర్ నటి శాంతి సంచలన కామెంట్స్ చేశారు. మోహన్ లాల్ స్వార్థపరుడని, డబ్బు, ఫేం వచ్చాక చాలా మారిపోయాడంటూ ఆమె ఆరోపించింది. నటి శాంతి విలియమ్స్ వందకు పైగా సినిమాల్లో చేశారు. అపరిచితుడు సినిమాల్లో హీరో విక్రమ్కి తల్లిగా నటించి తెలుగు ఆడియన్స్కి సుపరిచితమయ్యారు. తమిళ్, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. సీరియల్లోనూ ఆమె కీలక పాత్రలు పోషించారు. 12 ఏళ్ల వయసులోని సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆమె ఎన్నో హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. కెరీర్లో బిజీగా ఉన్నప్పుడే మలయాళీ ఇండస్ట్రీలో ప్రముఖ కెమెరామెన్ జె. విలియమ్స్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
మాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆమె స్టార్ హీరో మోహన్ లాల్ గురించి పలు షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం సినిమాల్లో సీరియల్లో చిన్న పాత్రలు చేస్తున్న ఆమె తాజాగా ఓ మీడియా ఛానల్కు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త జె. విలియమ్స్ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో తనకు మలయాళం నుంచి ఎలాంటి సపోర్టు లేదని, ఎవరూ కనికరం చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పైగా ఆయన పరిస్థితిని మోహన్ లాల్ తన స్వార్థానికి వాడుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది.
“నా భర్త విలియమ్స్ 2005లో చనిపోయారు. ఆయన కెమెరామెన్గా ఉన్న టైంలో మోహన్ లాల్‌తో ఆయన మంచి సన్నిహితం ఉండేది. ఆయన తరచూ మా ఇంటికి వచ్చేవారు. మాతో చాలా నవ్వుతూ చాలా సరదగా ఉండేవారు. కానీ, ఇప్పుడు ఆయనలో ఆ మోహన్ లాల్ లేడు. అప్పుడు ఆయనతో చిన్న పిల్లాడి మనస్థత్వం, అమాయకత్వం ఉండేవి. కానీ, ఫేం వచ్చాక ఆయనలో స్వార్థం పెరిగింది. అప్పటి మోహన్ లాల్‌కి, ప్రస్తుత మోహన్ లాల్‌కి చాలా తేడా ఉంది. ఇండస్ట్రీలో చాలా మంది కూడా ఇదే అంటుంటారు. “మా ఇంట్లో 10 నుంచి 12 అడుగుల కృష్ణుడి విగ్రహం ఉండేది. మా ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు మేం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాం.
Also Read: Deepika Padukone: అయ్యే దీపికా.. టాలీవుడ్‌లో ఒకే ఒక్కడు సపోర్ట్… అయినా డ్యామేజ్ జరిగిపోయింది
అదే సమయంలో కృష్ణుడి విగ్రహాన్ని మేము మెయింటెన్ చేయలేమని దానిని ఆయన మోహన్ లాల్‌కి ఇచ్చారు. అదే సమయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల మా పిల్లలకు సరైన సదుపాయాలు ఇవ్వలేకపోయాం. ఆ సమయంలో మా ఇంట్లో ఎయిర్ కూలర్ కూడా లేదు. మా ఆర్థిక పరిస్థితిని మా ఆయన మోహన్ లాల్‌కి వివరించి.. కృష్ణుడి విగ్రహాన్ని ఆయనకు ఇచ్చారు. లక్షలు ఖరీదైన ఆ విగ్రహాన్ని తీసుకుని దానికి బదులుగా ఆయన తన ఆఫీసులోని పాత ఎయిర్ కండిషనర్ తెచ్చించాడు. అది పది రోజుల్లోనే రిపేర్కు వచ్చింది. దాంతో దానికి అమ్మేస్తే మాకు రూ. 2 వేలు మాత్రమే వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లోనూ ఆయన తన స్వార్థ బుద్ధి చూపించారు. అంతేకాదు నా భర్త చనిపోయినప్పుడు కూడా మోహన్ లాల్ రాలేదు. ఇది గుర్తొచ్చిన ప్రతిసారి నాకు చాలా కోపంగా అనిపిస్తుంది. తనకు మేము ఎంతో చేశాం.
కానీ, ఆయన మా పట్ల స్వార్థంగా ఉండటం నన్ను చాలా బాధిస్తుంది” అని చెప్పుకొచ్చారు. అనంతరం ‘నా భర్త చనిపోయిన తర్వాత మలయాళీ ఇండస్ట్రీ నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు. కానీ తమిళ్ పరిశ్రమకు చెందిన చాలా మంది అండగా నిలిచారు. చాలా మంది ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించారు. డైరెక్టర్ శంకర్ గారు రూ. 25వేలు సాయం చేశారు. ఇంకేవసరం వచ్చినా.. ఫోన్ చేయమని చెప్పారు. కానీ, మలయాళీ నుంచి ఏ ఒక్కరు కూడా రాలేదు. నేను పుట్టింది కేరళలోనే.. నేను మలయాళీ ఇండస్ట్రీకి చెందినప్పుటికీ.. నన్ను అలా పిలుచుకోవడానికి సిగ్గుపడుతున్నాను. మా దగ్గర డబ్బున్న సమయంలో ఎందరికో సాయం చేశాం. కానీ, నా భర్త మరణించిన తర్వాత ఇండస్ట్రీలోని ఎవరూ కూడా కనీసం నన్ను పలకరించలేదు’ అంటూ నటి శాంతి కన్నీరు పెట్టుకుంది.