Konaseema Neelima: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన బేతి వీరదుర్గా నీలిమ 12 పెళ్లిళ్లు చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరలైన విషయం తెలిసిందే. నిజంగా ఒక మహిళ 12 మందిని పెళ్లి చేసుకుందా? దుర్గా నీలిమపై ఆరోపణలు చేస్తున్నదెవరు? 12 పెళ్లిళ్ల వెనుకున్న అసలు కథేంటీ..? నిజంగా ఆమె అన్ని పెళ్లి చేసుకుందా..? ఆడపిల్లపై ఇంత పెద్ద అభాండం ఎందుకు వేశారు..? మోసం చేసి పెళ్లి చేసుకున్నదే కాకుండా దుష్ప్రచారమా..? నిజంగా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి కొడుకులు ఎక్కడున్నారు? నీలిమపై ఆరోపణలు చేస్తున్నదెవరు? నిత్య పెళ్లి కూతురంటూ నీలిమపై సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై బిగ్ టీవీ నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది.
12 పెళ్లిళ్లు చేసుకున్నట్టు ప్రూఫ్స్ లేవు: పోలీసులు
అయితే రాజేశ్వరి, నీలిమ కుటుంబాల మధ్య పాత గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో రెండు కుటుంబాలు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లినట్టు నీలిమ చెబుతోంది. తాజాగా మరోసారి రాజేశ్వరి కుటుంబ సభ్యులపై నీలిమ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాజేశ్వరి కుటుంబ సభ్యులు తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని నీలిమ చెబుతోంది. అంతకుముందు నీలిమ పెళ్లిళ్లపై రాజేశ్వరి కుటుంబం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేశ్వరి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు సైతం తేల్చి చెప్పారు.
11 పెళ్లిళ్ల సాక్ష్యాలు చూపించాలి: నీలిమ
తాను చేసుకున్నది ఒకటే పెళ్లి అని నీలిమ ఆవేదన వ్యక్తం చేసింది. బెర్నిస్ అనే వ్యక్తితో తనకు పెళ్లి చేశారని చెప్పింది. మిగితా 11 పెళ్లిళ్లలకు సాక్ష్యాలు చూపించాలని రాజేశ్వరి కుటుంబాన్ని నీలిమ నిలదీసింది. తన భర్త ఓ మోసగాడని తెలిసి కుమిలిపోతున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. బెర్నిస్ కు అంతకుముందే పెళ్లి అయ్యిందని తెలిపింది. తన భర్త మోసగాడని తెలిసుకున్న నీలిమ ఆవేదన వ్యక్తం చేసింది. ముందు గుళ్లో పెళ్లి చేసుకుంటామని చెప్పి.. ఆ తర్వాత ఇంట్లో బెడ్ రూంలోకి వచ్చి తాళి కట్టించారని నీలిమ చెప్పుకొచ్చింది. మొదటి భార్య రోజా ప్రసన్నను బెర్నిస్ చిత్రహింసలు పెట్టాడు. అందుకే ఆమె విడాకులు తీసుకునేందుకు రెడీ అయినట్టు నీలిమ వివరించింది.
ALSO READ: నేను అలాంటి దాన్ని కాదు.. అసలు ఈ పెళ్లిళ్లు ఎక్కడివి?: కొనసీమ నీలిమ
బెర్నిస్ శాడిస్ట్: రోజా ప్రసన్న తల్లి
బెర్నిస్ మొదటి భార్య రోజా ప్రసన్న తల్లి కూడా అతని ప్రవర్తన తీరు బాగుండదని చెప్పింది. ‘బెర్నిస్ నా కూతురును నానా చిత్ర హింసలు పెట్టాడు. నా కూతురుపై అనుమానం పెట్టుకున్నాడు. ఇంట్లో బంధించి టార్చర్ పెట్టాడు. బెర్నిస్ పెద్ద శాడిస్ట్. అతని హింస వల్లే నా భర్త కూడా గుండెపోటుతో చనిపోయాడు. అందుకే నా కూతురు విడాకులు తీసకునేందుకు సిద్దమైంది’ అని రోజా ప్రసన్న తల్లి చెప్పుకొచ్చింది.