BigTV English

Rakul Home Tour: రకుల్ పరువు తీసేసిన ఫరా ఖాన్.. 10 అంతస్తుల నుంచి 5 అంతస్తులకు పడిపోయారంటూ…

Rakul Home Tour: రకుల్ పరువు తీసేసిన ఫరా ఖాన్.. 10 అంతస్తుల నుంచి 5 అంతస్తులకు పడిపోయారంటూ…

Rakul Preet Singh and Jackky Bhagnani Lavish Home Tour: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఫరా ఖాన్ ఒకరు. ఓం శాంతి ఓం, మెన్ హునా, కుచ్ కుచ్ హోతా హై, హ్యాపీ న్యూఇయర్ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. దర్శకురాలిగా, రైటర్ గా ఆమె మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం సినిమాలు తగ్గించిన ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. దీని ద్వారా తనకు తనకు సంబంధించిన వీడియోలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.


రకుల్ హోంటూర్

అలాగే సినీ సెలబ్రిటీలు, హీరోహీరోయిన్లతో ఫన్నీ వీడియోలు షేర్ చేస్తున్నారు. వారిని ఇంటర్య్వూ చేస్తూ వారి నుంచి ఆసక్తి విషయాలను రాబడుతున్నారు. అయితే తాజాగా ఫరా రకుల్ హోం టూర్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ షేర్ చేసింది. రకుల్ అండ్ జాకీ భగ్నానాని లావిష్ హోం టూర్ పేరుతో ఈ వీడియోను షేర్ చేశారు. రకుల్, జాకీల కోసం తన కుక్ తో ప్రత్యేకంగా చికెన్ కర్రీ చేయించుకుని వారి ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి అడుగుపెట్టగానే ఇంట్లోని ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఇంటీరియల్ కనువిందు చేసింది. హాల్ మొత్తం ఐడల్, ప్లవర్ వాస్, ప్రత్యేకమైన ఆర్ట్ గ్యాలరీ పెయింట్స్ కనువిందు చేశాయి.


రకుల్ పరువు తీసిన ఫరా

ఇక వారి ఒపెన్ కిచెన్ చూస్తే వావ్ అనిపించేలా ఉంది. ఇక వారి ఇల్లు చూసిన ఫరా.. అయితే నేను కూడా నిర్మాత అయిపోతా అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. ఆమె కామెంట్స్ కి రియాక్ట్ అయిన జాకీ భగ్నానీ, నిర్మాత కాదు రియల్ ఎస్టేట్ అంటూ సమాధానం ఇచ్చాడు. హో నిర్మాత అయితే పదో అంతస్తు నుంచి అయిదో అంతస్తుకు రావాల్సి వస్తోందా? అంటూ మాటల్లోనే రకుల్ భర్త జాకీ పరువు తీసేసింది. ముంబైలోని రకుల్, జాకీ ఇల్లు కాస్టీలు వస్తువులు, ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇంటీరియల్, పెయింట్స్, ప్లవర్ వాస్ తో లగ్జరీగా కనిపించింది. ఇల్లు మొత్తం లగ్జరీగా కనువిందు చేసింది. ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటల్ లను మించి ఉంది.

ఇంట్లోనే స్వీమ్మింగ్ ఫూల్, బెడ్ రూం, హాల్ ప్రతిదీ ప్రత్యేకమైన డిజైన్ తో రూపొంది లగ్జరీగా ఉంది. రకుల్ ఇల్లు చూసిన వారంత ఇది ఇల్లా.. ఇంద్రభవనమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ హోంటూర్ లో భాగంగా ఫరా ఖాన్ రకుల్, జాకీలను ఇంటర్య్వూలో చేసి ఆసక్తికర విషయాలను రాబట్టారు. కాగా గతేడాది ఫిబ్రవరి రకుల్, జాకీల పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఎంతోకాలంగా డేటింగ్ లో ఉన్న వీరి గతేడాది పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. గోవాలో జరిగిన వీరి గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ కి ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కొద్దిమంది ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు.

Related News

Sobhita: షూటింగ్ లొకేషన్ లో వంట చేసిన శోభిత.. చైతూ రియాక్షన్ ఇదే!

Lokesh Kangaraj: చేసింది 6 సినిమాలే..22 మంది హీరోలను డైరెక్ట్ చేశా.. గర్వంగా ఉందంటూ!

OG Glimpse: ఎందయ్యా సుజీత్ బర్త్ డే హీరోదా…విలన్ దా ఆ గ్లింప్స్ ఏంటయ్యా?

Madharasi Censor Report: మదరాసి సెన్సార్‌ పూర్తి.. ఆ సీన్స్‌పై బోర్డు అభ్యంతరం, మొత్తం నిడివి ఎంతంటే

Ghaati Censor Report: అనుష్క ‘ఘాటీ’కి సెన్సార్‌ కట్స్.. ఆ సీన్లపై కోత.. మొత్తం మూవీ నిడివి ఎంతంటే!

Anushka Shetty: డాక్యుమెంటరీగా బాహుబలి.. కన్ఫర్మ్ చేసిన స్వీటీ!

Big Stories

×