BigTV English

OTT Movie : బాత్రూమ్ లో అమ్మాయిపై దాడి… పాపులర్ సీరియల్ కిల్లర్స్ స్టైల్ లో వరుస మర్డర్స్… కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :  బాత్రూమ్ లో అమ్మాయిపై దాడి… పాపులర్ సీరియల్ కిల్లర్స్ స్టైల్ లో వరుస మర్డర్స్… కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : నైట్ పూట మాత్రమే తిరుగుతాయి. కానీ సైకోలకు మాత్రం సమయం, సందర్భం ఏమీ ఉండవు. జనాలు కనిపించకపోతే చాలు చేయాల్సిన పనిని చేసుకుంటూ వెళ్తారు. అయితే మనం చూసే సినిమాలలో ప్రతి సైకోకు ఓ స్టైల్ ఉంటుంది. కానీ ఈరోజు మన మూవీ సజెషన్ లో మాత్రం పాపులర్ సైకోల స్టైల్ లో వరుస మర్డర్స్ జరుగుతాయి. మరి ఈ థ్రిల్లర్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘Copycat’. శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి క్రిమినల్ సైకాలజిస్ట్, డిటెక్టివ్ కలిసి పనిచేసే కథ. ఇందులో గ్రిప్పింగ్ సన్నివేశాలు, ట్విస్ట్‌లు అదిరిపోతాయి. సింపుల్ గా చెప్పాలంటే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌.ప్రస్తుతం ఈ సైకో థ్రిల్లర్ నెట్ ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…
డాక్టర్ హెలెన్ హడ్సన్ (సిగౌర్నీ వీవర్) శాన్ ఫ్రాన్సిస్కోలో సీరియల్ కిల్లర్‌ల విషయంలో నిపుణురాలైన క్రిమినల్ సైకాలజిస్ట్. ఒక లెక్చర్ తర్వాత, ఆమె గతంలో అధ్యయనం చేసిన కిల్లర్ డారిల్ లీ కల్లమ్ (హ్యారీ కానిక్ జూనియర్) ఆమెపై బాత్రూమ్‌లో దాడి చేస్తాడు. ఒక పోలీసును చంపి, హెలెన్‌ను తీవ్రంగా గాయపరుస్తాడు. ఈ ఘటన తర్వాత హెలెన్ అగోరఫోబియా (బహిరంగ ప్రదేశాలకు భయం)తో బాధపడుతూ, తన అపార్ట్‌మెంట్‌లో బందీగా జీవిస్తుంది.


తన స్నేహితుడు ఆండీ (జాన్ రోత్‌మాన్) సహాయంతో ఇంట్లోనే పని చేస్తుంది. అలాంటి సమయంలో, శాన్ ఫ్రాన్సిస్కోలో కొత్త హత్యలు జరుగుతాయి. ఇవి బోస్టన్ స్ట్రాంగ్లర్, హిల్‌సైడ్ స్ట్రాంగ్లర్, టెడ్ బండీ వంటి పాపులర్ కిల్లర్‌ల హత్యల స్టైల్ లో జరుగుతాయి. హెలెన్ ఈ హత్యలు తన లెక్చర్‌లలో చెప్పిన క్రమంలో జరుగుతున్నాయని గుర్తిస్తుంది. ఆమెనే టార్గెట్ చేస్తున్న కిల్లర్‌తో సంబంధం ఉందని అనుమానిస్తుంది. డిటెక్టివ్ ఎమ్.జె. మోనహన్ (హోలీ హంటర్), ఆమె పార్ట్నర్ రూబెన్ గోట్జ్ (డెర్మాట్ ముల్‌రోనీ) ఈ కేసును ఛేదించడానికి హెలెన్ సహాయం కోరతారు.

Read Also : పని మనిషితో యజమాని రాసలీలలు… భర్త ఉండగానే మరొకడితో ఆ పాడు పని

హెలెన్ తన భయాన్ని పక్కన పెట్టి, కిల్లర్ మనస్తత్వాన్ని అనలైజ్ చేస్తుంది. అతను తన లెక్చర్‌లలో ఉన్న పీటర్ ఫోలీ (విలియం మెక్‌నమారా) అని తెలుస్తుంది. అంతేకాదు హెలెన్‌ను తన నెక్స్ట్ టార్గెట్ అని తేలుతుంది. రూబెన్ ఒక దాడిలో చనిపోతాడు. ఆండీ జెఫ్రీ డహ్మర్ స్టైల్‌లో హత్యకు గురవుతాడు. ఎమ్.జె. ఫోలీని గుర్తించి, అతని ఇంటికి వెళతాడు. కానీ ఫోలీ హెలెన్‌ను కిడ్నాప్ చేసి, కల్లమ్ దాడిని రిపీట్ చేయడానికి ఒక బాత్రూమ్‌లో బంధిస్తాడు. క్లైమాక్స్‌లో ఓ అదిరిపోయే ట్విస్ట్ తో కథ ఎండ్ అవుతుంది. అసలు ఈ సైకో ఎందుకు ఇలా హత్యలు చేస్తున్నాడు? చివరికి హీరోయిన్ వాడి నుంచి ఎలా తప్పించుకుంది? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×