BigTV English

Junior : జూనియర్ సినిమా ఈవెంట్ కు జక్కన్న, గ్రాండ్ గా ప్లాన్ చేసిన గాలి కిరీటి

Junior : జూనియర్ సినిమా ఈవెంట్ కు జక్కన్న, గ్రాండ్ గా ప్లాన్ చేసిన గాలి కిరీటి
Advertisement

Junior : గాలి జనార్ధన రెడ్డి తనయుడు గాలి కిరీటి హీరోగా నటిస్తున్న సినిమా జూనియర్. ఈ సినిమా నుంచి మొదట ఒక వైరల్ సాంగ్ విడుదలైంది. ఆ సాంగ్ లో గాలి కిరీటి స్టెప్పులు చూసి చాలామంది ఆశ్చర్యపడ్డారు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ లీల డాన్సులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే శ్రీ లీల ఎనర్జీని మ్యాచ్ చేయడం మామూలు విషయం కాదు. దానిని చాలా ఈజీగా మ్యాచ్ చేసి కొంత మందికి విజువల్ ట్రీట్ అందించాడు గాలికిరీటి.


ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గానే విడుదలైంది. అయితే ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోకపోయినా కూడా పరవాలేదు అనిపించుకుంది. మామూలు తెలుగు సినిమాలు ఎలా ఉంటాయో అలానే అనిపించింది ట్రైలర్. సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనుంది చిత్ర యూనిట్.

ముఖ్యఅతిథిగా జక్కన్న 


కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎస్.ఎస్ రాజమౌళికి ఎంతటి గుర్తింపు ఉందో అందరికీ తెలిసిన విషయమే. తెలుగు సినిమా స్థాయిని పెంచారు రాజమౌళి. ఇప్పుడు రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూడటం మొదలుపెట్టారు. అయితే చాలా ఈవెంట్స్ కు రాజమౌళిని ముఖ్య అతిథిగా పిలవడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటి చేస్తున్న సినిమా జూనియర్ కి కూడా ముఖ్యఅతిథిగా జక్కన్న హాజరుకానున్నారు. మొత్తానికి జక్కన్న ఈవెంట్ కి హాజరవుతున్నారు అంటే, దీనిని ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి జక్కన్న వచ్చి మాట్లాడారు అంటే చాలామంది ఆ సినిమాను చూడటానికి ఇష్టపడతారు. అందుకోసమే చిత్ర యూనిట్ కూడా జక్కన్న ఇన్వైట్ చేశారు.

 

హీరో పైన మంచి ఒపీనియన్ 

అయితే ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాబోతుంది కాబట్టి హీరో గాలికిరీటి పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నాడు. అయితే ప్రతి ఇంటర్వ్యూలో కూడా గాలి కిరీటి మాట్లాడే విధానం చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇంత చిన్న ఏజ్ లో అంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది అనేది చాలామంది అభిప్రాయం. ఇకపోతే సినిమాల ప్రభావం కూడా మన మీద చాలావరకు ఉంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గాలి కిరీటి మాట్లాడుతూ నేను సినిమాలు చాలా చూసేవాడిని, నేను ఫ్రెండ్స్ తో కూడా చాలా క్యాజువల్ గా ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. అలా సినిమాల ప్రభావం వలన సహజంగా కూడా ఆ మెచ్యూరిటీ వచ్చి ఉండొచ్చు. ఈ సినిమా జులై 18న ప్రేక్షకులు ముందుకు రానుంది.

Also Read:Nayanthara : నయనతార, విగ్నేష్ శివన్ మధ్య ఏమి జరిగింది.? ఒకరిపై ఒకరు మాటలు యుద్ధం

Related News

Renu Desai: నా పిల్లలను వదిలేసి.. సన్యాసం తీసుకుంటున్నా.. కానీ,

Upasana Konidela: అఫీషియల్… రెండో వారసుడు రాబోతున్నట్లు ప్రకటించిన మెగా కోడలు

SKN: బండ్లన్న అలా చేస్తే ఇండస్ట్రీకి ప్రమాదం… నిర్మాత SKN షాకింగ్ కామెంట్!

Fauzi: పుట్టుకతో అతను ఒక యోధుడు.. అదిరిపోయిన ఫౌజీ లుక్

Bandla Ganesh: జోష్ మూవీ కోసం సిద్ధూ ఆరాటం.. కట్ చేస్తే నెక్స్ట్ రవితేజ!

Samantha: నా విడాకులు వారికి సంబరాలు.. సమంత షాకింగ్ కామెంట్స్!

HBD Prabhas: 46 ఏళ్లు.. ఇప్పటికైనా శుభవార్త చెప్పవయ్యా!

Prabhas : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రెబల్ స్టార్ టు పాన్ ఇండియా స్టార్..ఆస్తుల విలువ ఎంత..?

Big Stories

×