Trisha Krishnan: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి టీవీకే అనే పార్టీని స్థాపించి అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలు నేడు సఫలం అయ్యాయి. 2026 ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. ఈ ఎన్నికలలో తన సొంత పార్టీ టీవీకే(TVK) ను బరిలోకి దింపారు విజయ్ దళపతి. ఈసారి ఎవరూ ఊహించని విధంగా ఏకంగా బలమైన పార్టీలను కూడా వెనక్కి నెట్టి ఆయన ముందంజలో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇకపోతే ఈరోజు ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇప్పటికే వంద స్థానాలలో ఆదిక్యత చూపించారు విజయ్ దళపతి.
తాజాగా వెలువడుతున్న ఫలితాలను బట్టి చూస్తే..ఈసారి అధికారంలోకి విజయ్ దళపతి టీవీకే పార్టీ రాబోతోందనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో త్రిష విజయ్ ఇంటికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికలలో టీవీకే పార్టీ గెలుపు దిశగా సాగుతున్న వేళ.. ఈ ఆసక్తికర పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇంటికి హీరోయిన్ త్రిష చేరుకున్నారు. ఎన్నికలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించనున్న వేళ ఆమె విజయ్ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే ఈరోజు ఉదయం త్రిష తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని విజయ్ కి అందజేశారు. మరొకవైపు త్రిష బర్తడే సందర్భంగా ఆమెకు కూడా విజయ్ విషెస్ తెలిపారు. ఏది ఏమైనా ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
ఇకపోతే గత కొంతకాలంగా వీరిద్దరి బంధంపై వస్తున్న వార్తలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఏ బంధం ఉందో బహిరంగంగా తెలియకపోయినా అటు విజయ్ భార్య సంగీత కూడా ఒక సినీనటి వల్లే తాను తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నాను అని చేసిన కామెంట్లు అందరినీ విస్మయానికి గురి చేసాయి. పైగా ఇప్పుడు విడాకుల కేసు కూడా కోర్టులో నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే త్రిష మాత్రం అవేవీ పట్టించుకోకుండా విజయ్ తో సన్నిహితంగానే కొనసాగుతోంది.
ఇటీవల ఇద్దరు కలిసి పెళ్లి ఫంక్షన్ కి కూడా వెళ్లారు. పైగా ఈరోజు త్రిష బర్తడే.. దీనికి తోడు విజయ్ పార్టీ అధికారంలోకి రావాలి అని తమిళనాడులో ఎలక్షన్స్ ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో తెల్లవారుజామునే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి స్వామి వారి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు రావడంతో త్రిష పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకుందా ? లేక విజయ్ రాజకీయ విజయం కోసం స్వామివారిని మొక్కుకుందా? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
also read:“త్రిష.. మీరు కన్న కలలు నిజమవ్వాలి..” విజయ్ పొలిటికల్ ఫలితాల వేళ బండ్ల గణేష్ ఆసక్తికర పోస్ట్
మొత్తానికి అయితే ఒకవైపు విజయ్ రాజకీయ గెలుపు మరొకవైపు త్రిష పుట్టినరోజు కావడంతో అభిమానులు సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.ఈ డబుల్ సంతోషంలో ఆమెకు స్పెషల్ సర్ప్రైజ్ ట్రీట్ ఇవ్వబోతున్నారట విజయ్ . తాజాగా పార్టీ గెలుపు సంబరాలతో పాటు వీరి వ్యక్తిగత జీవితం కూడా కొత్త మలుపు తీసుకోబోతుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా విజయ్ గెలుపుతో విజయ్ ముఖ్యమంత్రిగా.. త్రిష హోం మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ హడావిడి చేస్తున్నారు .మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి కామెంట్లు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.