E-Paper
Advertisement

జూలైలో మారుతి సుజుకికి బంపర్ సేల్స్.. వారెవ్వా.. ఒక్క నెలలో అన్ని లక్షల కార్లు అమ్మిందా?

జూలైలో మారుతి సుజుకికి బంపర్ సేల్స్.. వారెవ్వా.. ఒక్క నెలలో అన్ని లక్షల కార్లు అమ్మిందా?
Advertisement

Maruti Suzuki Sales Report July 2026: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి జూలై 2026 అమ్మకాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గత నెలలో దేశీయ అమ్మకాలు, ఇతర కంపెనీలకు సరఫరా చేసిన వాహనాలు, ఎగుమతులు కలిపి మొత్తం 2,41,421 వాహనాలను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. గత ఏడాది జూలైలో ఈ సంఖ్య 1,80,526 యూనిట్లు ఉండగా, ఈసారి 34 శాతం వృద్ధి నమోదైంది.

దేశీయ మార్కెట్ లో కొత్త రికార్డు

దేశీయ మార్కెట్‌లో మారుతి సుజుకి మరో కొత్త రికార్డు సృష్టించింది. డీలర్లకు మొత్తం 2,00,123 వాహనాలను పంపిణీ చేసింది. గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 1,40,570 యూనిట్లు మాత్రమే ఉండగా, ఈసారి ఏకంగా 42 శాతం పెరుగుదలను సాధించింది. వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ రావడంతో కంపెనీకి ఈ వృద్ధి సాధ్యమైందని భావిస్తున్నారు.

Advertisement

ఎంట్రీ లెవల్ కార్ల విభాగంలో ఆల్టో, ఎస్ ప్రెస్సో మంచి అమ్మకాలను నమోదు చేశాయి. జూలైలో ఈ రెండు మోడళ్ల కలిపి 12,634 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 6,822 యూనిట్లు మాత్రమే విక్రయించగా, ఈసారి దాదాపు 85 శాతం వృద్ధి నమోదైంది. తక్కువ ధర, మంచి మైలేజ్ వంటి కారణాలతో ఈ కార్లకు డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్ లో కూడా కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసింది. స్విఫ్ట్, డిజైర్, వాగన్ ఆర్, బాలెనో, సెలెరియో, ఇగ్నిస్, సియాజ్ లాంటి  మోడళ్ల కలిపి 90,822 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 65,840 యూనిట్లు మాత్రమే. దీంతో ఈ విభాగంలో 38 శాతం వృద్ధి నమోదైంది.

SUV, MPV విభాగంలోనూ దూకుడు

SUV, MPV విభాగంలో కూడా మారుతి సుజుకి మంచి ఫలితాలు సాధించింది. బ్రెజ్జా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఎర్టిగా, XL6, జిమ్నీ, ఇన్విక్టో, e Vitara వంటి మోడళ్ల కలిపి 78,851 యూనిట్లు విక్రయించగా, గత ఏడాది ఇదే నెలలో 52,773 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ విభాగంలో 49 శాతం వృద్ధి కనిపించింది.  వ్యాన్ విభాగంలో ఈకో మోడల్‌కు కూడా మంచి డిమాండ్ కొనసాగింది. జూలైలో 13,896 యూనిట్లు అమ్ముడయ్యాయి. అలాగే సూపర్ క్యారీ లైట్ కమర్షియల్ వెహికల్ 3,920 యూనిట్లు విక్రయించి గత ఏడాదితో పోలిస్తే 40 శాతం వృద్ధి సాధించింది.

Advertisement

టయోటా కిర్లోస్కర్ మోటార్‌కు రీబ్యాడ్జ్ చేసిన మోడళ్లను కూడా మారుతి సరఫరా చేస్తోంది. ఈ కేటగిరీలో గత నెల 11,242 యూనిట్లు విక్రయించింది. దీంతో మొత్తం దేశీయ అమ్మకాలు 2,11,365 యూనిట్లకు చేరుకున్నాయి.

ఎగుమతులలో కాస్త తగ్గుదల

అయితే ఎగుమతుల విషయంలో మాత్రం స్వల్ప తగ్గుదల కనిపించింది. జూలై 2026లో కంపెనీ 30,056 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేయగా, గత ఏడాది ఇదే నెలలో 31,745 యూనిట్లు ఎగుమతి చేసింది. అంటే ఎగుమతుల్లో సుమారు 5 శాతం తగ్గుదల నమోదైంది.

Read Also: హోండా నుంచి 3 కొత్త కార్లు.. ఏ మోడళ్లు వస్తున్నాయో తెలుసా?

Related News

ఏథర్ సూపర్ సర్‌ ప్రైజ్.. కొత్త EL స్కూటర్‌ లాంచ్ డేట్ ఫిక్స్!

MG విండ్సర్‌ ఔట్.. ఇండియన్ EV మార్కెట్‌ లో కొత్త చాంపియన్!

హోండా నుంచి 3 కొత్త కార్లు.. ఏ మోడళ్లు వస్తున్నాయో తెలుసా?

జూలైలో టాటా అమ్మకాల జోరు.. వామ్మో.. ఒక్క నెలలో అన్ని కార్లు అమ్మిందా?

2030 నాటికి కియా నుంచి 8 ఎలక్ట్రిఫైడ్ కార్లు.. EV, హైబ్రిడ్, CNGపై భారీ ప్లాన్!

విడా నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఔనా.. నిజమా? EV కారుగా అంబాసిడర్ రీఎంట్రీ?

Big Stories

Advertisement
×