E-Paper
Advertisement

బిగ్ బాస్ తర్వాత గంగవ్వ లైఫ్ మొత్తం మారిపోయిందా? అంజి మామ షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ తర్వాత గంగవ్వ లైఫ్ మొత్తం మారిపోయిందా? అంజి మామ షాకింగ్ కామెంట్స్
Advertisement

Gangavva’s Bigg Boss Journey: గంగవ్వ ..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలీని వారుండరంటే ఆశ్చర్యం లేదు.ముఖ్యంగా మై విలేజ్ షో ద్వారా ఈవిడ పండించిన కామెడీ అంతా ఇంతా కాదు.ఇక ఆ క్రేజ్ తో బిగ్ బాస్ కి వెళ్లి మరింత పాపులర్ అయిపొయింది.అయితే తాజాగా మై విలేజ్ షో ద్వారా పాపులర్ అయిన అంజి మామ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గంగవ్వ కి వచ్చిన క్రేజ్,ఆమె సంపాదించిన డబ్బు, ఆ తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పుల గురించి చెప్పిన మాటలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లోకి వెళ్లిన తర్వాత

అంజి మామ మాట్లాడుతూ గంగవ్వకు ముందు నుంచే మై విలేజ్ షో ద్వారా మంచి గుర్తింపు ఉన్నప్పటికీ 2020లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లోకి వెళ్లిన తర్వాత ఆమెకు వచ్చిన పాపులారిటీ ఇంకా బాగా పెరిగిందని చెప్పుకొచ్చాడు.నాగార్జున హోస్ట్ చేసిన ఆ సీజన్‌లో గంగవ్వ వయసు, బ్యాక్‌గ్రౌండ్, ఆమె మాట్లాడే విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆరోగ్య కారణాలతో ఆమె షో నుంచి మధ్యలోనే బయటకు వచ్చినా.. అప్పటికే ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంగతి తెల్సిందే.

Advertisement

ఇక షోలో నాగార్జున గంగవ్వకు రూ.7 లక్షలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఆ డబ్బుతో గంగవ్వ తన ఇంటి నిర్మాణానికి ఉపయోగించుకున్నారని చెప్పారు. ముఖ్యంగా ఆ డబ్బును తన కోసం దాచుకోవడం కంటే.. ఇంటి కోసం ఖర్చు పెట్టడం ఆమె జీవితంలో ఎంతటి మార్పు తీసుకొచ్చిందో ఆయన వివరించారు.

ఆమెకు వచ్చిన క్రేజ్‌కు బెస్ట్ ఎగ్జాంపుల్

గంగవ్వ విషయానికి వస్తే సహజమైన తెలంగాణ యాస, కామెడీ టైమింగ్, ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడే విధానమే అందరిని ఆకట్టుకుంది.ఇక అటు మై విలేజ్ షోతో పాటు బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో చాలా సినిమాల్లో ,వెబ్ సిరీస్ లలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లోనూ గంగవ్వ కనిపించడం ఆమెకు వచ్చిన క్రేజ్‌కు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు.

Advertisement

మొత్తంగా అంజిమామ చెప్పిన దాని ప్రకారం గంగవ్వ బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీతో పాటు డబ్బు కూడా వెనకేసిందని అర్థమైతుంది. అయితే బిగ్ బాస్ ఆమెకు పెద్ద ప్లాట్‌ఫామ్ కల్పించవచ్చు. కానీ ఆ ప్లాట్‌ఫామ్‌ వరకు తీసుకెళ్లింది మాత్రం ఆమె సొంత కష్టం, యూట్యూబ్‌లో సంపాదించిన క్రేజ్‌నే అనడంలో సందేహం లేదు.

మై విలేజ్ షోనే  అసలు పునాది

మొత్తానికి అంజి మామ చెప్పిన ఈ విషయాలు చూస్తే.. గంగవ్వ లైఫ్‌లో బిగ్ బాస్ ఒక టర్నింగ్ పాయింట్ అయితే, దాని కంటే ముందే ఆమె మొదలుపెట్టిన యూట్యూబ్ లో చేసిన మై విలేజ్ షోనే  అసలు పునాది అని అర్థమవుతోంది.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×