Kota Vs Anasuya:సాధారణంగా సినీ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య విభేదాలు సహజం. అయితే ఒక్కొక్కసారి ఆ మాటలు ఎదుటివారిని ఎంతలా బాధిస్తాయి అంటే చెప్పలేని పరిస్థితి. కానీ సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆ బాధలన్నింటినీ పక్కనపెట్టి ఎదుటి వ్యక్తి కోసం స్పందించాల్సిన అవసరం, మానవత్వం ఎంతైనా ఉందని తాజాగా జరిగిన సంఘటనలు అడ్డం పడుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. లెజెండ్రీ నటులుగా పేరు సొంతం చేసుకున్న కోటా శ్రీనివాసరావు (Kota Srinivas Rao) అనారోగ్య సమస్యల కారణంగా ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయన మరణ వార్త సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. సీనియర్ హీరోలు, కమెడియన్లు, నేటితరం హీరోలు, స్టార్ హీరోలు అందరూ కూడా ఆయన పార్థివ దేహాన్ని సందర్శిస్తూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు.
అనసూయ పై కోటా శ్రీనివాసరావు కామెంట్స్..
ఇలాంటి సమయంలో కోటా శ్రీనివాసరావు.. ప్రముఖ యాంకర్ అనసూయ పై చేసిన కామెంట్లను నెటిజన్స్ గుర్తు చేసుకుంటున్నారు. అందులో కొంతమంది అనసూయ(Anasuya ) ఇంకా ఆ ఘటనను మనసులో పెట్టుకుందేమో.. అందుకే కోటా శ్రీనివాసరావు మరణించినా ఆమె స్పందించలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. అప్పట్లో ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న కోటా శ్రీనివాసరావు.. “అనసూయ ఎవరో తనకు తెలియదని కామెంట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ కొంతకాలానికి ఆమె డ్రెస్సింగ్ గురించి మాట్లాడారు. ఆమె మంచి నటి, చక్కగా హావభావాలు పలికిస్తారు. డాన్స్ కూడా చక్కగా వేస్తారు. కానీ ఆవిడ వేసుకునే డ్రెస్సులు నాకు నచ్చవు” అని కోటా శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.
ట్విట్టర్లో వేదికగా కోటా శ్రీనివాసరావుపై మండిపడ్డ అనసూయ..
దీనిపై మండిపడ్డ అనసూయ.. తన ట్విట్టర్ వేదికగా కోటా శ్రీనివాసరావు పేరు ప్రస్తావించకుండా రీసెంట్ గా..” ఒక సీనియర్ యాక్టర్ నాపై కొన్ని కామెంట్లు చేశారు అని తెలిసింది. నా వస్త్రధారణ గురించి ఆయన మాట్లాడారు. అలాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఇలా నీచంగా మాట్లాడడం అనేది నాకు చాలా దుఃఖాన్ని కలిగించింది. ఒకరు ధరించే దుస్తులు వారి వ్యక్తిగతం. అలా వృత్తిపరమైన పరిస్థితులను అనుసరించి కూడా అలా చేసి ఉంటారు అనే విషయాన్ని ఎందుకు మరిచిపోయారు. ముఖ్యంగా అలాంటి ఒక సీనియర్ నటుడు మందు తాగుతూ.. అద్వానమైన దుస్తులను ధరించి ఎలా పేరు తెచ్చుకున్నాడో అర్థం కాలేదు” అంటూ ట్వీట్ చేసింది.
మానవత్వం చాటుకున్న అనసూయ..
అయితే ఆ ట్వీట్ ను కొంతమంది నెటిజన్స్ ఇప్పుడు మళ్లీ షేర్ చేస్తూ.. అనసూయ మానవత్వం చాటుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో అనసూయపై, ఆమె డ్రెస్ పై కోటా శ్రీనివాసరావు అన్ని మాటలన్నా.. ఆమె మాత్రం అవన్నీ పట్టించుకోకుండా, మనసులో ఏమీ పెట్టుకోకుండా.. ఆయన మరణించారన్న విషయాన్ని తెలుసుకొని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుతూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ షేర్ చేసింది. ఎంతైనా అనసూయకి మానవత్వం ఎక్కువ.. అందుకే తనను అన్ని మాటలు అని అవమానించినా సరే ఆమె ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంది అంటూ ఆమెపై కామెంట్లు చేస్తున్నారు.
చిరంజీవి గొప్పతనాన్ని కూడా గుర్తు చేసుకుంటూ..
గతంలో మెగాస్టార్ చిరంజీవి పై కూడా కోటా శ్రీనివాసరావు ఇదే రేంజ్ లో కామెంట్ చేశారు. ఆయనను కించపరిచారు.. అటు మెగా అన్నదమ్ములు కూడా పంతాలకు పోలేదు. అటు పవన్ కళ్యాణ్ ఇటు చిరంజీవి ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా కోటా శ్రీనివాస్ రావు మృతదేహానికి సంతాపం వ్యక్తం చేయడమే కాకుండా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పట్టింపులు మనిషి బ్రతికున్నప్పుడే కానీ మనిషి చనిపోయాక కాదు.. అంటూ నిరూపించారు. మొత్తానికైతే కోటా శ్రీనివాసరావు అటు అనసూయ ను ఇటు మెగా అన్నదమ్ములను అన్ని మాటలు అన్నా సరే.. వీరు మాత్రం ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు
also read:Kota Srinivas Rao: కోటా మెచ్చిన హీరోలు వీళ్లే.. జాబితాలో మీ హీరో కూడా!
One of my most favourite actors.. unequalled versatility..had the privilege of speaking to him one to one in detail about the ways of life and this workline.. treated me as someone of his own.. will regret not meeting him as promised in his last days.. Kota garu.. gone but never…
— Anasuya Bharadwaj (@anusuyakhasba) July 13, 2025