Roja -Anasuya: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇలా జీ తెలుగులో ప్రసారం కాబోతున్న డ్రామా జూనియర్స్(Drama Juniors) కార్యక్రమానికి కూడా ఎంతో మంచి ఆదరణ లభించింది. ఈ కార్యక్రమానికి జడ్జెస్ గా డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) రోజా(Roja) వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా అనసూయ కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారని తెలుస్తుంది. “అందమైన అత్త.. కలర్ ఫుల్ కోడలంటూ” సాగిపోయే ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ అత్తా, కోడలుగా సందడి చేశారు.
శ్రీవల్లి క్యారెక్టర్..
ఇలా ఇద్దరు అత్త కోడలుగా వేదిక పైకి రావడంతో వెంటనే అనిల్ రావిపూడి మీరెవరండి అంటూ ప్రశ్న వేయగా అత్తా కోడళ్ళమంటూ రోజా సమాధానం చెప్పింది. వెంటనే సుధీర్ మీలో అత్త ఎవరు? కోడలెవరు? అంటూ ప్రశ్న వేయగా వెంటనే రోజా(Roja) కోడలు, అనసూయ(Anasuya) అత్త అంటూ చెప్పడంతో ఒక్కసారిగా అనసూయ షాక్ అవుతుంది. వెంటనే రోజా రంగస్థలం సినిమాలో నీ క్యారెక్టర్ పేరు ఏంటి అంటూ అనసూయని ప్రశ్నించడంతో రంగమ్మత్త అంటూ అనసూయ సమాధానం చెబుతుంది. నువ్వు అత్తలాగ ఉన్నావు కాబట్టే నీకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అదే ఆయన నన్ను చూసి ఉంటే శ్రీవల్లి(Sri Valli) క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళు అంటూ రోజా సమాధానం చెబుతుంది.
ఫీలింగ్స్ చచ్చిపోయేవి..
రోజా ఇలా మాట్లాడటంతో వెంటనే అనసూయ అప్పుడు అల్లు అర్జున్ కు ఫీలింగ్స్ వచ్చిండేవేమో కానీ.. చూసే వాళ్లకు మాత్రం ఫీలింగ్స్ చచ్చిపోయేవి అంటూ తనదైన శైలిలోనే రోజాపై సెటైర్ వేశారు. నేను అత్తను, కాదు కోడలని ఏ తలకు మాసిన వెధవని అడిగిన చెబుతారు అంటూ సుదీర్ ను అడగడంతో సుధీర్ ఒక్కసారిగా షాక్ అవుతారు. మొత్తానికి అనసూయ, రోజా సందడి మాత్రం పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పాలి. తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈ ప్రోమోకి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రతి శనివారం రాత్రి 8:45 నిమిషాలకు ప్రసారం కాబోతోంది.
ఇకపోతే అనసూయ రోజా ఇదివరకు జబర్దస్త్ (Jabardasth)కార్యక్రమంలో కూడా సందడి చేసిన విషయం తెలిసినదే. జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమైన మొదట్లో రోజా ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు. అదేవిధంగా అనసూయ ఈ కార్యక్రమంలో యాంకర్ గా కొనసాగారు. అనసూయకు సినిమా అవకాశాలు రావడంతో తప్పనిసరి పరిస్థితులలో జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకోగా, రోజా మాత్రం మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేసిన ఈ ఇద్దరు తిరిగి డ్రామా జూనియర్స్ కార్యక్రమంలో కనిపించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల రోజా ఎన్నికలలో ఓటమిపాలు కావడంతో తిరిగి బుల్లితెర పైకి రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
Also Read: Upasana: బాధ్యత కోసం పెళ్లి వద్దు..మీ రాముడి కోసం వేచి చూడండి.. సలహా ఇచ్చిన ఉపాసన!