E-Paper
Advertisement

Squid Game : ఓర్ని.. స్క్విడ్ గేమ్ ఎండింగ్ మొత్తం మార్చేశారు కదా? విన్నర్ ఎవరంటే?

Squid Game : ఓర్ని.. స్క్విడ్ గేమ్ ఎండింగ్ మొత్తం మార్చేశారు కదా? విన్నర్ ఎవరంటే?
Advertisement

Squid Game : ‘స్క్విడ్ గేమ్’ సీజన్ 3కి ఊహించని ఎండింగ్ తో ముగింపు పలికారు మేకర్స్. అయితే చాలామందికి ఈ క్లైమాక్స్ రుచించలేదు. అందరినీ కాపాడాలని అనుకున్న 456 చివరకు ప్రాణాలు వదలడాన్ని ఈ సిరీస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది మీమ్స్ తో ఆడుకుంటున్నారు. తాజాగా ‘స్క్విడ్ గేమ్’ సీజన్ 3 క్లైమాక్స్ కు సంబంధించిన ఓ ఏఐ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే ?

స్క్విడ్ గేమ్ ఎండింగ్ మార్చేసిన ఏఐ
ఈ ఏఐ వీడియోలో ‘స్క్విడ్ గేమ్ సీజన్ 3’లోని హైడెన్ సీక్ టాస్క్ తో పాటు చివరి సీన్ వరకూ మార్చేశారు. మొదట్లో హీరో రెడ్ వెనమ్ లా మారి, దేవుడు పూనాడు అంటూ నాటకాలాడే మహిళను భయపెడతాడు. ఆ తరువాత ఓ ముసలోడు చనిపోయినట్టు నటించే సీన్ లో చిన్న పిల్లాడి ఏడుపును పెట్టి, హిలేరియస్ గా డిజైన్ చేశారు. అంతేనా 222 బాయ్ ఫ్రెండ్ తో కలిసి హైడ్ అండ్ సీక్ ఆడే అతను మనుషుల కళ్ళు తీసుకుని తింటున్నట్టుగా కొన్ని వయోలెంట్ సీన్స్ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. కొన్ని హ్యాపీ, మరికొన్ని సెటైరికల్, యూత్ ఫుల్ కంటెంట్ తో నింపేశారు. చివరగా హీరో ఆ శిశువును చంపేసి విన్ అవుతాడు. నిజానికి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన క్లైమాక్స్ ఇది కాదు. హీరో, ఆ శిశువు ఇద్దరూ అక్కడి నుంచి ఎలాగోలా బయట పడతారు అనుకున్నారు. అయితే అలా జరగకపోయినా, ఈ ఏఐలో ఉన్న క్లైమాక్స్ కొంచం బెటర్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Read Also : ఇన్వెస్టిగేషన్ రూమ్ లో ఇవేం పాడు పనులు పాపా… ఆఫీసర్ ముందే వేషాలు… ఎక్స్ట్రీమ్ హిలేరియస్ సీన్స్

అసలు క్లైమాక్స్ ఏంటి ?
456, శిశువు, ఆ బిడ్డ తండ్రి ముగ్గురూ చివరి ఛాలెంజ్ వరకూ మిగులుతారు. అయితే చివర్లో ఆ బిడ్డ తండ్రి హీరోను చంపేసి, పాపతో గేమ్ విన్ అవ్వాలి అనుకుంటాడు. హీరోతో ఫైట్ జరిగిన సమయంలో ఆ బిడ్డను బలిచ్చి అయినా సరే తాను బతకాలి అనుకుంటాడు. హీరో అతన్ని చంపేస్తాడు. కానీ రూల్ ప్రకారం బటన్ నొక్కకుండానే బిడ్డ తండ్రి చనిపోతాడు. దీంతో పోటీ హీరో, ఆ బిడ్డ మధ్య ఉంటుంది. అయితే హీరో తనను తాను త్యాగం చేసుకుని, పాప విన్ అయ్యేలా చేస్తాడు. జూన్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది.

Advertisement

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×