Brahmamudi serial today Episode: ఇంటికి వచ్చిన నందును చూసి చలపతి ఎప్పుడు వచ్చావని అడుగుతాడు. నందు అన్ని విషయాలు చెప్పి ఇక చివరి సారి వెంకీని కలిసి వెళ్దామని వచ్చాను అని చెప్తుంది. అందుకు చలపతి షాక్ అవుతాడు. అయితే వరంగల్‌లో ట్రైనింగ్ కు వెళ్తే మళ్లీ ఇక్కడ ఇప్పట్లో రాను కదా అందుకే అలా అన్నాను అంటుంది. నందు మాట్లాడుతుంటే.. వెంకీ బాధపడుతుంటాడు. చలపతి మాత్రం అయితే మాకు కనిపించనంత దూరం వెళ్తావు అన్నమాట అనగానే.. నందు బాధగా దగ్గర ఉండాలన్నా ఉండలేము కదా అంకుల్ అంటుంది. వెంటనే చలపతి ఏంటమ్మా ఎందుకో నువ్వు ఇవాళ డల్లుగు కనిపిస్తున్నావు.. పోలీస్ జాబ్‌కు సెలెక్ట్ అయిన సంతోషం నీ ముఖంలో కనిపించడం లేదే అనగానే..
అదేం లేదు అంకుల్ ఇష్టమైన వాళ్లకు దూరంగా వెళ్తున్నాను కదా అందుకే కష్టంగా ఉంది సరే వెళ్లొస్తాను అంకుల్ అంటూ వెంకీ నాకు ఏదైనా చెప్పేది ఉందా..? అనగానే.. వెంకీ అదేం లేదు అని చెప్పగానే.. ఇప్పుడు కాకపోయినా తర్వాతైన ఫోన్ చేసి చెప్పు అనగానే.. చెప్తాడులే అమ్మా నీకు కాకపోతే మరెవరికి చెప్తాడు అంటూ కాల్ రాగానే.. బయటకు వెళ్తాడు చలపతి. నందు వెళ్లబోతుంటే.. వెంకీ పిలుస్తాడు. నందు హ్యాపీగా చెప్పరా బయటకు వెళ్దామా అనగానే.. ఆల్ ది బెస్ట్ అంటాడు. దీని కోసమే పిలిచావా అనగానే..అవునని అంటాడు వెంకీ సరే అంటూ నందు వెళ్లిపోతుంది. రూంలోకి వెళ్లి వెంకీ ఏడుస్తుంటాడు. లక్ష్మీ వెల్లి ఓదారుస్తుంది.
ఐశ్వర్య బుక్స్ పట్టకుని కుస్తీ పడుతుంది. అటూ ఇటూ తిరుగుతూ ఇబ్బంది పడుతుంది. స్వాతి చూసి నవ్వుతుంది. ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే.. సారీ అక్కా నువ్వు ఇలా చదువుతుంటే నాకు నవ్వు వస్తుంది అని స్వాతి చెబితే.. ఏంటి నా చదువు నీకు కామెడీగా ఉందా..? అనగానే.. కాదు అక్కా నువ్వే చదువును కామెడీగా తీసుకున్నావు.. అందుకే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది.. అయినా అక్కా ఇప్పుడు నువ్వు ఇలా ఎందుకు చదువుతున్నావు అనగానే.. ఏం తెలియనట్టు మాట్లాడకు అంటుంది ఐశ్వర్య..
అది కాదు అక్కా సివిల్స్ కు ప్రిపేర్ అయినట్టు ఉంది నీ వాలకం.. కాకపోతే వాళ్లకు నీకు ఒకటే తేడా ఉంది. వాళ్లేమో నిజంగానే చదువుతారు.. నువ్వేమో చదువుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు.. బిల్డప్ ఇస్తే పాస్ అవ్వరు అక్కా చదువుతే పాస్ అవుతారు అంటే.. ఐశ్వర్య కోపంగా స్వాతిని తిట్టి ఏవేవో బుక్స్ చదువుతూ నిద్రపోతూ నానా తంటాలు పడుతుంది. స్వాతి చూసి నవ్వుతుంది. నిద్రపు ఆపుకోవడానికి నానా తంటాలు పడుతుంది. సెల్ ఫోన్ చేస్తూ నిద్ర పోతుందని సెల్ చూస్తూ.. గంట టైం గడిపేస్తుంది. తర్వాత పడుకుని చదువుకుంటుంది. స్వాతి తాను నిద్రపోతాను బెడ్ మీద నుంచి లేవమని చెప్పగానే.. వెళ్లి స్టడీ చైర్ మీద కూర్చుని బుక్ మీద తల పెట్టి పడుకుని నిద్రపోతుంది.
మరుసటి రోజు ఉదయమే ఇందు కాఫీ తీసుకుని వస్తుంది. స్వాతి అక్కా ఎవరికి కాఫీ తీసుకొచ్చావు అని అడిగితే.. ఐషు అక్క కోసం పాపం రాత్రంతా చదివి బాగా అలసిపోయి ఉంటుంది కదా..? అందుకే తీసుకొచ్చాను అని ఇందు చెప్పగానే. స్వాతి నవ్వుతూ.. రాత్రి మొత్తం జరిగిన విషయం చెప్తుంది. బుక్ చూస్తే నిద్ర వస్తుందని గంటలు గంటలు ఫోన్ చేసి ఇలా బుక్ మీద తల పెట్టి నిద్ర పోతుంది. అని చెప్పగానే.. ఇందు కోపంగా ఐశ్వర్యను నిద్ర లేపుతుంది. రాత్రంతా చదువుకోకుండా ఫోన్ చూశావంట కదా అంటూ కాఫీ స్వాతికి ఇవ్వబోతుంటే..
ఐశ్వర్య కోపంగా తిడుతుంది. నేను చదవలేదని ఎవరు చెప్పారు అని ఐశ్వర్య చెబితే అయితే నువ్వు బాగా కష్టపడి చదివితే నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తావా…? అనగానే.. ఐశ్వర్య కన్పీజ్ అవుతుంది. రాత్రంతా చదివినా ఒక్క సమాధానం నేర్చుకోలేదా..? నీకు ఈ చాలెంజ్‌లు కంపెనీలు చేత కావు.. అందుకే వంటా వార్పు నేర్చుకో అంటూ చెప్పి వెళ్లిపోతుంది ఇందు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.