Weather Update: గడిచిన వారం రోజుల నుంచి తెలంగాణలో వర్షం అంతగా పడడం లేదు. రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు మాత్రమే పడుతున్నాయి. మే చివరి వారంలో వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. మళ్లీ జులై మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. జూన్ నెలలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిశాయి. ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని రైతులు కాస్త ముందస్తుగానే వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. మే నెల చివరి వారంలోనే పత్తి గింజలు, నార్లు పోశారు. అయితే ఆ తర్వాత జూన్ నెల వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందారు.. ఎప్పుడెప్పుడు వర్షాలు పడుతాయా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. గడిచిన వారం రోజుల నుంచి రాష్ట్రంలో వర్షాలే పడడం లేదు. దీంతో రైతులు వర్షాల రాక కోసం ఆకాశం వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
మరో గంటలో ఈ ఏరియాల్లో భారీ వర్షం
ఈ క్రమంలోనే తెలంగాణ వెదర్ మ్యాన్ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. మరో గంట సేపట్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతాయని చెప్పారు. మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హన్మకొండ, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడతాయని వివరించారు. వెస్ట్ తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అంతే కాకుండా భాగ్య నగరలోనూ పలు ప్రాంతాల్లో సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ వివరించారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్పారు.
ఈ రెండు రోజులు జాగ్రత్త
ఈ క్రమంలోనే హైదారాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేసింది. రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. జులై 17, 18 తేదీల్లో తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే జూలై 16 తేదీకి మాత్రం ఎలాంటి వర్షం పడదని చెప్పింది. రాష్ట్రంలో పలు చోట్ల వడగండ్ల వానలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
జాగ్రత్తగా ఉండండి..
అయితే.. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని.. ముఖ్యంగా చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
ALSO READ: Viral video: నడిరోడ్డుపై జుట్లు పట్టుకుని పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్
ALSO READ: JOBS: ఇంటర్ అర్హతతో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు.. భారీ వేతనం, లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?