E-Paper
Advertisement

వెయ్యేళ్ళ నాటి భయంకరమైన శాపం వెంటాడితే… సీను సీనుకో ట్విస్టున్న సిరీస్

వెయ్యేళ్ళ నాటి భయంకరమైన శాపం వెంటాడితే… సీను సీనుకో ట్విస్టున్న సిరీస్
Advertisement

Mythological Horror Series: శాపాలు తరతరాలను వెంటాడతాయన్న విషయం తెలిసిందే. కానీ వెయ్యేళ్ళ నాటి శాపం వెంటపడితే… ఓ మాయగాడు ముగ్గురు అక్కాచెల్లెళ్లను వలలో వేసుకుంటే… ఆ తరువాత ఏం జరిగింది అన్నదే ‘శ్రాప్’ (Shraap) మూవీ కథాంశం. వందల సంవత్సరాల నాటి శాపం కలియుగంలోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమాలో చూపించారు. ఈ హిందీ హారర్ మైథలాజికల్ వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ పురాతన శతాబ్దాల నాటి ఒక భయంకరమైన తంత్ర పూజ, శాపం చుట్టూ తిరుగుతుంది. వర్తమాన కాలంలో ఒక కుటుంబానికి ఎదురైన పారానార్మల్ సంఘటనలతో కథ మొదలవుతుంది. వందల సంవత్సరాల క్రితం ‘సోంపుర మహావిహార్’ అనే పురాతన భవన శిథిలాల దగ్గర భయంకరమైన తాంత్రిక పూజను చేస్తారు. ఆ సమయంలో రక్తాశ్రితమైన ఒక పవిత్ర అవశేషాన్ని అక్కడ దాస్తారు. దాన్ని రక్తఫలక్ అనే పేరుతో పిలుస్తారు. కాలక్రమేణా ఆ రక్తఫలక్ మళ్లీ బయటకు వస్తుంది.

Advertisement

దీనివల్ల వెయ్యేళ్ల నాటి ఒక క్రూరమైన కర్మ చక్రం మళ్లీ మేలుకొంటుంది. ఇక్కడి నుంచే ‘దత్తగుప్తా’ కుటుంబంపై వేట స్టార్ట్ అవుతుంది. మరోవైపు ఇదే సమయంలో ‘తిత్లీ’ అనే అమ్మాయి, ఆమె సిస్టర్స్ ఎంట్రీ ఇస్తారు. కానీ వాళ్ళు ఒక అక్రమ మానవ రవాణాదారుడి వలలో పడతారు. పైకి చాలా మంచివాడిగా నటిస్తూ లోపల క్రూరమైన మృగం లాంటి ఆలోచనలు దాచుకున్న ఆ వ్యక్తి పేరు ‘తేనియా’.

ఈ డేంజరస్ సిట్యుయేషన్ లో ఆ శక్తుల నుండి, పునర్జన్మ పొందిన క్రూరమైన దుష్టశక్తిని అంతం చేయడానికి… దాని నుండి తిత్లీ కుటుంబాన్ని కాపాడటానికి ‘అగంబగీష్’ అనే ఒక శక్తివంతమైన తాంత్రిక పండితుడు రంగంలోకి దిగుతాడు. తన ఆధ్యాత్మిక శక్తులను ఉపయోగించి, కాలంతో పోటీ పడుతూ ఆ వెయ్యేళ్ల నాటి భయంకరమైన శాపాన్ని అతను ఎలా అంతం చేశాడు ? ఆ అక్కా చెల్లెళ్లను ఎలా కాపాడాడు ? అనేదే ఈ సిరీస్ క్లైమాక్స్.

తెలుగులో ఉందా ?

Advertisement

“శ్రాప్’ సిరీస్ కర్మ, శాపం, ప్రతీకారం వంటి అంశాలతో ఉత్కంఠభరితంగా తెరకెక్కిన కథ. పరంబ్రత ఛటర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శాశ్వత ఛటర్జీ, అర్జున్ చక్రవర్తి, మోహనా మైతీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మిని సిరీస్ 2026 మే 15న విడుదలైంది. మొదటి సీజన్‌లో మొత్తం 6 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఒరిజినల్‌గా బెంగాలీలో రూపొందింన ఈ సిరీస్, ప్రస్తుతం హిందీ డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం Amazon MX Playerలో స్ట్రీమింగ్ అవుతోంది. హర్రర్ మూవీ లవర్స్ ఒకవేళ ఇప్పటిదాకా ఈ సిరీస్ ను చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి మరి. మతం, చేతబడి పేరుతో జరిగే మోసాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించారు.

Read Also: అలాంటి అమ్మాయిల రూపంలో లక్ష్మీదేవి… మోస్ట్ అండర్రేటెడ్ మాస్టర్ పీస్

Tags

Related News

వయసు 50 దాటినా యాక్షన్‌లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

Big Stories

Advertisement
×