Hansika Motwani Divorce: ఇండస్ట్రీలో పెళ్లి, విడాకులు సర్వసాధారణం. ప్రేమ పెళ్లయినా, పెద్దల కుదర్చిన వివాహమైన.. వైవాహిక బంధంలో కాస్తా విభేధాలు వచ్చాయంటే.. ఆ బంధానికి స్వస్తి చెబుతున్నారు. ఈ మధ్య ఇండస్ట్రీలో విడుకుల తీసుకునే జంటల సంఖ్య పెరిగిపోతుంది. నాగ చైతన్య–సమంత, సింగర్ జీవీ ప్రకాశ్–సైంధవి.. యంగ్ జంటలు విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక సీనియర్ కపుల్స్ సైతం విడాకుల బాట పడుతున్నారు. ఏఆర్ రెహమాన్ లాంటి ప్రముఖ సంగీత సంగీత దర్శకుడి విడాకులు తీసుకోవడం అందరికి షాకిచ్చింది. దాదాపు 30 ఏళ్ల తన వైవాహిక జీవితానికి ఎండ్ పలికాడు.
భర్తతో మనస్పర్థలు
ఇప్పటికీ ఇది హాట్ టాపిక్ గానే ఉంది. ఈ నేపథ్యంలో మరో స్టార్ సెలబ్రిటీల విడాకుల దిశగా నిర్ణయం తీసుకోబోతోన్నట్టు తెలుస్తోంది. తను మరెవరో కాదు స్టార్ హీరోయిన్ హన్సిక. మూడేళ్ల క్రితమే వివాహం చేసుకున్న ఆమె త్వరలోనే వైవాహిక బంధానికి స్వస్తి పలికేలా ఉందట. ప్రస్తుతం ఈ ఫిలిం దూనియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా హన్సిక మోత్వాని గురించి ప్రత్యేకంగా పరియం అవసరం లేదు. దేశ ముదురు సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కంత్రి, మస్కా, కందీరగ వంటి చిత్రాల్లో నటించింది. ఆమె సినిమాలు పెద్ద విజయం సాధించకపోవడం, కాస్తా బొద్దుగా తయారడంతో ఆమెకు ఆఫర్స్ తగ్గిపోయాయి.
పెళ్లయిన కొత్తలోనే వేరుగా కాపురం
దీంతో ఈ భామ కొంతకాలం తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. అదే సమయంలో సోహైల్ కతురియా ప్రేమలో పడి కొంతకాలం డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకుంది. 22 డిసెంబర్ 2022న అతడితో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. మూడేళ్ల పాటు అన్యోన్యంగా జీవించిన ఈ జంట మధ్య కలతలు మొదలయ్యాయి. నిజానికి పెళ్లయిన కొంతకాలానికి వీరిమధ్య గొడవలు వచ్చాయట. పెళ్లి తర్వాత సోహైల్ హన్సికతో కలిసి తన తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు. అయితే కుటుంబంలో హన్సిక ఇమిడలేకపోయిందట. దీంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు వచ్చేవని ఇన్ సైడ్ సినీసర్కిల్లో టాక్. దీంతో ఇద్దరు ముంబైలోనే వేరుగా కాపురం పెట్టారట.
విడాకుల సోహైల్ రియాక్షన్
అయినప్పటికీ వారి తీరు మారలేదు. తరచూ వాగ్వాదాలు, గొడవలు జరిగేవట. దీంతో కొద్ది రోజులుగా హన్నిక, సోహైల్ లు వేరు వేరుగా నివసిస్తున్నారు. హన్సిక తన భర్తకు దూరంగా తన తల్లి వద్ద ఉంటుండగా… సోహైల్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నట్టు సన్నిహితుల చెబుతున్నారు. బి టౌన్ లో కొద్ది రోజులుగా హన్సిక విడాకులపై గుసగుసల వినిపిస్తున్నాయి. కానీ, వీటిపై ఆమె స్పందించకపోవడం గమనార్హం. అయితే ఇటీవల సోహైల్ సన్నిహితులు ఇదే విషయమై మెసేజ్ చేశారట. అదేం లేదని, ఈ వార్తల నిజం కాదని చెప్పాడట. అదేటో మోహమాటం చెప్పాడట కానీ, ఇవి నిజం కాదని గట్టిగ ఖండించలేదట. ఇక వారి తీరు చూస్తుంటే విడాకుల దిశగా హన్సిక నిర్ణయం తీసుకుబోతుందని బి టౌన్ లో టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే స్వయంగా ఈ జంట స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
Also Read: HHVM Ticket Rates: భారీగా పెరిగిన ’హరి హర వీరమల్లు‘ టికెట్ ధరలు.. జీవో జారీ