Vaibhav Suryavanshi : టీమిండియా అండర్ -19 ఆటగాడు, యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ టెస్టుల్లో అయినా, టీ-20ల్లో అయినా మ్యాచ్ ఏదైనా తన సత్తాను చాటుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో కూడా గుజరాత్ టైటాన్స్ బౌలర్ల పై ఊచకోత కోసిన విషయం తెలిసిందే. అతి చిన్న వయస్సులోనే టీమిండియా ఆటగాడు ఎవ్వరూ సాధించని రికార్డులన్నింటినీ బ్రేక్ చేసేశాడు. టీమిండియా తరపున తక్కువ బంతుల్లో సెంచరీ చేసి అందరినీ ఆశ్యర్యపరిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ధోనీ-వైభవ్ సూర్యవంశీ లపై సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేశారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో రెడీ సినిమా డైలాగ్స్ యాడ్ చేసారు. రెడీ సినిమాలో తాత, మనమడు మధ్య జరిగే సంభాషణను ఇప్పుడు ట్రోలింగ్స్ లో వైభవ్ సూర్యవంశీ.. ధోనీకి మధ్య సంభాషణ మాదిరిగా క్రియేట్ చేసారు.
Also Read : Karam Akmal : 18 ఏళ్లు అయిన పాకిస్తాన్ దరిద్రం పోలేదు.. అదే చెత్త కీపింగ్… ఇంకా ఎన్నేళ్లు చంపేస్తార్రా
నిర్భంగా ఆడితే ఫలితాలు అవే వస్తాయి
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగిన సమయంలో ధోనీని కలిశాడు వైభవ్ సూర్యవంశీ. అందుకు సంబంధించిన వీడియోలో ఈ ముసలి నా కొడుకు వచ్చేస్తున్నాడు అని వైభవ్ సూర్యవంశీ పేర్కొనడం వైరల్ గా మారింది. అలాగే ముత్తాత గారికి ప్రణామాలు.. వీడికి దండం కాదు.. పిండం పెట్టాలి అని రెడీ సినిమాలో డైలాగ్ లను యాడ్ చేయడం విశేషం. ఇక మరోవైపు ఇటీవల టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒత్తిడి లేకుండా నిర్భయంగా ఆడితే అనుకున్న ఫలితాలు వాటంతటా అవే వస్తాయని పేర్కొన్నాడు. వైభవ్ వంటి యువ ఆటగాళ్లకు తానిచ్చే సలహా అదే అన్నారు.
ఎలాంటి దశలోనైనా..
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆరంగేట్రం చేశాడు. తొలి బంతినే సిక్స్ తో ప్రారంభించాడు ఈ 14 ఏళ్ల కుర్రాడు. హర్యానా కి చెందిన వైభవ్ ఈ సీజన్ లో 7 మ్యాచ్ లు ఆడి 252 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర సెంచరీ కూడా నమోదు చేయడం విశేషం. చెన్నై సూపర్ కింగ్స్ పై జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు వైభవ్ సూర్యవంశీ. 33 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ 200కి పైగా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. అలా చేయాలని భావిస్తే.. నిలకడైన ఆట చాలా కష్టం అనే చెప్పాలి. ఎలాంటి దశలోనైనా భారీ సిక్సర్లు బాదగల సత్తా వారికి ఉంది. అంచనాలు కచ్చితంగా ఉంటాయి. రోజురోజుకు అంచెనాలు పెరుగుతాయి. సీనియర్ ఆటగాళ్ల నుంచి నిత్యం సలహాలు తీసుకోవడం ఉత్తమం అని సూచించాడు ధోనీ. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ తో పాటు అండర్ -19 లో పలు మ్యాచ్ ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
?igsh=ZXJlMnh1bjQ0M2Nz