Jewellery Shop Robbery: సూర్యాపేటలో ఘరానా దోపిడీ జరిగింది. సాయి సంతోషి జ్యువెలరీ షాపులో 18 కిలోల బంగారం ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. దుకాణం వెనుక నుంచి గ్యాస్ కట్టర్‌తో.. షట్టర్ తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
దొంగతనానికి ముందస్తు ప్రణాళిక
ప్లాన్డ్ ప్రకారమే ఈ దోపిడి జరిగినట్లు తెలుస్తోంది. దుకాణం వెనుకభాగంలో గల గోడను గ్యాస్ కట్టర్ సహాయంతో కట్ చేసి.. లోపలికి ప్రవేశించిన దుండగులు, షట్టర్‌ను కూడా కట్ చేసి తెరిచారు. అనంతరం సేఫ్‌లను బద్దలు కొట్టి అందులో ఉన్న విలువైన బంగారు ఆభరణాలు మాయం చేశారు.
ఇవాళ ఉదయం దుకాణం తెరవడానికి వెళ్లిన యజమాని.. గోడకు కన్నం, షట్టర్ తెరిచి ఉండటంతో.. చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. బంగారు ఆభరణాలు లేకపోవడం చూసి దొంగలు పడ్డారని నిర్ధరణకు వచ్చాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఘటన స్థలంలో పోలీసుల తనిఖీలు
సూర్యాపేట పట్టణ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని.. ఫోరెన్సిక్, క్లూస్ టీమ్‌లను పిలిపించారు. దుకాణంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అయితే దుండగులు ముందుగానే సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు అనుమానిస్తున్నారు. దోపిడీకి రికార్డ్ అయిన ఫుటేజ్ ఆధారంగా.. ఇద్దరు ముసుగులు ధరించిన వ్యక్తులు షాప్ చుట్టూ.. సంచరించిన దృశ్యాలు కనిపించినట్లు సమాచారం.
లక్షల విలువైన బంగారం – పెద్ద స్కామ్
దొంగలు దాదాపు 18 కిలోల బంగారం తీసుకెళ్లినట్లు షాప్ యాజమాన్యం అంచనా వేస్తోంది. ఈ జ్యువెలరీ షాప్ గత 10 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తోంది. ఇలా భారీ మొత్తంలో బంగారం దొంగతనానికి గురవడం యాజమాన్యానికి తీవ్ర నష్టాన్ని కలగించింది.
పోలీసులు చేపట్టిన చర్యలు
సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సమీప ప్రాంతాల్లోని వాహనాల రాకపోకలపై హోటల్, ఏటిఎమ్, ఇతర షాపుల సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరిస్తున్నారు. నిందితులు సమీప ప్రాంతానికి చెందినవారేనా, లేక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారా అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.
అంతేకాదు, జ్యువెలరీ షాప్‌కు సంబంధించిన సిబ్బందిని కూడా.. విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మాజీ ఉద్యోగులు, గతంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల వివరాలను సేకరించి, విచారణ చేస్తున్నట్లు సమాచారం.
స్థానికుల భయాందోళన
ఈ ఘటనపై స్థానిక వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో.. ఇలా ఘరానా దోపిడీ జరగడం పోలీసుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
Also Read: సాంబారులో విషం కలిపి.. నా మొగుడ్ని లేపేశా ప్రియుడితో ఆడియో కాల్ లీక్
భవిష్యత్‌లో చర్యలపై అధికారులు
ఈ దోపిడీ ఘటన అనంతరం.. జిల్లా పోలీసులు రాత్రి సమయంలో మరింత భద్రత చర్యలు పెంచాలని నిర్ణయించారు. ముఖ్యంగా జ్యువెలరీ షాపులు, బంగారు వ్యాపారాలు ఉన్న ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని యోచిస్తున్నారు. అలాగే, షాపుల యజమానులకు అధునాతన భద్రతా వ్యవస్థలు.. ఏర్పాటు చేసుకోవాలని సూచించనున్నారు.
ఘరానా దోపిడీ.. 18 కిలోల బంగారం చోరీ
సూర్యాపేటలోని సాయి సంతోషి జ్యువెలరీ షాపులో 18 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు
దుకాణం వెనుక నుంచి గ్యాస్ కట్టర్‌తో షట్టర్ తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు
ఘటనాస్థలిలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు pic.twitter.com/TQqNk61WY4
— BIG TV Breaking News (@bigtvtelugu) July 21, 2025