HHVM Trailer : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నుంచి తాజాగా విడుదల కాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు (Harihara Veeramallu). ఎప్పుడు 2021లో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా రాబోతోంది. ఇప్పటికే దాదాపు 14 సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. ఎట్టకేలకు జూలై 24వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూడగా.. ఇప్పుడు అభిమానుల ఎక్సైట్మెంట్ ను దృష్టిలో పెట్టుకొని మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. మరి ట్రైలర్ ఎలా ఉంది? ఇందులో పవన్ కళ్యాణ్ తన పర్ఫామెన్స్ తో ఎలా మెప్పించారు? ఇన్నేళ్ల నిరీక్షణకు ప్రతిఫలం లభిస్తుందా? అనే విషయం చూద్దాం.
హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్..
ఇకపోతే మెగా సూర్యా ప్రొడక్షన్స్ చెప్పినట్టుగానే ఎంపిక చేయబడిన థియేటర్లలో తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అభిమానులకు పవన్ కళ్యాణ్ మంచి ఫీస్ట్ ఇచ్చారని చెప్పవచ్చు.
ట్రైలర్ లో ఏముందంటే?
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే.. “హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం”.. “ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం”.. “ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం”.. అంటూ ధర్మం కోసం పోరాటం ఎలా ఉంటుందో ట్రైలర్ స్టార్టింగ్ లో చూపించేశారు. “ఈ భూమి మీద ఉన్నది ఒకటే కోహినూర్.. దాన్ని కొట్టి తీసుకురావడానికి ఒక రామబాణం కావాలి” అంటూ తనికెళ్ల భరణి చెప్పిన డైలాగుకు సింక్ అయ్యేలా పవన్ కళ్యాణ్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో రంగంలోకి ఎంట్రీ ఇస్తారు.
డైలాగ్స్ తో గూస్ బంప్స్ గ్యారెంటీ..
“ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూసుంటారు.. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్ ట్రైలర్ కే హైలెట్గా నిలిచింది . అంతేకాదు మునుపటిలాగే తన యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో పవన్ కళ్యాణ్ అదరగొట్టేసారని చెప్పవచ్చు. “వినాలి.. వీరమల్లు చెప్పింది వినాలి” అంటూ మరో డైలాగ్ తో రెచ్చిపోయారు పవన్ కళ్యాణ్. ఇక ఇక్కడ నిధి అగర్వాల్ రాకుమారి పాత్రలో చాలా అద్భుతంగా నటించింది. వీరితోపాటు శాస్త్రి పాత్రలో సత్యరాజ్, సునీల్ ఇలా ఎవరికి వారు తమ పాత్రలకు ప్రాణం పోసేశారు. అటు యాక్షన్ పర్ఫామెన్స్ తో పాటు ఇటు కామెడీ కూడా జోడించి సినిమాకి పూర్తి న్యాయం చేశారు అన్నట్టు తెలుస్తోంది.. దీనికి తోడు పవన్ కళ్యాణ్ చివర్లో తోడేలు తో పోరాడే సన్నివేశం హైలెట్ గా నిలిచింది.
ALSO READ:Naga Chaitanya: ఆ హీరోయిన్ కి గజగజ వణికిపోతున్న చైతూ.. అంత భయం దేనికో!