Naga Chaitanya: అక్కినేని వారసుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న నాగచైతన్య (Naga Chaitanya).. తండ్రి లాగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయారు. ఇండస్ట్రీలోకి వచ్చి కొన్నేళ్లు అవుతున్నా.. ఇంకా సరైన సక్సెస్ ఆయన ఖాతాలో చేరకపోవడం ఆశ్చర్యకరమని చెప్పాలి. అలా సరైన సక్సెస్ కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న నాగచైతన్య ఇటీవల చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో ‘తండేల్’ సినిమా చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. యదార్ధ సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో మత్స్యకారుడిగా నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో నాగచైతన్యకి జోడిగా, సాయి పల్లవి(Sai Pallavi) నటించింది. దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందించారు.
ఆమె అంటే చాలా భయం – సాయి పల్లవి
ఇదిలా ఉండగా.. మొన్నా మధ్య రానా దగ్గుబాటి (Rana daggubati) హోస్ట్ గా చేస్తున్న ఒక టాక్ షోకి నాగచైతన్య గెస్ట్ గా వచ్చారు. ఈ షోకి రానా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాజరయ్యారు. ఇక ఈ షోలో సరదా ముచ్చట్లు పంచుకోగా.. నాగచైతన్య కూడా తన విషయాలను అభిమానులతో షేర్ చేశారు. ముఖ్యంగా ఒక హీరోయిన్ అంటే తనకు చాలా భయం అని , తన భార్య కంటే ఆమెకే ఎక్కువ భయపడతానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.. ఇదే విషయంపై నాగచైతన్య మాట్లాడుతూ..” నేచురల్ బ్యూటీ సాయి పల్లవి అంటే నాకు చాలా భయం. ఆమెతో నటించాలన్నా.. డాన్స్ చేయాలన్నా నాకు వణుకు వస్తుంది” అంటూ తెలిపారు నాగచైతన్య. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో లవ్ స్టోరీ, తండేల్ సినిమాలు వచ్చి రెండూ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.
సాయి పల్లవిని ఆట పట్టించిన రానా, చైతూ..
తర్వాత నాగచైతన్య రానా తో మాట్లాడుతూ..” నువ్వు కూడా సాయి పల్లవి తో విరాటపర్వం సినిమా చేశావు కదా.. కానీ డాన్స్ చేయకుండా తప్పించుకున్నావు” అన్నాడు నాగచైతన్య. ఆ తర్వాత సాయి పల్లవికి ఫోన్ చేసి ఆటపట్టించారు. ఇక సెట్లో దర్శకుడిని టార్చర్ చేస్తుంది అంటూ కూడా అటు నాగ చైతన్య ఇటు రానా ఇద్దరు ఈమెను సరదాగా ఆటపట్టించిన వీడియో వైరల్ గా మారింది. ఒక మొత్తానికైతే సాయి పల్లవి తో పోటీపడి నటించాలంటే కష్టం అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు నాగచైతన్య.
నాగచైతన్య వ్యక్తిగత జీవితం..
నాగచైతన్య వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2017లో సమంత (Samantha) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వివాహమైన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని వేరుపడ్డారు. ఇక అప్పటినుంచి ఒంటరిగా ఉంటూ కెరియర్ పైన ఫోకస్ పెట్టిన నాగచైతన్య.. ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాల (Shobhita dhulipala) తో రెండేళ్లపాటు ప్రేమాయణం సాగించి, ఆ తర్వాత గత ఏడాది నవంబర్లో వివాహం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన సెట్ లో అతి తక్కువ మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు నడుమ వీరి వివాహం జరిగింది. ఇక వివాహం తర్వాత అటు సినిమాలు చేస్తూ.. ఇటు తన షో యు రెస్టారెంట్ లో చెఫ్గా బాధ్యతలు చేపట్టి ముందుకు సాగుతున్నారు నాగచైతన్య. ప్రస్తుతం నాగచైతన్యకు సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Top Heroine : ప్రియుడి తల నరికిన హీరోయిన్… హత్య చేసి ఇంట్లోనే పెట్టుకుని