BigTV English

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సరికొత్త కండిషన్.. వారికి నో ఎంట్రీ!

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సరికొత్త కండిషన్.. వారికి నో ఎంట్రీ!

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా జూలై 24వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జూలై 21వ తేదీన ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించి కొన్ని షరతులను విధించింది చిత్ర బృందం. ముఖ్యంగా అలాంటి వారికి నో ఎంట్రీ అని.. భద్రత కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. మరి హరిహర వీరమల్లు చిత్ర బృందం భద్రతారీత్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఈవెంట్ కోసం చిత్ర బృందం పెట్టిన కండిషన్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.


వారికి మాత్రమే అనుమతి అంటున్న చిత్ర బృందం..

జూలై 21వ తేదీన భారీ అంచనాల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్స్ రాజమౌళి (Rajamouli), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తో పాటు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు పలువురు కర్ణాటక మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఇక కుటుంబ సభ్యులను ఈ కార్యక్రమానికి పిలవకూడదు అనే ఒక సిద్ధాంతం తోనే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానించలేదని.. నిన్న నిర్మాత ఏ.ఎం.రత్నం (AM Ratnam) వెల్లడించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈరోజు హైదరాబాదులోని శిల్పకళా వేదికలో జరగబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి మెగా సూర్య ప్రొడక్షన్స్ అభిమానులకు ఒక విజ్ఞప్తి చేసింది. “సరైన పాస్ లు ఉన్న వారికి మాత్రమే అనుమతి.. పాస్ లు లేని వారు వేదిక వద్ద గుమిగూడవద్దు” అని కోరింది. భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.


ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అభిమానులు అసహనం..

వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మొదట తిరుపతిలో నిర్వహిస్తామని మేకర్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఆ వేదికను మారుస్తూ విశాఖకు షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఒక పెద్ద ప్రాంగణంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామన్నారు. కానీ అది కూడా జరగలేదు. ఇప్పుడు హైదరాబాదులో అందులోనూ చిన్న వేదికపై ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుండడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల తర్వాత తమ అభిమాన హీరో సినిమా రాబోతోంది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఏ రేంజ్ లో ఉండాలి. కనీసం 50,000 మంది అయినా అభిమానులు రావాలి కదా.. ఎందుకు నిర్మాత ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.. అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు ఇప్పుడు పాస్ పేరిట తమ అభిమాన హీరోని చూసే అవకాశం కూడా లేకుండా పోయింది అని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి 24వ తేదీన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు.

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×