Sekhar Kammula: శేఖర్ కమ్ముల (Sekhar Kammula) టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. గత పాతిక సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఈయన చేసినది తక్కువ సినిమాలే అయినప్పటికీ సక్సెస్ రేట్ మాత్రం ఎక్కువగా ఉందని చెప్పాలి. శేఖర్ కమ్ముల సినిమాలు అంటే ఒక ఫీల్ గుడ్ సినిమా అనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఈయన సినిమాలు చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కుటుంబం మొత్తం కూర్చొని చూసే విధంగా ఉంటాయని చెప్పాలి. శేఖర్ కమ్ముల సినిమాలు మనసుకు చాలా ప్రశాంతతను కల్పిస్తాయి. ఇలా ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఈయన తాజాగా కుబేర (Kuberaa)అనే సినిమా ద్వారా మరో హిట్ అందుకున్నారు.
హీరోయిన్లకు మంచి పాత్రలు..
శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన కుబేర సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ కావడంతో శేఖర్ కమ్ముల తదుపరి ప్రాజెక్టు ఏంటి అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే తాజాగా శేఖర్ కమ్ముల సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది ఈయన స్టార్ హీరో సమంతతో(Samantha) ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతుంది. ఒకానొక సమయంలో సమంత శేఖర్ కమ్ముల సినిమాల గురించి మాట్లాడుతూ ఆయనతో సినిమా చేయాలని ఉందని, ఆయన హీరోయిన్లకు చాలా అద్భుతమైన పాత్రలు రాస్తారంటూ తెలిపారు.
లేడీ ఓరియంటెడ్ సినిమా..
ఇలా గతంలో తన మనసులో కోరికను బయటపెట్టిన సమంత ఆయన డైరెక్షన్లో చేసే ఛాన్స్ వచ్చిందా అంటే అవునని తెలుస్తోంది. సమంత కోసం శేఖర్ కమ్ముల అద్భుతమైన ప్రాజెక్టు సిద్ధం చేయబోతున్నారట. సమంత కోసం ప్రత్యేకంగా లేడీ ఓరియంటెడ్(Lady oriented ) సినిమా చేయాలని ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే శేఖర్ కమ్ముల సమంతతో చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
వెబ్ సిరీస్ లపై ఫోకస్ చేసిన సమంత..
ఇక సమంత కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె హీరోయిన్గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. ఇదివరకే తన నిర్మాణ సంస్థలో శుభం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న సమంత ఇటీవల కాలంలో ఎక్కువగా వెబ్ సిరీస్ లపై ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత నెట్ ఫ్లిక్స్ కోసం రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ లో నటిస్తున్నారు. ఇక వెండి తెరపై సమంత చివరిగా ఖుషీ అనే సినిమాలో కనిపించి సందడి చేశారు. ఈ సినిమా తర్వాత హీరోయిన్ గా సమంత ఎలాంటి సినిమాలలో నటించలేదని చెప్పాలి.
Also Read: Ravi Kishan: పాలతో స్నానం.. గులాబీ రేకులపై నిద్ర… ఈ హీరో లేవలే వేరు?