BigTV English

Rajamouli: డేవిడ్ వార్నర్ కి జక్కన్న స్పెషల్ గిఫ్ట్.. ఎందుకు? ఏంటో తెలుసా?

Rajamouli: డేవిడ్ వార్నర్ కి జక్కన్న స్పెషల్ గిఫ్ట్.. ఎందుకు? ఏంటో తెలుసా?

Rajamouli: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు రాజమౌళి(Rajamouli). చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఫ్లాప్ ఎరుగని డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు తెచ్చుకోవడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించారు. ఇక తర్వాత ‘ ‘బాహుబలి 2’తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన రాజమౌళి, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఏకంగా ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడిచారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu) తో కలిసి ‘ఎస్ఎస్ఎంబి 29’ అనే వర్కింగ్ టైటిల్తో అంతర్జాతీయ స్థాయిలో సినిమా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.


బాహుబలి వేషధారణలో డేవిడ్ వార్నర్..

అయితే ఇలాంటి ఈయన.. ఇప్పుడు ప్రముఖ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (Devid Warner) కి బంపర్ సర్ప్రైజ్ ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఎక్కువగా ఇండియన్ సెలబ్రిటీలను ఇమిటేట్ చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న డేవిడ్.. ఎక్కువగా అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాలలోని డైలాగులతో పలు వీడియోలు, రీల్స్ చేస్తూ తెగ వార్తల్లో నిలుస్తున్నారు. దీనికితోడు ఇటీవల నితిన్ (Nithin) ‘రాబిన్ హుడ్’ సినిమా ప్రమోషన్స్ లో కూడా సందడి చేశారు. అంతలా పేరు దక్కించుకున్న డేవిడ్ వార్నర్ తాజాగా ‘బాహుబలి’ వేషధారణలో ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. అంతేకాదు “కిరీటం ఉన్న ఫోటో బాగుందా? లేని పిక్ నచ్చిందా? అంటూ డేవిడ్ క్యాప్షన్ కూడా పెట్టారు.. ఇక ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో వీటిపై జక్కన్న కూడా స్పందించడం జరిగింది.


డేవిడ్ వార్నర్ కి జక్కన్న స్పెషల్ గిఫ్ట్..

తాజాగా రాజమౌళి ఈ ఫోటోలు కింద కామెంట్ లో స్పందిస్తూ.. “హాయ్ వార్నర్.. మీరు నిజమైన మాహిష్మతి రాజులా దుస్తులు ధరించే సమయం వచ్చింది. మీకు రాయల్ హెల్మెట్ పంపుతున్నాను” అంటూ తెలిపారు. ఇక ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అటు బాహుబలి వేషధారణలో డేవిడ్ వార్నర్ కూడా చాలా చక్కగా కనిపిస్తున్నారు . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక రాజమౌళి కామెంట్ కి “దానికోసం ఎదురు చూస్తూ ఉంటాను” అంటూ క్రికెటర్ చెప్పగా..” మీరు ఆస్ట్రేలియాలో ఈ సినిమాను మరోసారి చూడండి” అంటూ టీం మళ్ళీ కామెంట్ పెట్టింది. దీనికి వార్నర్ కూడా ఓకే అంటూ థంబ్ ఇచ్చారు.

బాహుబలి: ది ఎపిక్ పేరుతో విడుదల..

ఇకపోతే రెండు భాగాలుగా అలరించిన ఈ బ్లాక్ బస్టర్ సినిమా.. ఇప్పుడు ఒకే పార్ట్ గా రానుంది. ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, కన్నడ , హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

ALSO READ:HHVM Collections: వీరమల్లు 5 రోజుల వసూళ్లు… సేఫ్ అవ్వాలంటే ఇంక ఎన్ని కోట్లు రావాలంటే..?

 

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×