Solar Eclipse 2025: ఆగష్టు 2న సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. దీని కారణంగా మొత్తం ప్రపంచం ఆరు నిమిషాల పాటు చీకటిగా మారుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి గ్రహణం మరో 100 సంవత్సరాల వరకు మళ్ళీ రాదని కొంత మంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈ వార్తలపై నాసా కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 2న బ్లాక్ అవుట్ ఉండదని వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం.. ఆగస్టు 2, 2027 ప్రపంచ వ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుందని వెల్లడించింది. ఈ చంద్ర గ్రహణం ప్రభావం యూరప్, ఉత్తర ఆఫ్రికాతో పాటు మిడిల్ ఈస్ట్ లోని ప్రాంతాలపై ఉంటుందని తెలిపింది.
2027న ‘శతాబ్దపు గ్రహణం’
ఇక ఆగస్టు 2, 2027న జరిగే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ‘శతాబ్దపు గ్రహణం’గా పిలువనున్నారు. ఇది 21వ శతాబ్దంలో భూమిపై అతి ఎక్కువ సమయం చీకటి ఏర్పడేలా చేస్తుంది. ఈ గ్రహణం ప్రభావం 6 నిమిషాల 22 సెకన్ల వరకు ఉంటుంది. 2027న జరిగే సూర్యగ్రహణం దాదాపు 160 మైళ్లు (258 కిలోమీటర్లు) వెడల్పుతో భూమి ఉపరితలం నుంచి 9,462 మైళ్లు (15,227 కిలోమీటర్లు) ఉంటుంది. మొత్తంగా స్పెయిన్, జిబ్రాల్టర్, మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, ఈజిప్ట్, సూడాన్, సౌదీ అరేబియా, యెమెన్, సోమాలియాతో సహా 11 దేశాల మీద దీని ప్రభావం ఉంటుంది. ఆయా దేశాల ప్రజలు పగటి పూట చీకటిని చూసే అవకాశం ఉంటుంది. ఆఫ్రికా, యూరప్, దక్షిణ ఆసియాలో చాలా వరకు పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఉత్తర అమెరికా, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఎటువంటి గ్రహణ ప్రభావం కనిపించదు.
సంపూర్ణ సూర్యగ్రహణం అంటే ఏంటి?
చంద్రుడు సూర్యుడు, భూమి మధ్య నేరుగా కదులుతూ సూర్యుడికి పూర్తిగా అడ్డుగా వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఇది సూర్యరశ్మిని భూమికి చేరకుండా కొద్దిసేపు అడ్డుకుంటుంది. దీని ద్వారా పగటిపూట గ్రహణం ప్రత్యక్షంగా ఉన్న చోట దాదాపు చీకటిగా మారుతుంది. సంపూర్ణ సూర్యగ్రహణం సాధారణంగా కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది.
Read Also: నీతా అంబానీ A2 పాలే తాగుతుందా? వాటి ప్రత్యేకత తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!
2025 నెక్ట్స్ సూర్యగ్రహణం ఎప్పుడంటే?
2025లో నెక్ట్స్ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21, 2025న వస్తుంది. ఇది పాక్షిక గ్రహణం. చంద్రుడు సూర్యుని డిస్క్ ను పాక్షికంగా కప్పేస్తాడు. ఈ అమరిక ఫలితంగా, సూర్యుడు దాని నుంచి ఒక భాగాన్ని తీసివేసినట్లుగా కనిపిస్తుంది. చంద్రవంక ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇక తాజాగా ఆగష్టు 2న ఏర్పడే సూర్యగ్రహణం ప్రభావం పాక్షికంగా ఉంటుందని నాసా పరిశోధకులు తెలిపారు. ఏ దేశంలోనూ చీకటి కనిపించే అవకాశం లేదని వెల్లడించారు.
Read Also: పగటి సమయం తగ్గి ఇకపై రాత్రి పెరుగుతుందట, ఎందుకో తెలుసుకోండి