Hero Ajith : తమిళ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నటించిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవ్వడంతో ఇక్కడ కూడా ఈయనకు అభిమానులు ఎక్కువే. అజిత్ నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఆయన సినిమాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఏడాదికి ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు అజిత్. రీసెంట్ గా విడాముయర్చి చిత్రం మినహా అన్నీ విజయం సాధించాయి. తాజాగా అజిత్ కథానాయకుడిగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది.. ప్రస్తుతం రేస్ పై ఫోకస్ పెట్టిన అజిత్ త్వరలోనే సినిమాలను అనౌన్స్ చెయ్యనున్నాడు. ఈ క్రమంలో ఆయన రెమ్యూనరేషన్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
రెమ్యూనరేషన్ కోసం అజిత్ డీల్..
హీరో అజిత్ చేస్తున్న సినిమాలు ఎప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకోవడంతో పాటుగా భారీగా కలెక్షన్స్ ను కూడా అందుకుంటుంది. అయితే సినిమాలు హిట్ అవుతున్న కొద్ది ఆయన రెమ్యూనరేషన్ కూడా పెంచుతున్నాడు. తాజాగా రెమ్యూనరేషన్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల్లో టాక్.. ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించేందుకు రెడీ అవుతున్నాడట. ఇది ఫ్రీ సర్వీస్ మాత్రం కాదు. అజిత్, నిర్మాత రాహుల్ ఒక డీల్ చేసుకున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ డీల్ ఏమిటంటే చిత్రం విడుదలైన తరువాత ఓటీటీ, డిజిటల్ హక్కులను అజిత్‌కు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే ఆయనకు తీసుకుంటున్న దానికన్నా ఎక్కువగానే వస్తుంది. మరి నిర్మాతలు అజిత్ డీల్ కు ఒప్పుకుంటారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈయన ఒక్కో సినిమాకు 170 కోట్ల వరకు తీసుకుంటున్నాడు..
Also Read : బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. అదే ఫైనల్ డెసిషన్!
నెక్స్ట్ ఎవరికి ఛాన్స్ ఇస్తున్నాడు..
హీరో అజిత్ కేవలం సినిమాలు మాత్రమే కాదు.. తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్ లో కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నో మెడల్స్ ను కూడా అందుకున్నాడు. ప్రస్తుతం కారు రేస్‌పై దృష్టి సారిస్తున్న అజిత్ త్వరలో కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు.. ఈ మూవీ తర్వాత సినిమాలకు కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చెయ్యనున్నాడట.. అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ చేశాడు.. ఇది భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఓటీటీలో ఈ మూవీ మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది.. ప్రస్తుతం రెండు, మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఒక్కొక్కటి అనౌన్స్ చెయ్యబోతున్నట్లు టాక్..