BigTV English

Aditya 999: బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. అదే ఫైనల్ డెసిషన్!

Aditya 999: బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. అదే ఫైనల్ డెసిషన్!

Aditya 999: నందమూరి నరసింహం బాలయ్య ఏడాదికి రెండు మూడు సినిమాలు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ ఏడాది ముందుగా సంక్రాంతికి డాకు మహారాజు సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు త్వరలోనే అఖండ 2 తో థియేటర్లలోకి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ మూవీ సెప్టెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ తర్వాత మరో భారీ ప్రాజెక్టు లో బాలయ్య నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఆదిత్య 999 మూవీలో నటిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేసే అవకాశం ఉన్నా, కథలో మార్పులు చేస్తే ద్విపాత్రాభినయంగా మారే అవకాశం ఉందట..


ద్విపాత్రాభినయంలో బాలయ్య.. 

బాలయ్య సినిమాలకి క్రేజ్ ఎక్కువ. మాస్ యాక్షన్ నేపథ్యంలోనే ఆయన సినిమాలు ఉంటాయి. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహరాజ్ చిత్రాలతో ఒకదానికి మించి మరొకటి హిట్లు కొడుతూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్లో ‘అఖండ 2’లో నటిస్తున్నారు..ఇది సెప్టెంబర్ 25 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. దీని తర్వాత ‘వీరసింహారెడ్డి’ లాంటి మాస్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు. దాంతో పాటు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో స్వీయ నిర్మాణంలో ‘ ఆదిత్య 999 ’ మూవీని కూడా చేస్తున్నాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో డ్యూయల్ రోల్ చెయ్యనున్నాడని వార్తలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి. అదే గనక నిజం అయితే బాలయ్య ఫ్యాన్స్ కు పునకాలే అన్నమాట.


Also Read : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

రికార్డును బ్రేక్ చెయ్యబోతున్న బాలయ్య.. 

ఈమధ్య తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యూయల్ రోల్ చేయడం కామన్ అయిపోయింది. చాలామంది స్టార్ హీరోలు ఇలాంటి పాత్రల్లో కనిపించి తమ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి పాత్రల్లో బాలయ్య నటించడం గ్రేట్. ఇప్పటివరకు ఆయన సింహా, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి చిత్రాల్లో ఆయన రెండు పాత్రల్లో నటించారు. అంతకుముందు వచ్చిన ‘అధినాయకుడు’లో అయితే ఏకంగా మూడు పాత్రల్లో నటించారు. ఈ మధ్య త్రిపుల్ రోల్లో ఎక్కువగా సినిమాలు రాలేదు. ఇప్పుడు బాలయ్య, క్రిష్ కాంబోలో రాబోతున్న సినిమాలో మూడు పాత్రల్లో కనిపించనున్నారట. ఈ సినిమాకి ప్రీక్వెల్ అయిన ‘ఆదిత్య 369’ చిత్రంలో కృష్ణకుమార్, శ్రీకృష్ణదేవరాయలుగా బాలయ్య మెప్పించిన సంగతి తెలిసిందే.. మరి ఇందులో రెండు పాత్రలు చేస్తాడా? లేదా మూడు పాత్రల్లో నటిస్తాడా అన్నది బాలయ్య నిర్ణయానికి వదిలేసాడు క్రిష్.. ఆయనదే ఫైనల్ డెసిషన్.. ఏది ఏమైనా కూడా బాలయ్యను మళ్ళీ ఇన్నాళ్లకు మూడు పాత్రల్లో చూడాలని నందమూరి అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.. చూడాలి మరి బాలయ్య నిర్ణయం ఎలా ఉంటుందో.. అఖండ 2 షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు బాలయ్య. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు వరుసగా సినిమాలు చేస్తున్నాడు బాలయ్య.. ఆ తర్వాత ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడో చూడాలి.

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×